View

ఇంటర్య్వూ - నిర్మాత శ్రీనివాస చిట్టూరి (కస్టడీ)

Wednesday,May10th,2023, 02:54 PM

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ 'కస్టడీ' మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌ లో ఒకటి. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా ని నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక  ప్రాజెక్ట్‌ ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో  నిర్మాత శ్రీనివాస చిట్టూరి విలేకరుల సమావేశంలో కస్టడీ విశేషాలని పంచుకున్నారు.  


అందరూ మన దర్శకుల వైపు చూస్తుంటే మీరు బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు తమిళ దర్శకులని ఇక్కడికి తీసుకొచ్చారు?
మన దర్శకులు కూడా బాగా బిజీగా ఉన్నారు కదా. అందరికి రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ‘గ్యాంబ్లర్’ సినిమా నుంచి వెంకట్ ప్రభుతో సినిమా చేయాలని అనుకున్నాను. తన స్క్రీన్ ప్లే, ఆలోచించే విధానం నాకు చాలా ఇష్టం. ఎంత పెద్ద సీరియస్ ఇష్యూ ని కూడా మంచి స్క్రీన్ ప్లే లో ఎంటర్ టైన్ మెంట్ గా చెప్పగలరు.


ఒక నిర్మాతగా ఇందులో మీకు ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
కథ, మంచి స్క్రీన్ ప్లే. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ తో సీరియస్ కథ జరుగుతుంటుంది. సీరియస్ లో కూడా ఎంటర్ టైన్ మెంట్ వుంటుంది. ఈ రెండిటిని దర్శకుడు మిక్స్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. తెలుగు ఎమోషన్స్ తో ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.


పోలీస్ కథ అంటే యూనివర్సల్ అప్పీల్ వుంటుంది కదా.. పాన్ ఇండియా ప్లాన్ చేయలేదా ?
మొదటి నుంచి ఇది  బైలింగ్వెల్  చిత్రం అనుకున్నాం. బైలింగ్వెల్ కూడా తెలుగు కి ప్రత్యేకమైన షాట్, తమిళ్ కి ప్రత్యేకమైన షాట్ తీశాం. రెండు సినిమాలు తీసినట్లే. హిందీలో తర్వాత వుంటుంది.


తెలుగు లో ఎక్కువగా కమర్షియల్ ని ఇష్టపడతారు.. తమిళ్ లో 'రా', సెన్సి బిలటీ వేరుగా వుంటుంది. ఈ  రెండిటిని  ఎలా బ్యాలెన్స్ చేశారు ?
మీరు చెబుతున్న రా, సెన్సిబుల్, కమర్షియల్ అన్నీ ఇందులో ఉంటాయి.


రెండు భాషల్లో వేరువేరు నటులు కనిపిస్తారా ?
తెలుగు లో వెన్నెల కిషోర్ గారు వున్నారు. ఆ పాత్ర ని తమిళ్ లో ప్రేమ్ జీ చేశారు. ఆ ఒక్క పాత్రలో మార్పు వుంటుంది. మిగిలినవి యాజిటీజ్.


కస్టడీ కథలో పోలీస్ వ్యవస్థ గురించి ఉంటుందా ?
ఇది నిజాయితీ గల ఒక కానిస్టేబుల్ కథ. రూరల్ పోలీస్ స్టేషన్ లోని ఒక కానిస్టేబుల్ కథ. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి.  


తమిళ హీరోల సినిమాలని ఇక్కడ ఆదరిస్తున్నారు కానీ తెలుగు హీరోలని అక్కడ అంతగా ఆదరణ లభించడం లేదనే అభిప్రాయం ఉంది కదా ?
లేదండీ. ‘యూ టర్న్’  తెలుగు కంటే  అక్కడ పెద్ద హిట్. అలాగే వారియర్ కి కూడా బాగా వచ్చింది.


ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ని పెట్టడానికి కారణం ?
ఇది 90లో జరిగే కథ. ఇలాంటి సినిమాకి నేపధ్యం సంగీతం ఇళయరాజా గారు వుంటే బావుంటుందని ఆయన్ని తీసుకోవడం జరిగింది. కథ వినగానే ఇళయరాజా గారు, యువన్ మేము చేస్తామని ముందుకు రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.


హీరోని బట్టి బడ్జెట్ లెక్కలు వేసుకుంటారా ? కథకు ఖర్చు చేస్తారా ?
యూటర్న్ తీసేనాటికి సమంత గారి మార్కెట్ ఏమిటో ఎవరికీ తెలీదు. కథ నచ్చి చేశాను. కథకు కావాల్సింది ఖర్చుపెట్టాను. అలాగే గోపిచంద్ సిటిమార్, రామ్ వారియర్ వారి కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాలు. కథ నచ్చే చేశాను. కస్టడీ కూడా నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ. బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా కథకు కావాల్సింది ఖర్చు పెట్టాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. కంటెంట్ పరంగా, బిజినెస్ పరంగా హ్యాపీ గా వున్నాను.


మీ సినిమాలకి ఇంగ్లీష్ పేర్లు పెట్టడానికి కారణం ?
ప్రత్యేకంగా అలా ఏమీ లేదండీ. కథకు తగ్గట్టుగా కుదిరాయి. ఈసారి మాత్రం చక్కని తెలుగు టైటిల్ తో వస్తున్నాం.


హీరోలు, దర్శకుల కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నారు కదా ? ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది ?
నాకు ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఇరవై ఏళ్ల అనుభవం వుంది. ఆ అనుభవంతో ఎక్కడ అవసరమో అది చేసుకుంటూ వెళ్తున్నాను.


కృతిశెట్టిని మరోసారి  హీరోయిన్ గా ఎంపిక చేయడానికి కారణం?
కృతిశెట్టి మంచి ఆర్టిస్ట్. లీడింగ్ హీరోయిన్. యూత్ అందరికీ ఇష్టమైన హీరోయిన్. చాలా మంచి నటన కనబరుస్తుంది.


కస్టడీ ఎన్ని థియేటర్స్ లో విడుదల అవుతోంది ?
తెలుగులో నాగచైతన్య గారి కెరీర్ లోనే హయ్యస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. తమిళనాడులో 200 థియేటర్స్ పై గా విడుదలౌతుంది.  


తమిళ ప్రమోషన్స్ ఎలా జరుగుతుంది ?
చాలా బావుంది. మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి అంచనాలు వున్నాయి.


అవుట్ పుట్ చూసుకున్న తర్వాత ఏ స్థాయి సినిమా అవుతుందని భావిస్తున్నారు ?
చైతన్య గారి కెరీర్ లోనే హయ్యస్ట్ ఫిల్మ్ అవుతుంది. నాగార్జున గారి కెరీర్ లో ‘శివ’ ఎలా గుర్తుండి పోయిందో నాగచైతన్య కెరీర్ లో కస్టడీ అలా గుర్తుండిపోతుంది. శివ సినిమానే కాదు అందులో పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. కస్టడీలోని అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి.. పాత్రలు గుర్తుండిపోతాయి. ప్రతి పాత్ర యూనిక్ గా వుంటుంది.


దర్శకుడు ఈ చిత్రానికి శివ అనే పేరు పెడతామని అనుకున్నారట ?
నాకు అదే యాప్ట్ టైటిల్ అనిపించింది. కానీ చైతు గారు పోలికలు వస్తాయి వద్దు అన్నారు.


అరవింద్ స్వామి పాత్ర ఎలా వుంటుంది ? శరత్ కుమార్, ప్రియమణి పాత్రల గురించి ?
అరవింద్ స్వామి గారు కథ వినగానే మరో ఆలోచన లేకుండా ఈ పాత్ర చేస్తానని చెప్పారు. థియేటర్ లో ఆయన పాత్రని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. టెర్రిఫిక్ గా అదే సమయంలో చాలా ఎంటర్టైనింగ్ గా వుంటుంది ఆయన పాత్ర. శరత్ కుమార్ గారి పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా వుంటుంది. రెండు కొండల మధ్య చిట్టెలుక వుంటే ఎలా వుంటుందో అరవింద్ స్వామి, శరత్ కుమార్ మధ్య నాగచైతన్య గారి పాత్ర అలా కనిపిస్తుంది. ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారు.


కస్టడీ లో కామెడీ ట్రాక్ ఉంటుందా ?
ఇందులో ట్రాకులు వుండవు.  ఒక సీన్ కి వచ్చి వెళ్ళిపోయే పాత్ర వుండదు, అలాగే పాటల్లో కనిపించి వెళ్ళిపోయే హీరోయిన్ వుండదు. మొదటి సీన్ నుంచి చివరి దాక ఒక ఇంటర్ లింక్ వుంటుంది. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత వుంటుంది.


కస్టడీ అండర్ వాటర్ సీక్వెన్స్ గురించి చెప్పండి ?
తెలుగు స్క్రీన్ మీద ఇలాంటి అండర్ వాటర్ సీక్వెన్స్ చూసి వుండరు. హలీవుడు స్టైల్ లో మన ఎమోషన్స్ తో చాలా ఎక్స్ టార్డినరి గా వుంటుంది. దాదాపు ఇరవై రోజు ఈ సీక్వెన్స్ చేశాం. డైలీ రెండు కాల్షీట్లు పైనే  అయ్యేది. మైసూర్, రాజమండ్రి ప్రాంతాల్లో షూట్ చేశాం. అలాగే  దిని కోసం స్పెషల్ గా సెట్ కూడా వేశాం. ఇందులో  నాలుగు యాక్షన్ సీక్వెన్స్ లు అద్భుతంగా ఉంటాయి.


కస్టడీ 2 ఉంటుందా ?
ఖచ్చితంగా వుంటుంది. సక్సెస్ అవుతుందనే నమ్మకంతోనే చెబుతున్నాను.


రామ్ బోయపాటి సినిమా గురించి ?
షూటింగ్ కంటిన్యూగా జరుగుతోంది. రామ్ గారి బర్త్ డే కి టీజర్ రిలీజ్ చేస్తాం.


నాగార్జున గారి సినిమా గురించి ?
జూన్ నుంచి షూటింగ్ వుంటుంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతాం. అలాగే నాగచైతన్య తో మరో సినిమా చేయాలి.


ఆల్ ది బెస్ట్
థాంక్స్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !