View

'ఎర్రబస్సు' స్ర్కీన్ ప్లే నా శైలిలో ఉంటుంది - డా.దాసరి నారాయణరావు

Wednesday,November12th,2014, 12:23 PM

డైరెక్టర్ ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ షిప్ అనే మాటను అలవాటు చేసింది దర్శకరత్న à°¡à°¾.దాసరి నారాయణరావు. హీరోల కటౌట్స్ తో సినిమాలు ఆడించే పరిస్థితులను మార్చి డైరెక్టర్ కట్ అవుట్ తో కూడా సినిమాని ఆడించవచ్చని నిరూపించారు దాసరి. 'దాసరోడు బొమ్మ' అని ప్రేక్షకులు à°“ డైరెక్టర్ గురించి మాట్లాడుకుని సినిమా చూడటానికి వెళ్లేటంతటి ప్రత్యేకమైన స్థానం పొందిన వ్యక్తి దాసరి. 150 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి కొంత గ్యాప్ తర్వాత  à°¶à±à°°à±€à°®à°¤à°¿ దాసరి పద్మ ఆశీస్సులతో తారక్రపభు ఫిలింస్ పతాకంపై స్వీయదర్శకత్వంలో 151à°µ చిత్రంగా రూపొందించిన చిత్రం 'ఎర్రబస్సు'. తమిళ చిత్రం 'మంజ పై'à°•à°¿ రీమేక్ అయిన à°ˆ చిత్రంలో దాసరి, మంచు విష్ణు తాతా, మనవళ్లుగా నటించారు. à°ˆ నెల 14à°¨ à°ˆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. à°ˆ సందర్భంగా à°¡à°¾.దాసరితో జరిపిన ఇంటర్య్వూ à°ˆ విధంగా...

ముందుగా తమిళ చిత్రం 'మంజ పై'ని రీమేక్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?

తమిళ చిత్రం 'మంజ పై' చూశాను. నాకు, విష్ణుకు à°ˆ à°•à°¥ బాగుంటుందనిపించింది. నాటి తేరం నేటి తరానికి నచ్చే  à°•à°¥ ఇది. మనవళ్లు, మనవరాళ్లు తల్లిదండ్రుల దగ్గరకంటే తాత దగ్గర చనువుగా ఉంటారు. పల్లెటూరిలో పుట్టి, పెరిగిన à°“ తాత, అమెరికాలో సెటిల్ కావాలనే à°“ సాఫ్ట్ వేర్ మనవడి మధ్య సాగే à°•à°¥ ఇది. à°ˆ మధ్య కాలంలో యాక్షన్ ఎంటర్ టైనర్స్ ఎక్కువైపోయాయి. ఎంటర్ టైన్ మెంట్ లో కూడుకున్న సినిమాలు తీయడానికి ఎవరో ఒకరు సాహసం చేయాలనిపించింది. కుటుంబమంతా కలిసి చూసే విధంగా సినిమా తీయాలనే ఆలోచనతోనే à°ˆ చిత్రాన్ని ఎంపిక చేసుకోవడం, సెట్స్ పైకి తీసుకెళ్లడం జరిగింది.

తెలుగుకి అనుగుణంగా ఈ కథలో మార్పులేమైనా చేశారా?

మన తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా చాలా మార్పులు చేశాం. ఆ కథను మనకనుగుణంగా మలుచుకుని, కొన్ని పాత్రలు జోడించి ఈ సినిమా చేశాను. స్ర్కీన్ ప్లే నా శైలిలో ఉంటుంది. అలాగే, నటనపరంగా కూడా మాతృకలో కన్నా ఈ రీమేక్ లో ఇంకా మెరుగ్గా ఉంటుంది.

'ఎర్రబస్సు' టైటిల్ ని పెట్టడానికి కారణం?

పల్లెటూరి టైప్ లో ఉండే వ్యక్తులను, సరిగ్గా మాట్లాడటం తెలీని వ్యక్తులను టీజ్ చేయడానికి.... ఇప్పుడే ఎర్రబస్సు నుంచి దిగాడురా అని అంటుంటారు. à°ˆ సినిమాలోని తాత పాత్ర  à°ªà°²à±à°²à±†à°Ÿà±‚రు నుంచి సిటీకి తన మనవడు కోసం వస్తాడు. అతనిని అందరూ 'ఎర్రబస్సు' అని టీజ్ చేస్తారు. అయితే à°† ఎర్రబస్సోడు తలుచుకుంటే ఏమైనా చేయగలడని తెలుసుకుంటారు. అందుకే à°ˆ టైటిల్ పెట్టడం జరిగింది.

తాతగా మీరే నటించాలని ఎందుకనుకున్నారు?

ఆ పాత్రకు నేను సరిగ్గా సరిపోతాను. ఆల్టర్ నేటివ్ ఉంటే అసలు నేను నటించను. కానీ ఈ పాత్రకు నేనే కరెక్ట్ అని భావించి చేసాను.

మంచు విష్ణును మీ మనవడిగా తీసుకోవడానికి కారణం?

తమిళ వెర్షన్ 'మంజ పై' చూసిన వెంటనే నాకు, విష్ణుకు à°ˆ à°•à°¥ చాలా బాగుంటుందని భావించాను. మనవడి పాత్రలో విష్ణు అద్భుతంగా ఒదిగిపోయాడు. నిజం చెప్పాలంటే  à°µà°¿à°·à±à°£à±à°¨à°¿ అందరూ హీరోలా చూస్తున్నారు. నేను తనలోని సాఫ్ట్ పెర్ ఫామెన్స్ ని à°ˆ సినిమాలో ఆవిష్కరించాను. విష్ణు నటన చూసిన తర్వాత, ఇప్పటివరకూ తనకు సరైన డైరెక్టర్ పడలేదని అనిపించింది.

హీరోయిన్ క్యాథరీన్ గురించి చెప్పండి?

ఈ మధ్య హీరోయిన్ అంటే గ్లామర్ డాల్ అన్నట్లు అయిపోయింది. కానీ ఈ సినిమాలో క్యాథరీన్ గ్లామర్ గా కనిపించడంతో పాటు, నటనకు స్కోప్ ఉన్న పాత్ర చేసింది. అద్భుతంగా నటించింది క్యాథరీన్.

ఈ సినిమాలో బ్రహ్మానందం, ఎమ్మెస్ పై చిత్రీకరించిన కామెడీ ట్రాక్ గురించి చెప్పండి?

బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణలపై ఓ స్పెషల్ కామెడీ ట్రాక్ ను చిత్రీకరించాము. ఆడియన్స్ ని నవ్వించే కామెడీ సీన్లు. వీరి సన్నివేశాల కోసం వేల కాకులను గ్రాఫిక్ ద్వారా క్రియేట్ చేసాం. కాకులను వాడుకోవడం వల్ల యానిమల్ వెల్ ఫేర్ నుండి అఫ్రూవల్ లెటర్ కావాలని సెన్సార్ బోర్డు వారు అడిగారు. లెటర్ కోసం అఫ్లై చేసాం. లెటర్ రావడం ఆలస్యమైతే ఈ సినిమా విడుదలవుతున్న తొలి రోజున ఈ కామెడీ ట్రాక్ సినిమాలో ఉండదు. లెటర్ వచ్చిన తర్వాత ఈ ట్రాక్ ని సినిమాలో చేర్చుతాము. సినిమా విడుదలైన రెండు, మూడు రోజులకల్లా ఈ ఫార్మాలిటీ పూర్తయిపోతుందనుకుంటున్నాము. సో... సినిమా విడుదలైన రెండు, మూడు రోజుల తర్వాత ఆడియన్స్ ఈ కామెడీ ట్రాక్ చూస్తారు.

ఈ సినిమాని ఓవర్ సీస్ లో కూడా విడుదల చేస్తున్నారు కదా?

నా 45 యేళ్ల కెరీర్ లో మొదటిసారి నా సినిమా ఇండియా దాటి వెళుతోంది. ఓవర్ సీస్ లో నేను సినిమాని ఎప్పుడూ విడుదల చేయలేదు. ఫిల్మ్ ఫెస్టివల్స్ లో మాత్రం స్ర్కీనింగ్ అయ్యాయి. అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, కెనడా, యుకె తదితర దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము.

బాలల దినోత్సం రోజున ఈ సినిమాని విడుదల చేయడానికి కారణం?

తాత, మనవడు కాన్సెఫ్ట్ కాబట్టి, బాలల దినోత్సవం రోజున విడుదల చేస్తున్నాం. తాత, మనవళ్లు చిన్న పిల్లల మనస్తత్వం కలవాళ్లు. పిల్లలు, పెద్దలూ అందరూ కలిసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఆ రోజున విడుదల చేయడం కరెక్ట్ అని భావించాను. ఈ సినిమా మొదలుపెట్టిన రోజునే విడుదల తేదీని అనౌన్స్ చేసాను.

ఈ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఉంటుంది?

చాలా మంచి మెసేజ్ ఉంటుంది. ఇప్పటితరం వారు నేర్చుకోవాల్సిన మెసేజ్ ఉంటుంది. సినిమాలో చాలా విషయాలు హైలెట్స్ గా అనిపిస్తాయి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !