View

'లయన్' టైటిల్ అందుకే పెట్టాం - నిర్మాత రుద్రపాటి రమణారావు

Saturday,May09th,2015, 10:14 AM

నందమూరి నటసింహిం బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం 'లయన్'. జె.రామాంజనేయులు సమర్పణలో రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై సత్యదేవను దర్శకుడిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణారావు à°ˆ చిత్రాన్ని నిర్మించారు. తొలిసారి బాలయ్యతో త్రిష జతకడుతోండగా, ‘లెజెండ్‌’ తర్వాత రాధికా ఆప్టే రెండోసారి బాలకృష్ణ సరసన నటించింది. à°ˆ సినిమా టీజర్, థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్ à°•à°¿ ఆడియన్స్ నుంచి, అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాలకృష్ణ గెటప్, డైలాగ్స్ à°•à°¿ అభిమానులు, ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం వరల్డ్ వైడ్ à°—à°¾ మే 14, గురువారం ఉదయం 9à°—à°‚à°Ÿà°² 36నిమిషాలకు విడుదల కానుంది. à°ˆ సందర్భంగా నిర్మాత రుద్రపాటి రమణారావుగారితో ఫిల్మీబజ్ జరిపిన ఇంటర్య్వూ...

'లయన్' గురించి చెప్పండి?
'లయన్' పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ చిత్రంలో బాలకృష్ణగారు రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసారు. కథ, కథనం, ఫైట్స్, పాటలు, డైలాగులు అన్నీ బాగుంటాయ. ఫస్టాప్ అంతా కామెడీ, ఫ్యామిలీ బాండింగ్ తో ఎంటర్ టైన్ మెంట్ గా సాగుతుంది. సెకండాఫ్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో, కథ మంచి ఊపుగా సాగుతుంది. ఎక్కాడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని నిర్మించాము. 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా 'లయన్' విజృంభించడం ఖాయం.

'లయన్' టైటిల్ పెట్టడానికి కారణం ఏదైనా ఉందా?
ఈ టైటిల్ బాలయ్యగారికి యాఫ్ట్ గా ఉంటుంది. ఇదొక కారణం అయితే ప్రపంచ వ్యాప్తంగా నలభై ఆరువేల లయన్స్ క్లబ్స్ ని స్థాపించి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బాలకృష్ణగారు బసవతారకం హాస్పటల్ ద్వారా, హిందూపురం ఎమ్మేల్యేగా ప్రజలకు దగ్గరగా ఉంటూ ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకే ఈ టైటిల్ పెట్టడం జరిగింది. టైటిల్ కి తగ్గట్టు ఈ సినిమా ఉంటుంది.

'లయన్' కు రూపకల్పన ఎలా జరిగింది?
నేను బాలయ్యకు పెద్ద అభిమానిని. 'సమరసింహా రెడ్డి', 'నరసింహనాయుడు' తరహా సినిమా ఆయనతో నిర్మించాలనే కోరిక ఉండేది. ఓ డైరెక్టర్ ని తీసుకెళ్లి బాలయ్యకు కథ చెప్పించాను. అలాంటి కథలు చాలా చేసాం కదా... వేరే డిఫరెంట్ కథతో రమ్మని చెప్పారు. ఆ సమయంలోనే సత్యదేవ ఈ కథ చెప్పారు. సత్యదేవ చెప్పిన స్టోరీ లైన్ ని నేను బాలయ్యకు చెప్పాను. ఆయనకు స్టోరీ లైన్ నచ్చడంతో, సత్యదేవను పిలిపించి టోటల్ స్ర్కిఫ్ట్ విని ఈ సినిమా చేద్దామని ఫైనలైజ్ చేసారు బాలయ్య. అలా ఈ సినిమాకి రూపకల్పన జరిగింది.

'లయన్' కథ విన్న తర్వాత మీరెలా ఫీలయ్యారు?
స్ర్కిఫ్ట్ నాకు బాగా నచ్చింది. ప్రతి సీన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏ సినిమాలో చూసినట్టుగానో ఉండవు. ఫ్రెష్ ఫీల్ ని కలుగజేసింది. నేను ఫీలైన ఇవన్నిసినిమా విడుదల తర్వాత ప్రేక్షకులు కూడా ఫీలవుతారు.

డైరెక్టర్ సత్యదేవ గురించి చెప్పండి?
కొత్త డైరెక్టర్... ఎలా హ్యాండిల్ చేస్తాడోననే డౌట్ ఉండేది. అయితే సినిమా ఆరంభించిన తర్వాత ఆయనకు సినిమాకు సంబంధించి ప్రతి విషయంలోనూ క్లారటీ ఉందని తెలుసుకుని రిలాక్స్ అయిపోయాను. బాలకృష్ణగారిని అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా ఈ సినిమాలో ఆయనను సత్యదేవగారు చూపించారు.

'లయన్' ఆడియోకి ఎలాంటి స్పందన వచ్చింది?
కృష్ణుడి పైన రూపొందించిన ఓ సాంగ్, ఇంటర్వెల్ ముందు సంగీత్ సాంగ్, సెకండ్ హాఫ్ లో వచ్చే మాస్ సాంగ్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. విజువల్ గా కూడా పాటలు చాలా బాగుంటాయి.

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు నటించారు కదా. ఆయన పాత్ర ఎలా ఉంటుంది?
బాలయ్యగారి 'లక్ష్మి నరసింహ' సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ పవర్ ఫుల్ విలన్ గా నటించారు. అంతటి పవర్ ఫుల్, ఇంటెలిజెంట్ రోల్ ఈ సినిమాలో చేసారు.

ఓ అభిమానిగా ఈ సినిమా పట్ల మీ ఫీలింగ్?
బాలయ్య సినిమాని నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఓ అభిమానిగా నాకు ఈ సినిమా చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో బాలయ్య గారి గెటప్ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ కాపీ చూసిన వారందరూ సినిమా చాలా బావుందని చెప్పారు.

సినిమాకి ఏయే అంశాలు హైలైట్ అనుకుంటున్నారు?
టోటల్ గా సినిమా బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్రైబల్ ఫైట్ చాలా కొత్తగా ఉంటాయి. క్లయిమ్యాక్స్ ఫైట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది.

సినిమా విడుదల విషయంలో జాప్యం జరగడానికి కారణం?
సినిమా సిజి వర్క్ డిలే అవ్వడం వలన సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసాం. బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా చెన్నై లో జరగడం, డి.టి.ఎస్. చేసే మధుసూదన్ గారు చనిపోవడంతో రిలీజ్ లేట్ అయ్యింది. అనుకున్న టైమ్ కి ఓవర్ సీస్ కి ప్రింట్స్ పంపించలేమని భావించే 8న అనుకున్న సినిమాని 14న విడుదల చేయాలని డిసైడ్ అయ్యాము.

తదుపరి ప్రాజెక్ట్స్?
నా తరువాత సినిమా కూడా బాలకృష్ణ గారితో చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆయన 99, 100 వ సినిమాలకు సంబంధించి బిజీ గా ఉన్నారు. 101 వ సినిమా చేసే అవకాశం నాకు ఇస్తే ఖచ్చితంగా చేస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !