View

కంటెంట్ చాలా కీలకం - హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ

Wednesday,February07th,2024, 01:20 PM

మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "ట్రూ లవర్". ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. "ట్రూ లవర్" సినిమా ఈ నెల 10వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని హైలైట్స్ తెలిపింది హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ.


- నేను హైదరాబాద్ అమ్మాయిని. చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్, కాలేజ్ ఈవెంట్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాను. మ్యూజిక్ నేర్చుకున్నా. పాటలు పాడతాను. 2018లో మిస్ హైదరాబాద్ గా సెలెక్ట్ అయిన తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ మొదలయ్యాయి. ఆర్ట్ అంటే ఇష్టం ఉన్నా..హీరోయిన్ అయ్యింది మాత్రం యాక్సిడెంటల్ గానే. చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలనే డ్రీమ్స్ లేవు. వైజయంతీ మూవీస్ లో ప్రియదర్శితో కలిసి మెయిల్ వెబ్ సిరీస్ చేశాను. ఆ సిరీస్ నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్, సితార సంస్థలో మ్యాడ్ సినిమాల్లో నటించాను. ఇదంతా లాక్ డౌన్ టైమ్ లో జరిగింది కాబట్టి నేను చేసిన సినిమాలన్నీ లాస్ట్ ఇయర్ రిలీజ్ కు వచ్చాయి. ఈ మూవీస్ నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ తర్వాత మోడరన్ లవ్ చెన్నై వెబ్ సిరీస్ లో ఆఫర్ వచ్చింది. ఈ సిరీస్ తో తమిళ ఆడియెన్స్ కు దగ్గరయ్యాను. మోడరన్ లవ్ చెన్నై భారతీరాజా, బాలాజీ శక్తివేల్, త్యాగరాజ కుమారరాజ వంటి ఏడుగురు డైరెక్టర్స్ డైరెక్ట్ చేశారు. మోడరన్ లవ్ చెన్నైలో నా పర్ ఫార్మెన్స్ చూసి ట్రూ లవర్ సినిమా కోసం అప్రోచ్ అయ్యారు. తమిళంలో ఈ సినిమా లవర్ పేరుతో తెరకెక్కించారు. అక్కడ 9న రిలీజ్ అవుతోంది. తెలుగులో 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


- దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ "ట్రూ లవర్" స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఎంతో ఎగ్జైటింగ్ గా అనిపించింది. మన ప్రేమ కథల్లో హీరో హీరోయిన్స్ ప్రేమించుకోవడం, వాళ్ల మధ్య ఏవో విబేధాలు రావడం, చివరకు మళ్లీ కలుసుకోవడం ..ఇలాంటి ఫార్మేట్ చూస్తుంటాం. కానీ ప్రభురామ్ వ్యాస్ గారు ఈ కథను మల్టీ డైమెన్షన్ తో తెరకెక్కించారు. మన జీవితంలో ఏదీ రైట్ కాదు, ఏదీ రాంగ్ కాదు. సందర్భాన్ని బట్టి, మనం ఆ విషయాన్ని చూసే కోణాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటారు. అలా ఒక అమ్మాయి అబ్బాయిని చూసే పర్సెప్షన్, అబ్బాయి అమ్మాయిని చూసే పర్సెప్షన్ కొన్ని వేర్వేరు సందర్భాల్లో ఎలా ఉంది అనేది ఈ సినిమాలో ఎంతో సహజంగా తెరకెక్కించారు దర్శకుడు. ఒక జంట మధ్య ఆరేళ్ల కాలంలో జరిగే కథ ఇది. మనం ఒకర్ని ఒక సందర్భాన్ని బట్టి జడ్జ్ చేయలేం. అలా ఆరేళ్లలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అవన్నీ చూసి కన్ క్లూజన్ కు వస్తే గానీ ఎవరేంటి అనేది చెప్పలేం. ఈ సినిమాలో కూడా హీరో, హీరోయిన్ చేస్తున్నది తప్పా రైటా అనేది ఒక సీన్ తో ఆడియెన్స్ కన్ క్లూజన్ కు రాలేరు. ఆ జర్నీ మొత్తం ఎంతో ఇంట్రెస్టింగ్ గా మా సినిమాలో చూస్తారు. ప్రతి ప్రేమికుడు, ప్రేమికురాలు తమ జీవితాలతో ఈ సినిమాలోని సన్నివేశాలను, సందర్భాలను రిలేట్ చేసుకుంటారు. అదే ఈ సినిమాలోని యూనిక్ నెస్. కమర్షియల్ అంశాల కోసం న్యాచురాలిటీకి దూరంగా వెళ్లకుండా సినిమా సాగుతుంది.


- "ట్రూ లవర్" సినిమాలో దివ్య అనే క్యారెక్టర్ లో నటించాను. సెట్స్ లోకి వెళ్లే ముందు వర్క్ షాప్స్ చేశాం. నేను తమిళంలో డబ్బింగ్ చెప్పాను. అందుకు మా టీమ్ ఎంతో హెల్ప్ చేశారు. నేను మణికందన్ ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. మా అభిప్రాయాలు ఏంటనేవి షేర్ చేసుకున్నాం. ఈ కథలో మా క్యారెక్టర్స్ చేయాలంటే ఇలా కనీసం ఒకరి గురించి మరొకరికి తెలియాలని దర్శకుడు చెప్పారు. ఈ క్యారెక్టర్ ను అర్థం చేసుకునేందుకు కొంత టైమ్ తీసుకున్నా. దివ్య క్యారెక్టర్ లో అనేక షేడ్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ పరిధి మేరకే నటించేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఎందుకంటే దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ దివ్య క్యారెక్టర్ ను అంత యూనిక్ గా స్క్రిప్ట్ చేశారు. మణికందన్ తో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. ఆయన టాలెంటెడ్ పర్సన్. సెట్ లో ఎంతో కోపరేటివ్ గా ఉండేవారు.


- "ట్రూ లవర్" సినిమాను తెలుగులో ఎస్ కేఎన్, మారుతి గారు రిలీజ్ చేస్తున్నారని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. వాళ్లు రిలీజ్ చేస్తే తెలుగు ఆడియెన్స్ కు బాగా రీచవుతుంది. ఒక తెలుగు అమ్మాయిగా నా సినిమాను మన తెలుగు ప్రేక్షకులు చూడాలని కోరుకోవడం సహజమే కదా. రిలీజ్ టైమ్ లో ఇక్కడ నేను లేకపోవడం బాధగా ఉంది. అయితే తప్పకుండా వచ్చి థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తా. తమిళంలో ప్రీమియర్స్ వల్ల చెన్నైలో ఉండిపోవాల్సివచ్చింది.


- తెలుగు అమ్మాయిగా తమిళ మూవీస్ చేయడం టాలీవుడ్ కు దూరమైనట్లు భావించడం లేదు. తెలుగులోనూ మంచి ఆఫర్స్ వస్తున్నాయి. "ట్రూ లవర్" రిలీజ్ అయ్యాక వాటి వివరాలు చెబుతాను. తమిళ, తెలుగు సినిమా పరిశ్రమలు కొన్ని దశాబ్దాలుగా ఒక్కటిగా సాగుతున్నాయి. ఎంతోమంది తమిళ హీరోలు తెలుగులోనూ పేరు తెచ్చుకున్నారు. తమిళ సినిమా తమిళంలో కంటే తెలుగులో పెద్ద హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో నా వరకు తమిళం, తెలుగు అనే బేధం చూడటం లేదు. ఫిల్మ్ మేకింగ్ రెండు చోట్లా ఒక్కటే. మొదట్లో భాష ఇబ్బంది అయ్యేది కానీ ఇప్పుడు బాగా తమిళ్ నేర్చుకున్నా. కంటెంట్ అనేది ఇప్పుడు కీలకం అయ్యింది. కథ బాగున్న సినిమాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఓటీటీలు వచ్చేశాక వరల్డ్ కంటెంట్ అంతా మనం ఇష్టంగా చూస్తున్నాం. సో అలాంటి మంచి కంటెంట్ "ట్రూ లవర్"లో ఉంది కాబట్టే ఈ సినిమా సక్సెస్ మీద నమ్మకంతో ఉన్నాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !