View

ఇంటర్య్వూ- డైరెక్టర్ డా.అనిల్ విశ్వనాథ్ (మా ఊరి పొలిమేర-2)

Monday,October30th,2023, 04:40 PM

మాఊరి పొలిమేర చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా నిరూపించుకున్న దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర-2’ పొలిమేర చిత్రానికి సీక్వెల్ ఇది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత. నవంబరు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి  ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా సోమవారం చిత్ర దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ పాత్రికేయులతో ముచ్చటించారు.


సాధారణంగా భారీ చిత్రాలకు మాత్రమే సీక్వెల్ చేస్తుంటారు. కానీ మీరు మా ఊరి పొలిమేర లాంటి చిన్న చిత్రానికి సీక్వెల్ చేయడానికి కారణం ?
కథ రాసుకున్నప్పుడే తప్పనిసరిగా సీక్వెల్ చేద్డామని అనుకున్నం. కథలో వున్న సీరియస్ నెస్, ఇంకా చెప్పాలనుకున్న కథ మిగిలిపోవడంతో పార్ట్ 2లో ఆ కథను చెబుదామని అనుకున్నాం. ఎక్కడైతే పార్ట్ 1 ముగిసిందో.. పార్ట్ 2 అక్కడే  మొదలవుతుంది. ఇది పక్కా సీక్వెల్.


ప్రచార చిత్రాలు చూస్తుంటే కార్తికేయ చిత్రానికి పొలిమేరకు పోలిక వున్నట్లు అనిపిస్తుంది?
సినిమా విడుదల తరువాత కార్తికేయకు మా కథకు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తుంది. గుడి అనే కామన్ పాయింట్ తప్ప కార్తికేయ చిత్రానికి మా చిత్రానికి ఎటువంటి సంబంధం లేదు.


మొదటి పార్ట్ లో ఊహించని ట్విస్ట్ లు వుంటాయి. పతాక సన్నివేశాలు కూడా చాలా థ్రిలింగ్ గా వుంటుంది. పార్ట్ 2లో ఎటువంటి ట్విస్ట్ లు వుంటాయి?
మొదటి పార్ట్ చూసిన వాళ్లు అందులోని ట్విస్ట్ లను బాగా ఎంజాయ్ చేశారు. పార్ట్ 2పై వాళ్లలో అంచనాలు పెరిగాయి. అందుకే పార్ట్ 2 స్క్రీన్ ప్లేను మరింత బలంగా తయారు చేసుకున్నాను. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఊహించలేని ఎనిమిది ట్విస్ట్ లు వుంటాయి. తప్పకుండా పార్ట్ 1కు మించే విధంగా దానితో పొల్చితే దాదాపు పది రెట్ల థ్రిల్ ను ఫీలవుతారు. పతాక సన్నివేశాలు షాకింగ్ గా వుంటాయి. పొలిమేర 3 కూడా వుంటుందని ప్రకటించాను. దీనికి సంబంధించిన కథ కూడా రెడీ గా వుంది.


మా ఊరి పొలిమేర పార్ట్ 1కు మీకు లభించిన కాంప్లిమెంట్స్?
వాస్తవంగా పార్ట్ 1 ఓటీటీలో విడుదల కావడంతో నాకు పెద్దగా రెస్పాన్స్ తెలియలేదు. మేము ఎటువంటి ప్రచారం లేకుండానే చిత్రాన్ని ఓటీటీలో  విడుదల చేశాం. సినిమా చూసిన తరువాత చాలా మంది బాగుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ ఫోన్ చేసి అభినందించారు. ఆయన దర్శకుడిగా నీకు మంచి భవిష్యత్ వుంది అని చెప్పడంతో నాలో నాపై మరింత నమ్మకం పెరిగింది.


సత్యం రాజేష్ ఈ చిత్రాన్ని ఓన్ చేసుకుని చేశాడని అనిపిస్తుంది?
సత్యం రాజేష్ ఎంతో తపనపడే వ్యక్తి. నటుడిగా ఎటువంటి పాత్రను ఇచ్చిన చేయగలడు. సత్యం రాజేష్ దర్శక, నిర్మాతల పట్ల ఎంతో గౌరవం వున్న వ్యక్తి.


మా ఊరి పొలిమేర 2 థియేటర్ లోనే విడుదల  చేద్దామని అనుకున్నారా?
ఈ సినిమాను థియేటర్ లోనే విడుదల చేద్ధామని అనుకున్నాం అనుకున్నట్లుగానే సినిమాను చేశాను. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు వంశీ నందిపాటి గారి సహకారంతో చాలా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. బన్నీవాస్ గారు చూడటం ఆయనకు నచ్చడంతో మా సినిమా పెద్ద రేంజ్ కు వెళ్లింది. ఈ సినిమాకు వీరి వాళ్లే మంచి బజ్ ఏర్పడింది.


ఈ చిత్ర కథానాయిక కామాక్షి మీ దర్శకత్వ శాఖలో భాగం చేసుకోవడానికి కారణం
ఆమెకు దర్శకత్వం మీద ఆసక్తి వుండటంతో నేను కూడా ఓకే అన్నాను. మొదట్లో పెద్దగా నమ్మలేదు. తరువాత ఆమె ప్రతిభ చూసి నాకు నమ్మకం పెరిగింది. తెలుగులో ఫీమేల్ డైరెక్టర్స్ కూడా తక్కువే. ఆమె తప్పకుండా తెలుగులో మంచి దర్శకురాలు అనిపించుకుంటుందనే నమ్మకం వుంది.


మీ తదుపరి చిత్రం ?
పొలిమేర 3 కంటే ముందు మరో సినిమా చేయాలనుకుంటున్నాను.ఎందుకంటే వెంటనే పొలిమేర 3 చేస్తే నన్ను అందరూ చేతబడుల దర్శకుడు అంటారేమో (నవ్వుతూ)



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !