View

'ఒక లైలా కోసం' మెచ్యుర్డ్ లవ్ స్టోరీ - నాగచైతన్య

Tuesday,October14th,2014, 12:14 PM

''ప్రస్తుతం ప్రేక్షకులు కథాబలం ఉన్న చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. నేను కూడా ఏదైనా సినిమా చేయాలంటే తొలి ప్రాధాన్యం కథకే ఇస్తాను'' అని నాగచైతన్య చెప్పారు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నాగచైతన్య, పూజ హగ్డే జంటగా అన్నపూర్ణ స్టూడియో పతాకంపై రూపొందిన చిత్రం 'ఒక లైలా కోసం'. ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగచైతన్యతో జరిపిన ఇంటర్వ్యూ....

'à°’à°• లైలా కోసం' అంటే ప్రేమకథా చిత్రమని అర్థమవుతోంది. మీరిప్పటివరకు చేసిన ప్రేమకథలకు,  à°ˆ చిత్రానికీ ఉన్న వ్యత్యాసం?

నేనిప్పటివరకు చేసినవి టీనేజ్ లవ్ స్టోరీస్. కానీ, ఇది మెచ్యుర్డ్ లవ్ స్టోరీ. నాకు తెలిసి ఇలాంటి జోనర్ లో సినిమా వచ్చి చాలా కాలమైంది. మంచి ఫీల్ ఉన్న స్టోరీ.

కథ ఎలా ఉంటుంది?

ఒక అమ్మాయి ప్రేమ కోసం అబ్బాయి ఎంతదాకా వెళతాడనేది ఈ చిత్ర కథ. కాలేజ్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక సాగే లవ్ స్టోరీ. '100% లవ్' చిత్రంలో చేసిన పాత్రకు దగ్గరగా ఇందులో నేను చేసిన పాత్ర ఉంటుంది. ఈ చిత్రంలో నా పాత్ర పేరు కార్తీక్.

'ఏం మాయ చేశావె'లో మీరు చేసిన పాత్ర పేరు కూడా కార్తీకే కదా?

అవును. à°† మాటకొస్తే విజయ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'గుండె జారి గల్లంతయ్యిందే'లో నితిన్ పాత్ర పేరు కూడా కార్తీకే. à°ˆ కార్తీక్ లిద్దరూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కాబట్టి,  à°¸à±†à°‚టిమెంట్ తో విజయ్ కుమార్ ఇందులో నా పాత్ర పేరు కార్తీక్ అని పెట్టారేమో. నాకు మాత్రం ఎలాంటి సెంటిమెంట్స్ లేవు.

ఇందులో మీ సరసన నటించిన పూజా గురించి?

పూజా హెగ్డే చాలా టాలెంటెడ్. తనకు మంచి భవిష్యత్తు ఉంది. మంచి కో-స్టార్. à°ˆ చిత్రం షూటింగ్ ఆరంభం కాక ముందు à°•à°¥ మొత్తం తెలుసుకుని, వర్క్ షాప్ లో పాల్గొంది. డైలాగ్స్ అన్నీ బాగా చదువుకుని, కెమెరా ముందు తడబాటు లేకుండా చేసింది. 

'మనం' తర్వాత వెంటనే ప్రేమకథా చిత్రమే చేయాలనుకోవడానికి ప్రత్యేక కారణం ఏదైన ఉందా?

వాస్తవానికి ప్రేక్షకులు నన్ను ప్రేమకథా చిత్రాల్లోనే చూడాలనుకుంటున్నారు. నాకైతే యాక్షన్, లవ్.. ఇలా అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంటుంది. అయితే ప్రేక్షకులు కోరుకునే చిత్రాలు చేయడం కూడా ముఖ్యం. 'మనం'à°•à°¿ ముందు యాక్షన్ చిత్రాలు చేశాను. ఈసారి ప్రేమకథా చిత్రం చేయాలనుకున్నాను. విజయ్ కుమార్ చెప్పిన à°•à°¥ నచ్చడంతో 'à°’à°• లైలా కోసం' చేశాను. 

మీ తాతగారి 'ఒక లైలా కోసం..' పాటను ఈ చిత్రం కోసం రీమిక్స్ చేయాలన్న ఆలోచన ఎవరిది?

à°ˆ ఆలోచన దర్శకుడిదే. అయితే, కావాలని రీమిక్స్ చేసింది కాదు. సందర్భానుసారమే à°ˆ పాట ఉంటుంది. అనూప్ రీమిక్స్ సాంగ్ చేయడానికి à°…à°‚à°¤ సుముఖంగా ఉండడు. అందుకే à°ˆ  à°ªà°¾à°Ÿ గురించి చెప్పగానే కొంచెం ఆలోచించాడు. కానీ, à°† తర్వాత చేశాడు.

ఉత్తరాంధ్ర లో తుపాను కారణంగా థియేటర్లు సరిగ్గా సాగడం లేదు కదా.. మరి, ఈ చిత్రం విడుదలను వాయిదా వేయాలనుకోలేదా?

తుపాను కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే బాధగా ఉంది. అయితే, సినిమా విడుదల తేదీని ముందే ప్రకటించేశాం కాబట్టి, విడుదల చేస్తున్నాం. ఎన్ని థియేటర్లుంటే అన్నింట్లోనే విడుదలవుతుంది. పరిస్థితులు చక్కబడతాయి కాబట్టి, తర్వాత థియేటర్ల సంఖ్య పెంచుతాం.

ఈ చిత్రాన్ని నాగార్జున చూశారా?

ముందే నాన్నగారు ఈ కథ విన్నారు. ఫైనల్ గా ఎడిటింగ్ రూమ్ లో చూశారు. చిన్న సూచనలు ఇచ్చారు. అవి చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుందనిపించి, రీషూట్ చేశాం. దానికోసం ఓ రెండు రోజులు పట్టింది.

హీరోగానే కొనసాగుతారా? వేరే శాఖలోకి వెళ్లే ఉద్దేశం ఉందా?

సినిమాలు నిర్మించాలనే ఆలోచన ఉంది. మా సంస్థ నిర్మించిన చిత్రాలు కావడంతో మనం, ఒక లైలా కోసం చిత్రాల నిర్మాణ వ్యవహారాలు పట్టించుకునేవాణ్ణి. అందుకని భవిష్యత్తులో సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను.

Naga Chaitanya interview about Oka Laila Kosam



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !