View

ఇంటర్య్వూ - డైరెక్టర్ మారేష్ శివన్ (అలా నిన్ను చేరి)

Monday,November06th,2023, 03:05 PM

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మంచి ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న à°ˆ మూవీని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తున్నారు. అన్ని రకాల అంశాలను జోడించి à°ˆ మూవీని మారేష్ శివన్ తెరకెక్కించారు. సుభాష్ ఆనంద్ సంగీత దర్శకుడిగా à°ˆ చిత్రానికి  కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాయగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. à°ˆ చిత్రానికి ఆండ్రూ కెమెరామెన్.. కింగ్ సోలమన్,  రామ కిషన్ యాక్షన్ కొరయోగ్రాఫర్స్. నవంబర్ 10à°¨ à°ˆ చిత్రం విడుదల కాబోతోంది. à°ˆ క్రమంలో దర్శకుడు మారేష్ శివన్ మీడియాతో ముచ్చటించారు.


 *అలా నిన్ను చేరి ప్రయాణం ఎప్పుడు మొదలైంది? à°•à°¥ ఎప్పుడు రాసుకున్నారు?*  
à°ˆ కథను నేను 2012లో రాశాను.. అదే బ్యాక్ డ్రాప్‌లో à°•à°¥ జరుగుతుంది. ప్రతీ మనిషిలో జరిగే à°•à°¥ ఇదే. ప్రేమ, లక్ష్యం ఒకేసారి ఎంచుకోవాల్సి వస్తే ఏం చేస్తారు.. ఏం చేయాలి అనే మెసెజ్‌తో మూవీని తీశాను. చిత్రాన్ని చూసిన తరువాత కొంత మందైనా మారుతారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా అదే ట్రాన్స్‌లో ఉంటారు.


 *మీ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా à°•à°¥ రాసుకున్నారా?*  
నా జీవితం అనే కాదు.. ప్రతీ ఒక్కరి జీవితంలో అలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి.. అందరికీ à°ˆ సినిమా కనెక్ట్ అవుతుంది.. à°ˆ సీన్ మా లైఫ్‌లో జరిగిందే.. à°† సీన్ మా జీవితంలో జరిగిందే అని అనుకుంటారు. ఇది 2012లో రాసుకున్న కథే అయినా.. ఇప్పటి వారికి కూడా కనెక్ట్ అవుతుంది. టెక్నాలజీ పరంగా పెరిగినా.. ఎమోషన్స్ మాత్రం అవే ఉంటాయి. అందరికీ ఒకే రకమైన ఎమోషన్స్ ఉంటాయి.


 *కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా తెరకెక్కించారా?*
మా సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మా నిర్మాత గారికి à°•à°¥ చెప్పడంతోనే తెగ నచ్చేసింది. ఎమోషనల్‌à°—à°¾ ఫీల్ అయ్యారు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా చాలా గ్రాండ్‌à°—à°¾ నిర్మించారు.


 *హీరో దినేష్ తేజ్ à°ˆ కథలోకి ఎలా వచ్చారు?* 
హుషారు టైం నుంచి దినేష్ నాకు స్నేహితుడు. à°“ సారి బెక్కెం వేణుగోపాల్ గారికి à°ˆ కథను చెప్పాను. చివరకు దినేష్‌ వద్దకే à°ˆ à°•à°¥ వెళ్లింది. దినేష్ అప్ కమింగ్ యాక్టర్. పాయల్ రాధాకృష్ణ వెబ్ సిరీస్‌లో నటించారు. మిగత వాళ్లు సీనియర్ ఆర్టిస్టులు.


 *à°ˆ సినిమా స్టోరీ ఎలా ఉంటుంది?.. కథకు తగ్గ మ్యూజిక్ వచ్చిందా?*
ఈ చిత్రం లవ్, ఎమోషన్స్ ప్రధానంగా సాగుతుంది. ఇందులో హీరో తన లక్ష్యాన్ని, ప్రేమను ఎలా సాధించుకున్నాడు అనేది ఇతివృత్తంగా చూపించాం. ఈ చిత్రానికి సంగీతం ప్లస్ అవుతుంది. అద్భుతమైన పాటలు, ఆర్ఆర్, సంగీతాన్ని అందించారు సంగీతదర్శకలు సుభాష్ ఆనంద్. థియేటర్లో జనాలకు గూస్ బంప్స్ వస్తాయి. ఈ సినిమాను, పాటలను చూసి త్రినాథరావు నక్కిన లాంటి దర్శకులు 'ఇది చిన్న సినిమా కాదు.. చాలా పెద్ద హిట్ అవుతుందని' అన్నారు. 'కంటతడి పెట్టించావ్' అని బెక్కెం వేణుగోపాల్ గారు అన్నారు. 'మాటల్లేవ్' అని బెల్లంకొండ సురేష్ గారు ప్రశంసించారు.


 *సినిమా క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది? విషాదంతంగా ముగుస్తుందా?* 
అది ఇప్పుడే చెప్పలేను.. అదే నా బలం. థియేటర్లో చూస్తే మీకే తెలుస్తుంది.


 *మీ నేపథ్యం ఏంటి? మీ ప్రయాణం ఎలా సాగింది?* 
నాకు చిన్నప్పటి నుంచే కథలు రాయడం ఇష్టం. రియాల్టీకి దగ్గరగా ఉండాలనే కాన్సెప్టుతోనే ఉంటాను. ఆనంద్ సాయి వద్ద పని చేశాను. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు పని చేశాను. ఆర్ట్ డైరెక్టర్‌‌కు అసిస్టెంట్‌à°—à°¾ చాలా చిత్రాలు చేశాను. కానీ దర్శకుడు కావాలని లోపల ఉండేది. చాలా కష్టాలు పడ్డ తరువాత à°ˆ ప్రాజెక్ట్ ప్రారంభం అయింది. à°ˆ కథను మొదటగా బెక్కెం వేణుగోపాల్ గారికే చెప్పాను. ఇప్పుడు మంచి సినిమాను మిస్ అయ్యానని ఆయన అంటుంటారు.


 *ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేయబోతోన్నారు?* 
ముందు 200 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. మౌత్ టాక్ బాగుంటే మళ్లీ థియేటర్లు పెంచొచ్చు అని అనుకుంటుంన్నాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !