View

నాలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం 'ఎర్రబస్సు': విష్ణు

Monday,November10th,2014, 01:35 PM

2014లో ఇప్పటికే విష్ణు మూడు చిత్రల ద్వారా వెండితెరపై కనిపించారు. 'పాండవులు పాండవులు తుమ్మెద' వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్, 'రౌడీ' వంటి ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రం, 'అనుక్షణం' వంటి థ్రిల్లర్... ఇలా మూడు విభిన్న కోణాలున్న చిత్రాల్లో కనిపించిన విష్ణు ఈ నెల 14న 'ఎర్రబస్సు' ఎక్కి వస్తున్నారు. డా. దాసరి నారాయణ దర్శకత్వం వహించి, తాత పాత్ర పోషించిన ఈ చిత్రంలో విష్ణు ఆయనకు మనవడిగా నటించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన 'మంజ పై'కి రీమేక్ ఇది. తారక ప్రభు ఫిలింస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. ఇక.. మంచు విష్ణుతో మాట్లాడదాం...

ముందుగా 'మంజ పై' పట్టాలెక్కిన విధానం గురించి చెబుతారా?

దాసరి అంకుల్ ఒకరోజు 'మనిద్దరం కలిసి సినిమా చేద్దాం' అన్నారు. ఆ తర్వాత ఆయన్ను కలిస్తే, తమిళ చిత్రం 'మంజ పై' గురించి చెప్పారు. ఈ చిత్రం రీమేక్ చేద్దాం అంటే, సరే అన్నాను. ఆ తర్వాత ఈ చిత్రం షూటింగ్ ఆరంభించాం.

తెలుగుకి అనుగుణంగా ఈ కథలో మార్పులేమైనా చేశారా?

మన తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా చాలా మార్పులు చేశాం. అలాగే, నటనపరంగా కూడా మాతృకలో కన్నా ఈ రీమేక్ లో ఇంకా మెరుగ్గా ఉంటుంది. ఈ సినిమాకి ప్రధాన హైలైట్ చివరి 20 నిమిషాలు.

ఇందులో మీ పాత్ర గురించి చెప్పండి?

దాసరి అంకుల్ మనవడిగా నటించాను. తాతకు, ప్రేయసికీ మధ్య ఇరుక్కునే పాత్ర నాది. నటనకు అవకాశం ఉన్న పాత్ర ఇది. నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఉపయోగపడిన చిత్రం ఇది.

దాసరిగారి కాంబినేషన్లో సినిమా చేయడం ఎలా అనిపించింది?

ఈ మధ్య ఓ వేడుకలో 'దాసరి అంకుల్ దర్శకత్వంలో చేయడం నా అదృష్టం' అన్నాను కదా. ఇప్పుడూ అదే అంటున్నాను. క్లయిమాక్స్ లో ఆయన అద్భుతంగా నటించారు. ఆయన ముందు నేను తేలిపోకూడదనే పట్టుదలతో చేశాను. దాసరిగారి దర్శకత్వంలో ఇంత మంచి సినిమా చేయడం గర్వంగా ఫీలవుతున్నాను.

దాసరిగారి దర్శకత్వంలో చేయడం పట్ల మీ ఫీలింగ్?

ఆయన దర్శకత్వం గురించి చెప్పేంత స్థాయి నాకు లేదు. నేను చిన్న నటుణ్ణి. అందుకే ఆయన వర్క్ గురించి చెప్పను కానీ.. ఆయన దర్శకత్వంలో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.

'ఎర్రబస్సు' చేస్తున్నప్పుడు మీకు కష్టం అనిపించిన సీన్లు ఏమైనా ఉన్నాయా?

ఈ సినిమాలో నేను కొన్ని కామెడీ సీన్స్ చేసాను. కామెడీ సీన్స్ ఓవరాక్ట్ చేస్తే, ఆ ఫీల్ రాదు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి కామెడీ సీన్స్ లో నటించే నటుడు చాలా హావా భావాలు పలికించాల్సి ఉంటుంది. నేను కామెడీ సీన్స్ చేసేటప్పుడు కొంచెం కేర్ తీసుకున్నాను. ఇక క్లయిమ్యాక్స్ చేసేటప్పుడు కూడా టఫ్ ఫీలయ్యాను.

దాసరిగారు ఇప్పటి ట్రెండ్ కి సరిపడా సినిమాలు చేయలేరనే వార్తల పట్ల మీ స్పందన?

క్రియేటివిటీ, టాలెంట్ కీ ఎండ్ అనేది ఉండదు. దాసరిగారిలాంటి జీనియస్ టాలెంట్ కి అస్సలు ఎండ్ లేదు. నా వరకూ నేను దాసరిగారిని హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ క్లింట్ ఈస్ట్ వుడ్ తో పోల్చుతాను. ఆయన దాసరిగారి కంటే 10యేళ్ల పెద్ద. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. దాసరిగారు కూడా అంతే. టాలెంట్ కీ, క్రియేటివిటీకి అప్పటి ట్రెండ్, ఇప్పటి ట్రెండ్ అనేది ఉండదు.

'ఎర్రబస్సు' ఏ వర్గం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది?

అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. కుటుంబం అందరం కలిసి చూడాల్సిన సినిమా. మన ఇంట్లోని పెద్దవారిని మనం చాలా తేలికగా తీసుకుంటాం. కానీ వాళ్లు మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఆ విషయాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించడం జరిగింది. హాలీవుడ్ లో డిస్నీ సంస్థ ఇలాంటి సినిమాలు తీస్తుంటారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లో కామెడీని మిక్స్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు తీర్చిదిద్దుతారు. ఆ ఫార్మెట్ తో రూపొందిన చిత్రమే 'ఎర్రబస్సు'. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాలి.

ఈ సినిమా మీకు అవార్డ్స్ తెచ్చి పెడుతుందనుకుంటున్నారా?

అవార్డ్స్ మీద నాకు నమ్మకం లేదు. అవార్డ్స్ వచ్చిన వారు మాత్రమే మంచి నటుడు అనే విషయాన్ని కూడా నేను నమ్మను. కాన్ఫిడెంట్ గా ఓ విషయం చెప్పగలను. అవార్డు వచ్చిన నటుల ముందు నిలబడి కూడా నేను చాలా బాగా నటించగలను. ఒకవేళ అలా చేయలేకపోతే ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వడం తప్పని ఒప్పుకుంటాను. కాన్ఫిడెంట్ ఉన్నవాళ్లు మాత్రమే ఇలా చెప్పగలరు. వరల్డ్ కప్ గెలిచినా, గెలవకపోయినా సచిన్ ఈజ్ గ్రేట్ ప్లేయర్. ఈ విషయాన్ని ఎవ్వరం కాదనలేం. అలాగే అవార్డు రాని మంచి నటులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి నా వరకూ అవార్డులను నమ్మను.

తదుపరి ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?

తమిళ చిత్రం 'అరిమా నంబి' తెలుగు రీమేక్ చేయబోతున్నాను. దీనికి దేవా కట్టా దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం స్ర్కిఫ్ట్ వర్క్ జరుగుతోంది. సంపూర్నేష్ బాబుతో 'సింగం 123' చిత్రం నిర్మిస్తున్నాను. ఈ చిత్రం ద్వారా సంపూర్నేష్ లోని ఇప్పటివరకూ బయటపడని యాంగిల్ ని ఆవిష్కరించబోతున్నాం. మరో సినిమా గురించి త్వరలోనే ప్రకటిస్తాను.

 

Manchu Vishnu interview about Errabus



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !