View

ఇంటర్య్వూ - రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య

Monday,November06th,2023, 03:51 PM

రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన హై యాక్ష‌న్ డ్రామా ‘జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్‌’ దీపావ‌ళి సందర్బంగా ఈ మూవీ న‌వంబ‌ర్ 10న రిలీజ్ అవుతుంది. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని కార్తీకేయ‌న్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మేక‌ర్స్ తమిళ్‌, తెలుగు, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు...


రాఘ‌వ‌ లారెన్స్ మాట్లాడుతూ ..


- కార్తీక్ సుబ్బ‌రాజ్‌గారిపై న‌మ్మ‌కంతో ఈ సినిమాను చేయ‌టానికి రెడీ అయ్యాం. కాబ‌ట్టి ఎలాంటి టెన్ష‌న్ లేదు. జిగ‌ర్ తండ సినిమానే నేను చేయాల్సింది. కానీ మిస్ అయ్యింది. దాంతో రెండో పార్ట్‌లో న‌టిద్దామ‌ని నేనే కార్తీక్ సుబ్బ‌రాజ్‌గారిని అప్రోచ్ అయ్యాను. అప్ప‌టికింకా క‌థ రెడీ కాలేద‌ని ఆయ‌న అన్నారు. క‌థ రెడీ కాగానే నాకు ఫోన్ చేశారు.


- డాన్స్‌, ఫైట్స్‌, యాక్ష‌న్స్ చేయాలంటే క‌ష్ట‌ప‌డాలి. కానీ మా డైరెక్ట‌ర్‌గారు అలాంటివేం చేయొద్ద‌ని చెప్పారు. అంత కంటే కావాల్సిదేముంటుంది. ఆయ‌న చెప్పిన‌ట్లే యాక్ట్ చేశాం.


- ఓ పీరియాడిక్ మూవీ ఇది. మంచి బ్యాక్‌డ్రాప్‌లో మూవీ ఉంటుంది.


- సినిమాలో మంచి యాక్ష‌న్ పార్ట్‌తో పాటు సెకండాఫ్‌లో మంచి ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో కొత్త‌గా ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మీరు చూసిన రాఘ‌వ లారెన్స్‌ను కాకుండా కొత్త లారెన్స్‌ను చూస్తారు.

 

- డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్‌గారు ఏం చెప్పారో దాన్ని చేసుకుంటూ వెళ్లాం. ఎందుకంటే నేను కూడా డైరెక్ట్ చేశాను. మ‌నం డైరెక్ష‌న్ చేస్తున్న‌ప్పుడు మ‌రొక‌రు ఇన్‌వాల్వ్ అయితే ఒప్పుకోం క‌దా.. ఆ సంగ‌తి నాకు తెలుసు. కాబ‌ట్టి నేను కానీ, సూర్య‌గారు కానీ డైరెక్ష‌న్‌లో ఎక్క‌డా ఇన్‌వాల్వ్ కాలేదు.


- త్వ‌ర‌లోనే ముని 5, కాంచ‌న 4 మొద‌లు పెడుతున్నాను.


- ర‌జినీకాంత్‌గారి సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నానంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.  దాని గురించి ఇప్పుడేం మాట్లాడ‌లేను. అన్నీ క‌రెక్ట్‌గా కుదిరితే మేక‌ర్స్ చెబుతారు.
- సూప‌ర్‌స్టార్‌గారికి, మెగాస్టార్‌గారికే కాదు.. ఇద్ద‌రూ క‌లిసి న‌టించేంత మ‌ల్టీస్టార‌ర్ స్క్రిప్ట్ కూడా నా ద‌గ్గ‌ర ఉంది.


- కరోనాకు ముందు చారిటీ ట్రస్ట్ పెడదామని అనుకున్నాను. కానీ కుదరలేదు. చారిటీకి సపోర్ట్ చేయాలనుకునే మంచి వ్యక్తులు దొరకాలి. లేకపోతే కష్టం. అలాంటి వ్యక్తుల కోసం సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఓ రాఘవేంద్రస్వామిగారి గుడి కట్టాలని అనుకుంటున్నాను. తప్పకుండా అన్నీ చేస్తాను.


ఎస్‌.జె.సూర్య మాట్లాడుతూ....


- జిగ‌ర్ తండ సినిమాను కార్తీక్ సుబ్బ‌రాజ్‌గారు చేసేట‌ప్పుడు తెలుగులో అంత‌గా ట‌చ్ లేదు. దాంతో ఆయ‌న దాన్ని త‌మిళంలోనే రిలీజ్ చేసుకున్నారు. తెలుగులో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ పేరుతో రీమేక్ చేస్తే ఇక్క‌డ సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్ విష‌యానికి వ‌స్తే రాఘ‌వ లారెన్స్‌గారు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే కావ‌టంతో పాటు నేను కూడా బాగా తెలియ‌టంతో కార్తీక్‌గారు బాగా ఖ‌ర్చు పెట్టి సినిమా చేశారు.


- జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్ సినిమాను వంద కోట్ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టి నిర్మించారు ప్రొడ్యూస‌ర్ కార్తికేయ‌న్‌. దీని కోసం ఓ కొండ పైన విలేజ్ సెట్ వేసి మ‌రీ చిత్రీక‌రించారు.


- జిగ‌ర్ తండ స‌క్సెస్‌ఫుల్ సినిమా కావ‌టంతో జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్ సినిమాపై అంచ‌నాలు ఎక్కువ‌గానే ఉంటాయ‌ని తెలుసు. అయితే ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ని రీచ్ అవుతామ‌ని అనుకుంటున్నాం.


- జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్ చిత్రంలో లారెన్స్‌గారు గ్యాంగ్‌స్ట‌ర్‌.. నేనేమో డైరెక్ట‌ర్ కావాల‌నుకుని యాక్ట్ చేసే వ్య‌క్తి. ఈ పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయిన‌ప్పుడు మ‌ళ్లీ డైరెక్ట‌ర్ పాత్ర‌లో న‌టించాలా? అని ఆలోచించ‌టం మొద‌లు పెట్టాను. రెండు రోజుల త‌ర్వాత ఆలోచించాను. స‌త్య‌జిత్‌రే సినిమాలోని రోల్‌లా నా రోల్ ఉంటుంద‌ని, అందులో యాక్ట్ చేయ‌టానికి పిలుస్తార‌ని తెలిసింది. అదొక గిఫ్ట్‌గా భావించి నేను ఓకే చెబుదామ‌ని అనుకునే లోపే నిర్మాత‌గారు నాకు ఫోన్ చేశారు.


- లారెన్స్ మాస్ట‌ర్‌కి మాస్‌లో మంచి ఇమేజ్ ఉంది. ఆయ‌న్ని జిగ‌ర్ తండ డబుల్ ఎక్స్ చిత్రంలో కార్తీక్‌గారు కొత్త‌గా చూపించారు.


- మూవీలో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంది.


- నా డైరెక్ష‌న్‌లోనే నేను యాక్ట్ చేయాల‌నుకునే ప్లాన్‌లో ఉన్నాను. త్వ‌ర‌లోనే వివ‌రాల‌ను తెలియ‌జేస్తాను.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !