View

'రోమియో'కు గోపీ న్యాయం చేసాడు - పూరి జగన్నాధ్

Monday,October06th,2014, 04:40 PM

టచ్ స్టోన్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై మధుర శ్రీధర్ రెడ్డి సమర్పణలో సాయిరాం శంకర్, అడొనిక జంటగా అగ్ర దర్శకుడు పూరి జగన్నాధ్ శిష్యుడు గోపీ గణేష్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ టచ్ స్టోన్ దొరైస్వామి నిర్మించిన చిత్రం 'రోమియో'(పూరి రాసిన ప్రేమ కథ). ఈ చిత్రానికి కథ, డైలాగులు పూరి జగన్నాధ్ అందించారు. ఈ నెల 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా కథ, ఈ చిత్రానికి సంబంధించిన విశేషాల గురించి మీడియాతో కాసేపు ముచ్చటించారు పూరి జగన్నాధ్. ఆ విశేషాలు ఈ విధంగా...

- నాలుగు సంవత్సరాల క్రితం ఈ సినిమా కథ రాసుకున్నాను. 'నేను నా రాక్షసి' సినిమా షూటింగ్ వెనీస్ లో చేసాం. అక్కడ రోమియో, జూలియట్ నివసించిన వెరోన అనే విలేజ్ కి వెళ్లాను. ఆ విలేజ్ లో జూలియట్ విగ్రహం ఉంది. ఆ విగ్రహం ముందు తమ ప్రేమ సక్సెస్ అవ్వాలని ప్రేమికులు ప్రార్ధించడం చూసాను. అప్పుడే నాకు ఈ స్టోరీ లైన్ పుట్టింది. ఆ స్టోరీ లైన్ ని డెవలప్ చేసాను.

- నేను ఎంతో ఇష్టపడి రాసుకున్న కథ ఇది. నా దగ్గర చాలా సినిమాలకు సహాయ దర్శకుడిగా వర్క్ చేసిన గణేష్ కి నేను ఇచ్చిన బహుమతి ఈ రోమియో కథ. నేను అనుకున్నదానికంటే ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు గోపీ గణేష్. 16మంది యూనిట్ సభ్యులతో రోమ్, స్విట్జర్ ల్యాండ్, వైజాగ్ ల్లో ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేసారు. ఇంత తక్కువమంది యూనిట్ సభ్యులతో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా చిత్రాన్ని తెరకెక్కించడం పట్ల నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను రాసుకున్న కథకు వంద శాతం గోపీ గణేష్ న్యాయం చేసాడు.

- రోమియో జూలియట్ ప్రేమ కథ ఏ తరం వారికైనా కనెక్ట్ అవుతుంది. అందుకే నేను కథ రాసి నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ, ఆ కథలోని ఎమోషన్, సెంటిమెంట్ ఇప్పటి ప్రేక్షకులను కూడా కట్టిపడేసే విధంగా ఉంది. ఈ సినిమా ప్రెష్ ఫీలింగ్ ని కలుగజేస్తుంది.

- ఈ సినిమా చూసిన తర్వాత నాకు కూడా తక్కువ బడ్జెట్ తో ఇలాంటి సినిమాలు తీయాలనే కోరిక కలిగింది. నా సొంత బ్యానర్ లో కొత్త దర్శకులుతో ఇలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నా కెరియర్ బిగినింగ్ లో తక్కువ పాత్రలతో, తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేయాలనే ఆలోచనే ఉండేది. ఆ తర్వాత నిర్మాతలు డబ్బులు పెట్టడంతో, పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలకు అలవాటుపడిపోయాను. దాసరి నారాయణరావుగారు ''ఎప్పుడూ పెద్ద హీరోలతోనే సినిమాలు చెయ్యొద్దు. చిన్న సినిమాలు చేయాలి. స్టార్ హీరోలు కంటిన్యూగా అవకాశాలు ఇస్తారని చెప్పలేం. చిన్న సినిమాలకు స్టార్ హీరోలు అవసరం లేదు. అలాగే చిన్న సినిమాల వల్ల చిత్ర పరిశ్రమ అభివృద్ధి బాగుంటుంది. చాలా మంది బ్రతుకుతారు'' అని చెప్పారు. ఆ మాటలు నా మనసులో ఉండిపోయాయి. కాబట్టి భవిష్యత్తులో నా బ్యానర్ లో చిన్న సినిమాలు చేస్తాను.

- ఈ కథతో సాయి హీరోగా నేనే సినిమా చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. గోపీ గణేష్ చేస్తానంటే, ఈ కథ ఇచ్చాను. ఈ సినిమా సాయి కెరియర్ కి హెల్ప్ అయితే చాలా సంతోషపడతాను. సాయి గత సినిమాలకంటే, ఈ సినిమాలో తన లుక్ చాలా బాగుంది. ఈ సినిమాకీ అన్నీ కుదిరాయి. కాబట్టి సాయికి హిట్ చిత్రం అవుతుందనుకుంటున్నాను.

- లవ్ స్టోరీ కావడం వల్ల యూత్ కి సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. సునీల్ కశ్యప్ అందించిన పాటలు బాగున్నాయి. ఇక ఈ చిత్రంలో సాయిరామ్ శంకర్ బ్రదర్ పాత్రను రవితేజ చేసాడు. రవితేజది అతిధి పాత్రే అయినప్పటికీ ఎంటర్ టైన్ మెంట్ ఉండే పాత్ర. కథను మలుపు తిప్పే పాత్ర. సినిమా ఆరంభం నుంచి ఎండింగ్ వరకూ ఎంటర్ టైన్ మెంట్ మిస్ అవ్వలేదు. ఇవన్ని సినిమాకి హైలెట్ గా నిలిచే విషయాలు.

- ఎన్టీఆర్ కి నేను ఓ కథ చెప్పాను. ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ చేస్తున్న సమయంలో వక్కంతం వంశీ ఓ కథ చెప్పాడు. ఆ కథ ఎన్టీఆర్ కి నచ్చింది. నన్ను కూడా కథ వినమన్నాడు. కథ విన్న తర్వాత నాకు కూడా బాగా నచ్చింది. దాంతో సబ్జెక్ట్ మీద వర్కవుట్ చేసి సెట్స్ పైకి వెళ్లాము.

- ఎన్టీఆర్ తో సినిమా ఆరంభించిన రోజునే జనవరి 9à°¨ విడుదల చేస్తామని ప్రకటించాను. కానీ ప్లాన్ చేసిన షెడ్యూల్స్ జరగలేదు. à°“ నెల గ్యాప్ వచ్చింది. అది కవర్ చేయడానికి  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 9à°¨ à°ˆ చిత్రాన్ని విడుదల చేస్తాం.

- ఇందులో ఎన్టీఆర్ కాప్ à°—à°¾ నటిస్తున్నాడు.  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°•à°¿ టైటిల్ ఫైనలైజ్ చేయలేదు. à°ˆ సినిమాపై వస్తున్న రూమర్స్ ని నమ్మొద్దు.

- ఈ సినిమా తర్వాత మూడు, నాలుగు కమిట్ మెంట్స్ ఉన్నాయి. మహేష్ బాబు కోసం ఓ కథ రెడీ చేసాను. తను బిజీగా ఉన్నాడు. అందుకే ఇంకా కథ వినిపించలేదు. సమయం కుదిరినప్పుడు మహేష్ కి కథ చెబుతాను. అలాగే రానాతో కూడా ఓ కమిట్ మెంట్ ఉంది. ప్రస్తుతం మాత్రం నా దృష్టంతా ఎన్టీఆర్ సినిమాపైనే. తర్వాతి సినిమాలు గురించి అన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేస్తాను.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !