View

అజయ్ భూపతి వెంట పడ్డాను - పాయల్ రాజ్‌పుత్

Wednesday,November15th,2023, 01:00 PM

'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్‌పుత్. తెలుగుకు తనను పరిచయం చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో మళ్ళీ ఆమె నటించిన సినిమా 'మంగళవారం'. ఆమెకు జోడీగా 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ నటించారు. అజయ్ భూపతికి చెందిన 'ఏ' క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి స్వాతి రెడ్డి గునుపాటి నిర్మించిన చిత్రమిది. నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా పాయల్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు...  


*'ఆర్ఎక్స్ 100' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో మీరు నటించిన చిత్రమిది. ఈ సినిమా ఎలా మొదలైంది?

*'సార్... నాకు ఒక సినిమా ఇవ్వండి. ఒక అవకాశం కావాలి' అని అజయ్ భూపతి వెంట పడ్డాను. 'మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఫోన్ చేస్తా' అని చెప్పారు. చిన్న చిన్న పాత్రలకు నిన్ను తీసుకోలేనని స్పష్టం చేశారు. ఆయనకు నా పొటెన్షియల్,  నా ట్యాలెంట్ తెలుసు. ఆయన నుంచి ఫోన్ రాగానే ఓకే చేశా. తెలుగు ఇండస్ట్రీలో ఇది నా టర్నింగ్ పాయింట్, కమ్ బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నా. 'మంగళవారం' విడుదలకు ఎంత ఎగ్జైట్ ఫీలవుతున్నానో... అంతే నెర్వస్ కూడా ఉంది. అవుటాఫ్ బాక్స్ సినిమా చేశాం. ఇండియాలో ఈ టైపు క్యారెక్టర్, కథతో ఎవరూ సినిమా చేయలేదు. 


*మీ క్యారెక్టర్ నెగిటివిటీతో ఉంటుందా?
*అసలు కాదు. సినిమా విడుదలకు ఒక్క రోజు మాత్రమే ఉంది. 'మంగళవారం'లో నేను శైలు పాత్రలో నటించా. సినిమా చూశాక ఆ అమ్మాయి మీద మీకు సింపతీ వస్తుంది. సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. చాలా సెన్సిటివ్ టాపిక్ డిస్కస్ చేశాం. రెస్పాక్ట్ ఇస్తూ సెన్సిటివిటీతో సినిమా తీశాం. 

   
*మీకు స్క్రిప్ట్ నేరేట్ చేసినప్పుడు ఏమనిపించింది?
*అజయ్ భూపతి గారిని ఈ క్యారెక్టర్ నిజమేనా? అని అడిగా. నేను ఇంటెన్స్, డార్క్ రోల్స్ చేశాను కానీ ఇటువంటి సినిమా, క్యారెక్టర్ చేయలేదు. కథ విన్నాక  'అజయ్ భూపతి గారితో మళ్ళీ పని చేస్తున్నా' అని అమ్మకి ఫోన్ చేసి చెప్పా. 'ఆర్ఎక్స్ 100'తో నన్ను పరిచయం చేశారనో... మరొకటో... అమ్మకి ఆయన అంటే చాలా గౌరవం. ఆయన డైరెక్షన్ కూడా ఇష్టం. 


*మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

*చాలా చాలెంజింగ్ రోల్. అందులో నటించడం చాలా కష్టమైంది. రియల్ లైఫ్ లో నాకు, శైలు పాత్రకు 10 పర్సెంట్ కూడా సంబంధం లేదు. ఏం ఆలోచించకుండా ఫ్రీగా షూటింగ్ చేయడానికి రమ్మని చెప్పారు. ఆయనపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. చెప్పినట్లు చేశా. సరెండర్ అయిపోయా. క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ కోసం నేను కూడా కొంత రీసెర్చ్ చేశా. 


*మీ కంటే ముందు 40 మందిని ఆడిషన్ చేశారట!
*ఆల్మోస్ట్ 35 మందిని ఆడిషన్ చేసినట్లు ఉన్నారు. అజయ్ భూపతి వెంట పడ్డానని చెప్పాను కదా! మధ్యలో ఫోన్స్ చేసినప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పేవారు. 'నన్ను ఎందుకు సెలెక్ట్ చేయడం లేదు' ఛాన్స్ ఇవ్వడం లేదు' అని కూడా అడిగా. మీరు మళ్ళీ ఛాన్స్ ఇస్తే నా కెరీర్ కి హెల్ప్ అవుతుందని కూడా చెప్పా. చివరకు, ఆడిషన్స్ చేసి నన్ను సెలెక్ట్ చేశారు.


*మీరు మోడ్రన్ గా కనిపిస్తారు. సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు. ఆ లుక్, క్యారెక్టర్ గురించి...
*శైలు క్యారెక్టర్ హెయిర్, మేకప్ కోసం ప్రతి రోజు రెండు గంటలు పట్టింది. మేకప్ కంటే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ నుంచి బయటకు రావడానికి ఎక్కువ టైమ్ పట్టింది. షూటింగ్ కంప్లీట్ చేశాక 15 రోజులు దాన్నుంచి బయటకు రాలేదు. మా అమ్మ దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్నాను. చేతి మీద గాట్లు, నా లుక్ చూసి 'నీకు ఏమైంది?' అని అమ్మ అడిగింది. పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఉన్నావ్ అని చెప్పింది. 


*మీ క్యారెక్టర్, నందితా శ్వేతా పాత్రకు సంబంధం ఏంటి?
*నందితా శ్వేతా పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. ట్విస్టులలో ఆమెది కీలక పాత్ర ఉంటుంది. 


*ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాను లేడీ ప్రొడ్యూసర్ చేశారు. మీకు ఎంత కంఫర్ట్ అనిపించింది?
*చాలా కంఫర్టబుల్ అండి. షూటింగ్ టైములో స్వాతి రెడ్డి గునుపాటిని కలవలేదు. కానీ, ఫోనులో మాట్లాడాను. స్వాతి గారు, సురేష్ వర్మ గారు... ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అజనీష్ సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉంది. టాలెంటెడ్ టెక్నీషియన్లు సినిమాకు పని చేశారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎవరు చూడని కథ, క్యారెక్టర్లు ఈ సినిమాలో ఉంటాయి. 


*కార్తికేయతో మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారు?
*కార్తికేయతో చెప్పా. మళ్ళీ మనం కలిసి సినిమా చేద్దామని! మంచి కథ వస్తే చెబుతానని అన్నారు. అన్నీ కుదరాలి!


*'ఆర్ఎక్స్ 100'కి, ఇప్పటికి అజయ్ భూపతిలో ఏమైనా మార్పు గమనించారా?
*లేదు. ఇప్పుడు కొంచెం కామ్ అయ్యారు. అంతే తప్ప మార్పులు ఏమీ లేవు. నేను టెన్షన్ పడితే ఆయన కూల్ గా ఉన్నారు.


*ప్రీ రిలీజ్ ఫంక్షన్ స్టేజి మీద అల్లు అర్జున్ తో సెల్ఫీలు దిగారు. ఆయనతో ఏం మాట్లాడారు?

*అల్లు అర్జున్ గారిని కలిసినప్పుడు బ్లష్ అవుతూ ఉన్నాను. 'పాయల్... నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు ప్లే చేసిన క్యారెక్టర్ గురించి నాకు తెలుసు. ఆ రోల్ చేయడం అంత ఈజీ కాదు' అని చెప్పారు. ఐయామ్ సో హ్యాపీ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !