View

'అసుర' క్లాస్, మాస్ తేడా లేకుండా ఆకట్టుకుంటుంది - నారా రోహిత్

Wednesday,June03rd,2015, 11:56 AM


'బాణం', 'సోలో', 'ప్రతినిధి', 'రౌడీఫెలో' తదితర చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో నారా రోహిత్ ప్రస్తుతం నటించిన చిత్రం 'అసుర'. నారా రోహిత్ సమర్పణలో దేవాస్ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్, కుషాల్ సినిమా, ఆరన్ మీడియా వర్క్స్ పతాకాలపై కృష్ణ విజయ్ దర్శకత్వంలో శ్యామ్ దేవభక్తుని, కృష్ణ విజయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియా బెనర్జీ కథానాయికగా రూపొందిన ఈ చిత్రం ఈ శుక్రవారం (5.6.2015) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ తో ఫిల్మీబజ్ జరిపిన ఇంటర్య్వూ మీ కోసం...

'అసుర' చిత్రం ఎలా ఉండబోతోంది?
'అసుర' అవుట్ అండ్ అవుడ్ యాక్షన్ థ్రిలర్ గా రూపొందిన చిత్రం. కథను నమ్మి చేసిన చిత్రం ఇది. సినిమా ఆరంభమైన 25నిముషాలు, ఇంటర్వెల్ కు ముందు 20నిముషాలు, క్లయిమ్యాక్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఇప్పటిదాకా నా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లేవు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా ఉంది. అన్ని కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ చిత్రం క్లాస్, మాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకూ కనెక్ట్ అవుతుంది.

మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
ఈ చిత్రంలో నా పాత్ర పేరు ధర్మ. జైలర్ అయిన ధర్మ పని విషయంలో రాక్షసుడు. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలకు భిన్నంగా 'అసుర' చిత్రంలో నా పాత్ర ఉంటుంది. 'రౌడీ ఫెలో' ఓ రకమైన యాటిట్యూడ్ తో నా పాత్ర ఉంటుంది. 'అసుర' సినిమాలో నా క్యారెక్టర్ ఓ రకమైన యూటిట్యూడ్ తో ఉంటుంది. నా నుంచి ఆడియన్స్ ఎలాంటి సినిమా కావాలని కోరుకుంటారో 'అసుర' అలా ఉంటుంది.

'రౌడీ ఫెలో' చిత్రంలో పోలీసాఫీసర్ గా నటించారు. ఈ చిత్రంలో కూడా పోలీసాఫీర్ గా నటించారు?
అవును. కానీ 'రౌడీ ఫెలో' కథ, క్యారెక్టరైజేషన్ వేరు. 'అసుర' కథ, క్యారెక్టరైజేషన్ వేరు. పూర్తి భిన్నమైన చిత్రాలు. 'అసుర' కొత్తగా ఉంటుంది.

కొత్త దర్శకులతోనే వర్క్ చేస్తున్నారు?
నా కెరియర్ ఆరంభమైనప్పట్నుంచి కొత్త దర్శకులు మంచి కథలతో నన్ను అప్రోచ్ అవుతున్నారు. నా బాడీ లాంగ్వేజ్ కి సరిపడా కథలు చెబుతున్నారు. అందుకే నేను కూడా వారితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను.

డైరెక్టర్ కృష్ణ విజయ్ గురించి చెప్పండి?
కృష్ణ విజయ్ తో నా పరిచయం ఇప్పటిది కాదు. 'బాణం' చిత్రం నుంచి మేమిద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం. నిజం చెప్పాలంటే తనతో 'మదరాసి' చిత్రం చేయాలనుకున్నాను. అది కుదరలేదు. ఆ తర్వాత 'అసుర' కథ చెప్పాడు విజయ్. తను కథను నెరేట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. సినిమాకి పూర్తి న్యాయం చేయగలడని నమ్మి ఈ సినిమా విజయ్ దర్శకత్వంలోనే చేయాలని ఫిక్స్ అయ్యాను. కథను ఎలా నెరేట్ చేసాడో, అలానే తెరకెక్కించాడు. స్ర్కిఫ్ట్ డిమాండ్ మేరకు పాత బంగ్లాలు ఉన్న చోట షూటింగ్ చేసాం. 50రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసాం. పకడ్బందీ ప్లానింగ్ తో అనుకున్న విధంగా ఈ చిత్రం తెరకెక్కించడం పట్ల మా యూనిట్ మొత్తం హ్యాపీగా ఉన్నాం.

కిస్, జోరు తర్వాత ప్రియా బెనర్జి చేసిన చిత్రం ఇది. ఆమె గురించి చెప్పండి?
ప్రియా బెనర్జికి తెలుగు రాదు. అయినా సరే డైలాగ్స్ నేర్చుకుని చక్కగా డైలాగులు చెప్పింది. దీన్ని బట్టే ఆమెకు వర్క్ మీద ఎంత డెడికేషన్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అద్బుతంగా నటించింది. చూడచక్కగా ఉంటుంది. గ్లామర్ పరంగా, నటన పరంగా ప్రియా బెనర్జి కి మంచి మార్కులు పడతాయి.

'రౌడీ ఫెలో' చిత్రం తర్వాత సన్నబడటానికి వర్కవుట్లు చేస్తున్నారనే వార్తలు వచ్చాయి?
అవును. సన్నబడటానికి వర్కవుట్లు చేయాలనుకుంటున్నాను. అయితే 'రౌడీ ఫెలో' షూటింగ్ చేస్తున్నప్పుడే 'అసుర' చిత్రం షూటింగ్ కూడా చేయడం జరిగింది. 'రౌడీ ఫెలో' విడుదల సమయానికి 'అసుర' చిత్రం షూటింగ్ సగం పూర్తయ్యింది. అందుకే మిగతా సగం అలానే పూర్తి చేసేసాను. తదుపరి సినిమాల కోసం వర్కవుట్లు చేసి సన్నబడాలనుకుంటున్నాను. స్ర్కిఫ్ట్ డిమాండ్ మేరకు సిక్స్ ప్యాక్ కూడా చేస్తాను.

ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఎలా ఉంది?
నాకు సినిమా రంగం అంటే చాలా ఇష్టం. ఒకవేళ నటుడిని అవ్వకపోయుంటే, నిర్మాత అయ్యుండేవాడిని. 'అసుర' సినిమా కోసం నిర్మాతగా నేను పెద్ద కష్టపడలేదు. ఫ్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చూసుకున్నాను. మిగతా ప్లానింగ్ అంతా విజయ్ చూసుకున్నారు. కాబట్టి ఈ సినిమా కోసం నిర్మాతగా నేను పెట్టిన ఎఫర్ట్స్ తక్కువ.

మీ పెదనానగారు నారా చంద్రబాబునాయుడుగారికి మీరు నటించే సినిమాలు చూపిస్తారా?
నా గత చిత్రాలు 'ప్రతినిధి', 'రౌడీ ఫెలో' చిత్రాలు విడుదల సమయంలో పెదనానగారు ఎలక్షన్స్ లో బిజీగా ఉన్నారు. అంతకుముందు చిత్రాలు చూసారు. ఆ సినిమాలు చూసినప్పుడు... కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉన్నాయని, అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరవ్వాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అవసరమని చెప్పారు. అది మనసులో పెట్టుకునే 'ప్రతినిధి', 'రౌడీఫెలో' చిత్రాలు చేసాను. 'అసుర' చిత్రాన్ని ఆయనకు చూపిస్తాను.

మీ తదుపరి చిత్రాలు?
'పండగలా వచ్చాడు' చిత్రంలో నటిస్తున్నాను. యాక్చువల్ గా 'అసుర' కంటే ముందే ఈ సినిమా విడుదలవ్వాల్సి ఉంది. అయితే సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడంతో 'అసుర' ముందు విడుదలవుతోంది. ఆగస్ట్ లో 'పండగలా వచ్చాడు' చిత్రం విడుదలవుతుంది. 'అసుర'కి పూర్తి భిన్నమైన చిత్రం 'పండగలా వచ్చాడు'. ఫ్యామిలీ వ్యాల్యూస్ తో కూడుకున్న లవ్ ఎంటర్ టైనర్ అది. ఇది కాకుండా 'శంకర' చిత్రంలో నటిస్తున్నాను. మరొక చిత్రం శ్రీవిష్ణు, నేను కలిసి చేస్తున్నాం. ఇది ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అంటూ ఇంటర్య్వూకు ముగింపు పలికారు నారా రోహిత్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !