View

అల్టిమేట్ గా కథే ముఖ్యం - హీరో సాయిశ్రీనివాస్

Sunday,July27th,2014, 02:07 PM

నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా పరిచయం అయిన తొలి చిత్రం 'అల్లుడు శీను' ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది. తొలి సినిమాతోనే తన డ్యాన్స్, ఫైట్స్ తో మాస్ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన సాయిశ్రీనివాస్ తనని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు, మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తో మీడియా జరిపిన ఇంటర్వ్యూ మీ కోసం...

 

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు? ఎలా ఫీలవుతున్నారు?

చాలా ఆనందంగా ఉన్నాను. నా జీవితంలో మర్చిపోలేని రోజులు ఇవి. సినిమా విడుదలైన ప్రతి ఏరియా నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వి.వి.వినాయక్, ఛోటా.కె.నాయుడుగార్ల వల్లే ఇది సాధ్యమయ్యింది. వారికి ఈ సందర్భంగా ధ్యాంక్స్ చెబుతున్నాను. ఇక చిత్ర పరిశ్రమ నుంచి, ఆడియన్స్ నుంచి వస్తున్నప్రశంసలు నన్ను మరింత సంతోషపెడుతున్నాయి. తొలి సినిమాలోనే ఎక్స్ పీరియన్స్ ఉన్న హీరోలా చేసావనే ప్రశంస నేను ఈ సినిమా కోసం పడిన కష్టం మర్చిపోయేలా చేసింది. ఆడియన్స్ ఈ సినిమాని పెద్ద హిట్ చేసారు. వారికి నా కృతజ్ఞతలు. ఈ విజయం నాలో మరింత బాధ్యతను పెంచింది.

నటన, ఫైట్స్, డ్యాన్స్... వీటి కోసం శిక్షణ తీసుకున్నారా?

హీరో అవ్వాలనే కోరిక ఉంటే మాత్రం సరిపోదు. నటుడిగా రాణించాలంటే నటన, డ్యాన్స్, ఫైట్స్ ఇలా నవరసాలు పలికించగల సత్తా ఓ నటుడికి ఉండాలి అని నాన్నగారు అంటుండేవారు. ఈ మాటలు నాలో బలంగా నాటుకుపోయాయి. అందుకే వినాయక్ గారు నన్ను హీరోగా పరిచయం చేస్తానని చెప్పినప్పట్నుంచి నటనలో శిక్షణ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. లాస్ ఏంజిల్స్ కి వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నాను. వియత్నాంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఇక ఫైట్స్, డ్యాన్స్ లపై ప్రత్యేకంగా దృష్టి సారించాను. ప్రతిరోజు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాను. ఇవన్ని గత 5సంవత్సరాల నుంచి చేస్తున్నాను.

తొలి సినిమానే వినాయక్ దర్శకత్వంలో నటించడం పట్ల మీ ఫీలింగ్?

వినాయక్ గారితో నాకు చాలా చనువు ఉంది. ఆయన మా ఫ్యామిలీ మెంబర్. చినప్పట్నుంచి ఆయనను చూస్తూ పెరిగాను. అందుకే ఆయనతో నేను చాలా ఫ్రీగా ఉండేవాడిని. నాకు వచ్చిన ప్రతి డౌట్ ని క్లియర్ గా ఎక్స్ ప్లయిన్ చేసేవారు వినాయక్ గారు. ఇక సెట్ లో ప్రతి సీన్ ని చక్కగా వివరించి, తనకు కావాల్సిన ఎక్స్ ప్రెషన్ వచ్చేవరకూ ఓపికగా నాతో చేయించేవారు. ఆ రకంగా నాకు ఈ సినిమా చేయడం ఈజీ అయ్యింది. అందుకే ఈ సినిమా సక్సెస్ కి ప్రధాన కారణం వినాయక్ గారే అని చెబుతున్నాను.

ఈ సినిమా కథ విన్నప్పుడు ఎలా అనిపించింది?

సక్సెస్ ఫార్ములాతో చేయబోతున్నాం అని స్ర్కిఫ్ట్ విన్నప్పుడే అనుకున్నాం. ఈ స్ర్కిఫ్ట్ కోసం వినాయక్ గారు చాలా కష్టపడ్డారు. తొలి సినిమాకి ఇలాంటి మంచి స్ర్కిఫ్ట్ దొరకడం నా అదృష్టం. ముఖ్యంగా నా క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన్ చేసారు వినాయక్ గారు. నా బాడీ లాంగ్వేజ్, నా లుక్ అన్నింటిపై చాలా శ్రద్ధ తీసుకున్నారు. నా క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

తొలి సినిమాలోనే ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంలాంటి సీనియర్ నటులతో నటించారు. వారితో నటించడం ఎలా అనిపించింది?

నన్ను ఓ కొత్త హీరోలా చూడకుండా ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందంగారు నన్ను చాలా ప్రోత్సహించారు. వారు ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే ఎలాంటి బెరుకు లేకుండా నటించగలిగాను. ఇక లాస్ ఎంజిల్స్ నటనలో శిక్షణ తీసుకోవడం నాకు చాలా హెల్ప్ అయ్యింది.

సమంత, తమన్నాలాంటి స్టార్ హీరోయిన్లతో తొలి సినిమాలోనే నటించడం ఎలా అనిపించింది?

సమంత, తమన్నా స్టార్ హీరోల పక్కన నటిస్తున్నారు. అయినా సరే నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. నేను కొత్త వాడిని అనే ఫీలింగ్ నాకు కలిగించేవారు కాదు. స్టార్ హీరోయిన్లా ఎప్పుడూ బిహేవ్ చేయలేదు. ఇద్దరూ చాలా సపోర్ట్ చేసారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు.

ఈ సినిమా చూసినప్పుడు ఇంకా బెటర్ గా నటించి ఉంటే బాగుండేది అనిపించిందా?

సినిమా చూస్తున్నప్పుడు ఏ నటుడికైనా ఇంకా బెటర్ మెంట్ చేసుకుని ఉంటే బాగుంటుందనిపిస్తుంది. ఆ ఫీలింగ్ నాకు కూడా కలిగింది. ఓవరాల్ గా మాత్రం తొలి సినిమాలోనే బాగా నటించాననే సంతోషం కలిగింది.

సొంత బ్యానర్ లోనే సినిమాలు చేస్తారా? లేక బయట బ్యానర్ లో కూడా సినిమాలు చేస్తారా?

సొంత బ్యానర్ లో సినిమాలు ఉంటాయి. అలాగే బయట బ్యానర్ లో మంచి స్ర్కిఫ్ట్ దొరికితే చేస్తాను. అల్టిమేట్ గా కథ బాగుండాలి.

మీరు సినిమా చేయాలంటే కథ ఎవరు ఫైనలైజ్ చేస్తారు?

నాన్నగారికి మంచి జడ్జిమెంట్ ఉంది. ఆయన కథ విని ఒకే చెబితే, ఆ స్ర్కిఫ్ట్ తో సినిమా చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు.

తదుపరి ప్రాజెక్ట్?

ప్రస్తుతం తొలి సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాను. వెంటవెంటనే సినిమాలు చేసేయాలనుకోవడం లేదు. మంచి కథ దొరికితే నా రెండో సినిమా ఆరంభమవుతుంది. నాన్నగారు ప్లానింగ్ ప్రకారం నా సినిమాలు ఉంటాయి అంటూ ఇంటర్య్వూకు ముగింపు పలికారు సాయిశ్రీనివాస్.

 

Iam happy with the success of Alludu Sreenu says Bellamkonda Sai Sreenivas



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !