దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు హీరో హీరోయిన్లుగా రాబోతున్న ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ ‘అలా నిన్ను చేరి’. ఈ మూవీని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తున్నారు. అన్ని రకాల అంశాలను జోడించి ఈ మూవీని మారేష్ శివన్ తెరకెక్కించగా కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాయగా.. సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. చిత్రం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో హీరో దినేష్ తేజ్ మీడియాతో ముచ్చటించారు.
*అలా నిన్ను చేరి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది? ఎలాంటి ఫీలింగ్ ఉంది?* అలా నిన్ను చేరి అంటూ కొత్తగా ప్రయత్నించాను. కమర్షియల్ రోల్‌ను పోషించాను. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ప్రతీ ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎదురయ్యే సంఘర్షణే ఇందులో ఉంటుంది. ప్రేమ ముఖ్యమా? లక్ష్యం ముఖ్యమా? అన్నది చూపిస్తాం. ఆ పాయింటే నాకు ఈ సినిమా చేయడానికి స్పూర్తిని ఇచ్చింది.
*‘ప్లే బ్యాక్’ తరువాత చాలా గ్యాప్‌తో వస్తున్నట్టున్నారు? ఎలా అనిపిస్తోంది?* కరోనా టైంలో వచ్చిన ప్లే బ్యాక్ వల్ల మంచి పేరు వచ్చింది. మంచి రివ్యూలు వచ్చాయి. నాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తరువాత ఓ చిత్రం థియేటర్లోకి వచ్చింది కానీ అంతగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రంతో ఎలాంటి ప్రశంసలు వస్తాయో చూడాలి.
*ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదగడం కష్టం కదా? మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు?* ఇండస్ట్రీలో అందరికీ కష్టాలుంటాయి. కానీ మన వద్దకు వచ్చే స్క్రిప్ట్‌లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. జనాలకు నచ్చే కథల్లో కనిపించాలి.
*ఈ పాత్రతో మీ రియల్ లైఫ్‌కు సంబంధం ఉంటుందా?* గణేష్ పాత్రకు సినిమాల్లోకి రావాలని ఎంత ప్యాషన్ ఉంటుందో.. దినేష్‌కి కూడా అంతే ఉంటుంది.
*ఇద్దరు హీరోయిన్లతో కెమిస్ట్రీ ఎలా ఉంది?* హెబ్బా పటేల్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆమె అద్భుతంగా నటించారు. సెట్‌లో ఆమె ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు. పాయల్ నటన గురించి ఇప్పుడు ప్రేక్షకులు తెలుసుకుంటారు. మా ముగ్గురి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.
*చంద్రబోస్ సాహిత్యం మీ సినిమాకు ఎంత మేరకు ఉపయోగపడింది?* చంద్రబోస్ గారు రాసిన పాటలు అద్భుతంగా వచ్చాయి. మా సినిమాకు పాటలు రాస్తున్న టైంలోనే ఆయనకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది.
*సుభాష్ ఆనంద్ గారి సంగీతం ఎలా ఉంది?ఆయన గురించి చెప్పండి* సుభాష్ ఆనంద్ గారు ఈ సినిమా తరువాత నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తారు. మా సినిమాకు చాలా మంచి సంగీతాన్ని అందించారు.
*దర్శకుడితో పరిచయం ఎలా ఏర్పడింది?* డైరెక్టర్ మారేష్ శివన్ హుషారు సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ మూవీ అయిన ఏడాదికి నా వద్దకు వచ్చి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. కథ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వెంటనే ఓకే చెప్పాను.
*పెద్ద చిత్రాలతో ఎందుకు పోటీ పడుతున్నారు?* జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ వస్తున్నాయని మాకు తెలియదు. అయినా సినిమా బాగుందంటే ఆడియెన్స్ కచ్చితంగా చూస్తారు. మంచి చిత్రాన్ని చూశామనే ఫీలింగ్‌తో బయటకు వస్తారు. ఈ చిత్రంలో హెబ్బా పాత్రతోనే ఎక్కువగా కనెక్ట్ అవుతారు.