View

ఇంటర్య్వూ- హీరో  రక్షిత్ శెట్టి  ‘సప్త సాగరాలు దాటి’

Thursday,September21st,2023, 03:53 PM

కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. 'అతడే శ్రీమన్నారాయణ', '777 చార్లీ' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ à°Žà°‚ రావు దర్శకత్వంలో తెరకెక్కిన à°ˆ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ à°—à°¾ నటించారు. సెప్టెంబర్ 1à°¨ కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చిన à°ˆ మూవీ క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు à°ˆ సినిమా ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22à°¨ à°ˆ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. à°ˆ నేపథ్యంలో తాజాగా తెలుగు విలేకర్లతో ముచ్చటించారు కథానాయకుడు రక్షిత్ శెట్టి.


'సప్త సాగరాలు దాటి' సినిమా ప్రయాణం ఎలా మొదలైంది?
దర్శకుడు హేమంత్ తో ఇది నాకు రెండో సినిమా. తన మొదటి సినిమా 'గోధి బన్న సాధారణ మైకట్టు'లో నేను నటించాను. తన రెండో సినిమా కూడా నాతో చేయాలి అనుకున్నారు. కానీ అప్పుడు నేను 'అతడే శ్రీమన్నారాయణ'తో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఇప్పుడు మూడో సినిమాకి ఇలా కుదిరింది. 'ఛార్లీ' తర్వాత సినిమాల పరంగా నాకు వేరే ప్లాన్ లు ఉన్నాయి. కానీ ఆలోపు ఓ మంచి ప్రేమ కథ చేయాలనుకున్నాను. అప్పుడు హేమంత్ తాను ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న 'సప్త సాగర దాచే ఎల్లో'(సప్త సాగరాలు దాటి) కథ చెప్పడం, దానిని సినిమాగా తీసి హిట్ కొట్టడం జరిగిపోయాయి. దర్శకుడిగా హేమంత్ ది ఒక విభిన్న శైలి. అతని మొదటి రెండు సినిమాలకే కన్నడ పరిశ్రమకు మరో మంచి దర్శకుడు దొరికాడు అనిపించింది. చిత్రీకరణకు ముందు ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తారా అనే ఆసక్తి ఉండేది. ఆయన ఈ కథని పొయెటిక్ గా ఎంతో అందంగా రూపొందించారు.

 

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని ముందుగానే అనుకున్నారా?
మొదట రెండు భాగాలు అనే ఆలోచన లేదు. అయితే షూటింగ్ సమయంలో ప్రధాన పాత్రలు మను-ప్రియ మధ్య కెమిస్ట్రీ చూసి హేమంత్ రెండు భాగాలుగా చెప్పాలి అనుకున్నారు. హేమంత్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉంటారు, ఏం చేయాలో క్లారిటీ ఉంటుంది. అయినప్పటికీ షూటింగ్ సమయంలో ఇంకా ఏమైనా మెరుగుపరచగలమా అని ఆలోచిస్తూనే ఉంటారు. అలా కొంత భాగం షూటింగ్ అయ్యాక రెండు భాగాలుగా విడుదల చేయాలని ఆయన భావించారు. మొదట నాకు కాస్త ఆందోళన కలిగినప్పటికీ.. కథ మీద, ఆయన విజన్ మీద నమ్మకంతో అంగీకరించాను. షూట్ అయ్యాక ఎడిటింగ్ టేబుల్ లో చూసుకున్నాక.. రెండు భాగాలుగా చెప్పాలనే ఆయన ఆలోచన సరైనది అనిపించింది. మాములుగా మొదటి భాగం, రెండో భాగం ఎక్కువ వ్యవధితో విడుదల చేస్తుంటారు. కానీ మేము ఏడు వారాల వ్యవధిలోనే విడుదల చేస్తున్నాం. కాబట్టి ప్రేక్షకులు కథతో, పాత్రలతో తేలికగా పయనిస్తారు.


పార్ట్-1, పార్ట్-2 అని కాకుండా సైడ్-A, సైడ్-B అని పెట్టడానికి కారణమేంటి?
2010 సమయంలో జరిగే కథ ఇది. క్యాసెట్లతో ముడిపడి ఉంటుంది. అప్పుడు మనకు పాటల క్యాసెట్లు ఉండేవి. వాటిలో సైడ్-A, సైడ్-B అని ఉంటాయి. సైడ్-A పూర్తయిన తర్వాత సైడ్-B ప్లే చేస్తాం. ఆ ఉద్దేశంతో ఇలా సైడ్-A, సైడ్-B అని పెట్టడం జరిగింది.


దర్శకుడిగా హేమంత్ లో మొదటి సినిమాకి, ఇప్పటికి ఎలాంటి మార్పు చూశారు?
దర్శకుడిగా హేమంత్ ఎంతో ప్రతిభావంతుడు. కానీ మొదటి సినిమాకి ఆయనకు బడ్జెట్ పరంగా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు తన పూర్తి స్థాయి ప్రతిభను చూపించే అవకాశం లభించింది. రచయితగా, దర్శకుడిగా ఆయన సినిమాసినిమాకి ఎంతో మెరుగుపడుతున్నాడు.


కర్ణాటకలో తెలుగు సినిమాల ప్రభావం?
కర్నాటకలో తెలుగు చిత్రాలకు విశేష ఆదరణ ఉంటుంది. చిన్నప్పుడు తెలుగు సినిమాలు విడుదలైన కొన్ని నెలల తర్వాత వీసీఆర్ టేపుల్లో చూసేవాన్ని. ఇంజనీరింగ్ రోజుల్లో, కర్నూలుకి చెందిన నా రూమ్‌మేట్‌ ద్వారా తెలుగు సినిమాల గురించి మరింత తెలుసుకోగలిగాను. 'వేదం' వంటి అద్భుతమైన సినిమా గురించి అలాగే తెలుసుకున్నాను. కమర్షియల్ సినిమాలే కాకుండా విభిన్న చిత్రాలు ఆదరణ పొందగలవని నాకు అర్థమైంది.


'సప్త సాగరాలు దాటి' టైటిల్ గురించి?
టైటిల్ ఒక అందమైన కన్నడ పద్యం నుండి తీసుకోవడం జరిగింది. 'ఏడు సముద్రాలు దాటి' అనే అర్థం వస్తుంది. మనం భౌతికంగా ఒక ప్రదేశానికి చేరుకోకపోతే.. ప్రేమ, కుటుంబం మరియు జీవిత లక్ష్యాల సందర్భంలో అక్కడ ఉండాలనే భావన లోతుగా వ్యక్తిగతంగా మరియు అర్థవంతంగా ఉంటుంది.


నటన మరియు రచనలను బ్యాలెన్స్ చేయడం?
గత దశాబ్దంలో, నటుడిగా బలమైన ఉనికిని ఏర్పరచుకోవడానికి నేను దర్శకత్వం వహించడం మానుకున్నాను. ఇప్పుడు, నేను కథల సంపదను పోగుచేసుకుని.. దర్శకత్వం మరియు రచనకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తున్నాను.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో అనుబంధం?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన దివ్య నాకు చాలా కాలంగా తెలుసు. "సప్త సాగరాలు దాటి" యొక్క కన్నడ వెర్షన్‌à°•à°¿ ప్రశంసలు దక్కిన తర్వాత, తెలుగు వెర్షన్ కోసం వారితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాను.


'సప్త సాగరాలు దాటి' హైలైట్స్?
à°ˆ సినిమాకి సంబంధించి ప్రతిదీ హైలైట్ అని చెప్పొచ్చు. à°ˆ చిత్రం అందమైన సినిమాటోగ్రఫీ, అద్భుతమైన సంగీతం, కథలో లీనమయ్యే సౌండ్ డిజైన్‌ను కలిగి ఉంది, ఇది థియేటర్‌లలో తప్పక చూడదగినదిగా చేస్తుంది.


విడుదల వ్యూహం?
నిర్మాత శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని 'సప్త సాగరాలు దాటి' చిత్ర విడుదల విషయంలో భిన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నాను. ఛార్లీ తరహాలో ఒకేసారి వివిధ భాషల్లో విడుదల చేయడం కాకుండా.. మౌత్ టాక్ తోనే వివిధ భాషల ప్రేక్షకులకు చేరువ చేయాలనుకున్నాం.


రాబోయే ప్రాజెక్ట్‌లు?
నా దగ్గర "రిచర్డ్ ఆంథోనీ" à°’à°• క్లాసీ గ్యాంగ్‌స్టర్ à°•à°¥ ఉంది, దాని తర్వాత ఆఫ్టర్ లైఫ్ ఆధారంగా OTT చిత్రం ఉంది. అలాగే, "పుణ్య కోటి" అనే రెండు భాగాల ప్రాజెక్ట్‌ ఉంది.


స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడంపై?
నటుడిగా నేను స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ చిత్రనిర్మాతగా, నాకు తెలుగు భాషపై దాని సాహిత్యం, జానపదాలపై లోతైన అవగాహన అవసరమని నేను నమ్ముతున్నాను.


'సప్త సాగరాలు దాటి' చిత్రీకరణ సమయంలో మధుర జ్ఞాపకాలు?
ముఖ్యంగా క్లైమాక్స్‌కు దారితీసే సన్నివేశాలు హేమంత్ కథనంలో à°’à°• అద్భుతమైన సందర్భం. నా క్యారెక్టర్‌లో లీనమై, నేరేషన్‌లో ఎమోషనల్‌à°—à°¾ పయనించాను. నటన యొక్క అందం ఏమిటంటే, మనం నిజమైన బాధ లేకుండా భావోద్వేగాలను అనుభవించవచ్చు. వ్యక్తిగతంగా ప్రభావితం కానప్పటికీ, మనం భావోద్వేగాలకు కనెక్ట్ అవుతాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !