View

ఇంటర్య్వూ - బొమ్మదేవర రామచంద్ర (మాధవే మధుసూదన)

Tuesday,November21st,2023, 03:05 PM

తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే‌ జంటగా నటించిన సినిమా 'మధుసూదన’. ఈ చిత్రాన్ని సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్ పై  నిర్మిస్తూ దర్శకత్వం వహించారు బొమ్మదేవర రామచంద్ర రావు. ఈ మూవీని బొమ్మదేవర శ్రీదేవి సమర్పిస్తున్నారు. ఈ నెల 24 ‘మాధవే మధుసూదన’ సినిమా థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత బొమ్మదేవర రామచంద్ర రావు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..


*మేకప్ మెన్‌గా పని చేసిన మీరు దర్శకుడిగా, నిర్మాతగా ఎలా మారారు?* 
మన్మథుడు సినిమా టైంలో నాగార్జున గారికి నేను దర్శకుడిని కావాలని అనుకుంటున్నట్టుగా ఆయనకు చెప్పాను. నీ మెంటాల్టీకి దర్శకుడు అంటే కష్టం కానీ.. నిర్మాతగా ట్రై చేయ్ అని సలహా ఇచ్చారు. సూపర్ సినిమా టైంలో అనుష్క గారికి మేకప్ వేస్తూ.. మీరు పెద్ద హీరోయిన్ అవుతారు.. అప్పుడు నాకు డేట్స్ ఇవ్వాలని అన్నాను. అలా చాలా మందిని అడిగాను. కానీ అనుష్క మాటను నిలబెట్టుకున్నారు.


 *మాధవే మధుసూదన సినిమాకు హీరోగా ఫస్ట్ ఛాయిస్ ఎవర్ని అనుకున్నారు?* 
చాలా మంది హీరోలను అడిగాను. కానీ మేకప్ మెన్ నుంచి దర్శకుడు, నిర్మాతగా మారుతున్నాను అంటే చాలా మంది నమ్మరు. వేరే వాళ్లతో రిస్క్ ఎందుకు అని నా కొడుకుని అడిగితే.. హీరోగా చేస్తానని అన్నాడు. ఓ ఏడాది ట్రైనింగ్ ఇప్పించి హీరోగా పెట్టుకున్నాను. ఎక్కడా కొత్త కుర్రాడు నటించినట్టుగా అనిపించదు. నా కొడుకుని హీరోగా పెడదామని అయితే సినిమాను స్టార్ట్ చేయలేదు.


 *డైరెక్టర్, నిర్మాతగా మీకు ఎదురైన సవాళ్లు ఏంటి? బడ్జెట్ ఏమైనా పెరిగిందా?* 
స్క్రీన్ మీద ఏం చూపించాలనేది దర్శకుడికి తెలుస్తుంది.. అదే టైంలో బడ్జెట్ గురించి నిర్మాత టెన్షన్ పడుతుంటాడు. కానీ ఇక్కడ ఆ రెండూ నేనే. ముందే ఓ బడ్జెట్ అనుకున్నాను. అంతలోనే తీశాను. ఏడాదిన్నర స్క్రిప్ట్ మీద కూర్చున్నాను. కావాల్సిందే రాసుకున్నా. కావాల్సిందే తీశాను.


 *ఈ స్టోరీకి మూలం ఎక్కడ పుట్టింది?* 
ఆజాద్ సినిమా టైంలో నాగార్జున గారి కోసం నేను కాచిగూడ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను. ఆయన వచ్చారని ఎవరో అన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి చూశాను. కానీ ఆయన రాలేదు. అలా ఓ మనిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటే.. వాళ్లు రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందనే ఆలోచనలోంచే ఈ కథ పుట్టింది. వెయిట్ చేసి వెయిట్ చేసి రాకపోవడం, 25 ఏళ్ల తరువాత ఆ మనిషి వస్తే పరిస్థితి ఏంటి? అన్నది ఈ సినిమాలో చూపించాం.


 *ఈ కథకు హీరోయిన్‌ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?* 
డైరెక్టర్ తేజ తన అహింస సినిమా కోసం ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. కానీ తేజ చిత్రంలో తీసుకోలేదు. నాకు ఆ అమ్మాయి గురించి తెలిసింది. నేను హీరోయిన్‌గా పెట్టుకున్నాను. ఆమె జాన్వీ కపూర్‌లా ఉందని అందరూ అంటుండేవారు.


 *మీ అబ్బాయి తేజ్‌కి ముందు నుంచీ హీరోగా చేయాలని ఉండేదా?* 
తేజ్‌కి హీరో అవ్వాలని ఉండేది. నేను ఈ సినిమా కథ చెప్పడంతోనే ఎగిరి గంతేశాడు. చాలా ట్రైనింగ్ తీసుకున్నాడు. డ్యాన్సుల, ఫైట్స్ కోసం శిక్షణ తీసుకున్నాడు.


 *ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేలా సినిమా ఉంటుందా?* 
కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ చిత్రం ఉంటుంది.. అమ్మా, అక్కా, చెల్లి, తల్లిదండ్రులు ఇలా అందరూ కలిసి చూసే చిత్రాన్ని తీయాలని అనుకున్నాను. అలాంటి సినిమానే తీశాను.


 *మీ ఈ సినిమాకు నాగార్జున, అక్కినేని ఫ్యామిలీ, ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది?* 
నాగార్జున గారు ముందు నుంచీ నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నాగ చైతన్య, అఖిల్, మంచు విష్ణు, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది సహాయం చేయడం వల్లే సినిమా ఇక్కడి వరకు వచింది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !