View

ఇంటర్య్వూ -  డైరెక్టర్ వెంకట్ ప్రభు (కస్టడీ)

Tuesday,May09th,2023, 03:29 PM

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ 'కస్టడీ' మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌ లో ఒకటి. కృతి శెట్టి కథానాయిక గా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాల తో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న  ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని పవన్‌ కుమార్‌ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపధ్యంలో దర్శకుడు వెంకట్ ప్రభు విలేకరుల సమావేశంలో కస్టడీ విశేషాలని పంచుకున్నారు.


కస్టడీ జర్నీ ఎలా మొదలైయింది ?
కోవిడ్ సమయంలో ఈ కథ ఆలోచన వచ్చింది. అప్పుడే రాసుకున్నా. ఈ కథ ఆలోచన కు స్ఫూర్తి మలయాళం సినిమా నయట్టు. అయితే అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ వుండవు. తెలుగు తమిళ ప్రేక్షకుల కోసం చేసిన్నపుడు కమర్షియల్ ఎలిమెంట్స్ వుండాలి. పెద్ద ఆశయాలతో వున్న ఒక సాధారణ కానిస్టేబుల్ కథ చెప్పాలనేది ఆలోచన. అలా రాయడం మొదలుపెట్టాను. అలా కస్టడీ పుట్టింది. ‘లవ్ స్టొరీ’ లో ఒక పాట చూశాను. అందులో నాగచైతన్య ఈ పాత్రకు సరిపోతాడనిపించింది. నాగచైతన్యకు కథ చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. అలాగే నిర్మాత శ్రీనివాస గారు జాయిన్ అయ్యారు. ఆయనకి నాతో ఎప్పటి నుంచో సినిమా చేయాలని వుంది.   అలా జర్నీ మొదలైయింది.  


కస్టడీలో ప్రేమకథ కూడా వుంటుందా ?
శివ ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన కానిస్టేబుల్. తనకి కుటుంబం వుంటుంది. అలాగే ప్రేమగా కూడా వుంటుంది. సినిమా శివకి వచ్చిన సమస్యతో మొదలౌతుంది. తనది కాని సమస్య తను ఎదురుకోవాల్సి వస్తుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకూ సినిమా ఎడ్జ్ అఫ్ సీట్ థ్రిల్లర్ లా వుంటుంది. తెలుగు, తమిళ ఆడియన్స్ అభిరుచికి తగట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అందరూ ఎంజాయ్ చేసేలా వుంటుంది. స్క్రీన్ ప్లే ఫాస్ట్ ఫేస్డ్ గా వుంటుంది.


అరవింద్ స్వామీ గారికి పెద్ద ఇమేజ్ వుంది కదా ?
స్క్రీన్ పై చైతు కంటే పవర్ ఫుల్ గా కనిపించే వ్యక్తి కావాలనే ఆలోచనతో అరవింద్ స్వామీ గారిని తీసుకోవడం జరింగింది. అంత పవర్ ఫుల్ వ్యక్తిని ఎలా కంట్రోల్ చేస్తాడనే ఎక్సయిట్ మెంట్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అలాగే శరత్ కుమార్ గారి పాత్ర కూడా పవర్ ఫుల్ గా వుంటుంది.  


నాగచైతన్య నటన గురించి ?
నాగచైతన్య అద్భుతమైన నటుడు. ఈ చిత్రంలో కొత్త చై ని చూస్తారు. నా సినిమాల్లో హీరోలని డిఫరెంట్ గా చూపించడానికి ఇష్టపడతాను. ఇందులో కూడా చై చాలా కొత్తగా కనిపిస్తారు. యాక్షన్ ని చాలా యూనిక్ గా డిజైన్ చేశాం. అన్నీ ఫ్రెష్ గా వుంటాయి.


కస్టడీ కి మ్యూజిక్ ఎంత బలం చేకూర్చుతుంది.  
ట్రైలర్ లో వినే వుంటారు. ఇళయరాజా గారు, యువన్ శంకర్ రాజా నెక్స్ట్ లెవల్ లో మ్యూజిక్ చేశారు. కస్టడీ మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్. చాలా యూనిక్ సౌండ్ వింటారు ప్రేక్షకులు.


మానాడులో పొలిటికల్ పార్టీ గురించి వుంది.. కస్టడీ లో ముఖ్యమంత్రి పాత్ర చూపించారు? అదే యూనివర్స్ లో ఉంటుందా ?
లేదండీ. తమిళనాడు లో కూడా ఇదే ప్రశ్న అడిగారు. కస్టడీ ది డిఫరెంట్ వరల్డ్.


రెండు భాషల్లో చేయడం ఎలా అనిపించిది ?
చాలా కష్టమైన టాస్క్ ఇది. ప్రతి షాట్ రెండు సార్లు సీజీ చేయాలి. డైలాగ్స్, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, రెండు భాషల్లో సెన్సార్లు,.. ఒకటి కాదు.. దాదాపుగా రెండు సినిమాలు తీసినట్లే. మెంటల్ గా ఫిజికల్ గా చాలా శ్రమ పడాల్సి వుంటుంది.


ఈ సినిమాకి ‘శివ’ అనే టైటిల్ ని పరిశీలించారా ?
నేను శివ సినిమాకి పెద్ద ఫ్యాన్ ని. నాగార్జున గారి అబ్బాయితో సినిమా చేస్తున్నపుడు అందులో పాత్ర పేరు శివ అయినప్పుడు అదే పేరు పెట్టాలని అనుకున్నాను. అయితే చైతు వద్దు అని చెప్పారు. అది కల్ట్ క్లాసిక్. చాలా పోలికలు వస్తాయని అన్నారు.  


కృతిశెట్టి  పాత్ర గురించి ?
ఇందులో కృతి పేరు రేవతి. చాలా అద్భుతంగా చేసింది.  తన పాత్ర కథలో కీలకంగా వుంటుంది. నేను రాసుకున్న పాత్రకు తగ్గట్టు గా స్క్రీన్ పై కనిపించింది.


పాటలకు, డ్యాన్సులకు ఎంత ప్రాధాన్యత వుంటుంది ?
ఓపెనింగ్ సాంగ్ వుంటుంది. అలాగే ఒక పాటని రెట్రో స్టయిల్ లో షూట్ చేశాం. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.


కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
ఒక పెద్ద ప్రాజెక్ట్ వుంటుంది. త్వరలోనే చెబుతాను.


ఆల్ ది బెస్ట్
థాంక్స్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !