View

ఇలాంటి సక్సెస్ కోసమే ఎదురుచూస్తున్నా - శర్వానంద్

Sunday,August10th,2014, 08:13 AM

శర్వానంద్... à°ˆ హీరోతో సినిమా రూపొందింది అంటేనే ఖచ్చితంగా డిఫరెంట్ మూవీ అయ్యుంటుందనేంతగా ఆడియన్స్ లో ఇమేజ్ ని సంపాదించుకున్నాడు శర్వానంద్. తను నటించిన అమ్మ చెప్పింది, గమ్యం, జర్నీ, ప్రస్థానం, అందరి బంధువయా... లాంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాయి. కాకపోతే à°ˆ సినిమాలు కమర్షియల్ హిట్స్ కావు. ఎన్ని మంచి సినిమాలు చేసినా కమర్షియల్ హిట్స్, మాస్ ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవ్వడం ముఖ్యం. ఇది బాగా తెలుసుకున్న శర్వానంద్ మంచి కమర్షియల్ హిట్ సినిమా చేయాలనే భావనతో అంగీకరించి చేసిన చిత్రం 'రన్ రాజా రన్'. తన అంచనాలకు తగ్గట్టు à°ˆ చిత్రం ఇటీవల విడుదలై హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అంతే కాదు...  à°®à°‚à°šà°¿ వసూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతున్న à°ˆ చిత్రం శర్వానంద్ ఇమేజ్ ని మార్చేసింది.  à°ˆ సందర్భంగా తన ఆనందాన్ని మీడియాతో à°ˆ విధంగా పంచుకున్నారు శర్వానంద్....

ముందుగా 'రన్ రాజా రన్' తో కమర్షియల్ హిట్ అందుకున్న మీకు కంగ్రాట్స్...

థ్యాంక్సండి...

ఈ సినిమా సక్సెస్ పట్ల మీ ఫీలింగ్ చెప్పండి?

నా కెరియర్ లో మంచి సినిమాలు చేసాను. కానీ à°† సినిమాలు కమర్షియల్ à°—à°¾ విజయం సాధించకపోవడంతో నేను చాలా నిరాశపడిపోయేవాడిని. 'రన్ రాజా రన్' నాలోని à°† నిరాశను పూర్తిగా దూరం చేసింది.  à°¨à±‡à°¨à± కమర్షియల్ హిట్ కొట్టాను అనేకంటే.... యువి క్రియేషన్స్ నాకు మంచి కమర్షియల్ సినిమా చేసే అవకాశం ఇచ్చిందంటే బాగుంటుంది. డైరెక్టర్ సుజిత్ చెప్పిన à°•à°¥ విన్న నిర్మాతలు వంశీ, ప్రమోద్... à°† కథకు నేను సూట్ అవుతానని నన్ను నమ్మి à°ˆ సినిమాలో నటింపజేయడం గొప్ప విషయం. ఎందుకంటే నాకంటూ ఏ ఇమేజ్ లేదు. కేవలం మంచి సినిమాలు చేసాను. అంతే... à°ˆ సినిమా నా ఇమేజ్ ని మార్చింది.  à°¨à°¾à°¤à±‹ కమర్షియల్ సినిమాలు చెయ్యొచ్చని à°ˆ సినిమా నిరూపించింది. ఇలాంటి విజయం కోసమే ఎదురుచూస్తున్నాను.

ఈ సినిమా సక్సెస్ కి కారణాలేంటనుకుంటున్నారు?

à°ˆ సినిమాలో నా క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. నా à°—à°¤ సినిమాకంటే, à°ˆ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ చాలా యూత్ ఫుల్ à°—à°¾, ఎంటర్ టైనింగ్ à°—à°¾ ఉంది. ఆడియన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ à°•à°¿ బాగా కనెక్ట్ అయ్యింది.  à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à± సుజిత్ à°ˆ à°•à°¥ చెప్పినప్పుడే సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. à°† నమ్మకంతోనే à°ˆ సినిమా చేసాను.

ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా ఉన్నారు?

à°ˆ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ మదికి చెందుతుంది. తను నన్ను చాలా అందంగా చూపించాడు. నా లుక్ యూత్ à°•à°¿ బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా కూడా చాలా కలర్ ఫుల్ à°—à°¾ ఉంది. 

కమర్షియల్ సక్సెస్ అందుకున్న మీరు ఇకముందు ప్రస్థానం, గమ్యం లాంటి సినిమాలు చేస్తారా?

నిజం చెప్పాలంటే ఆర్టిస్ట్ అన్న తర్వాత ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీగా ఉండాలి. ఇది మనసులో పెట్టుకునే కమర్షియల్, ఆర్ట్ ఫిల్మ్ అనే విషయాలను పక్కన పెట్టి సినిమాలు చేసాను. నేను చేసిన సినిమాలు నాకు నష్టం కలిగించలేదు. అవన్ని నటుడిగా నన్ను నిలబెట్టిన సినిమాలు. కాకపోతే ఎంత మంచి సినిమా అయినా కమర్షియల్ హిట్ చాలా అవసరం. అది మనసులో పెట్టుకుని ఇకముందు సినిమాలు చేయాలనుకుంటున్నాను. ప్రస్థానం, గమ్యంలాంటి సినిమాలు భవిష్యత్తులో కూడా చేస్తాను. కాకపోతే ఖచ్చితంగా ఎంటర్ టైన్ మెంట్ ని మిస్ అవ్వకుండా చూసుకుంటాను.

కో అంటే కోటి చిత్రంతో నిర్మాతగా మారారు కదా? మరి నిర్మాతగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా?

భవిష్యత్తులో సినిమాలు నిర్మిస్తాను. కాకపోతే ఆ సినిమాల్లో నేను నటించను. నిర్మాతగా, హీరోగా రెండు బాధ్యతలను మోయడం చాలా కష్టం.

మీకు డ్రీం రోల్స్ ఏమైనా ఉన్నాయా?

మంచి సినిమాలు చేయాలనేది మాత్రమే నా డ్రీం. అంతే తప్ప ఫర్టిక్యులర్ గా ఈ క్యారెక్టర్ చేయాలనే డ్రీం నాకు లేదు.

రన్ రాజా రన్ కోసం మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్?

మా పేరెంట్స్ ఈ సినిమా చూసి చాలా సంతోషపడ్డారు. ఇకముందు ఇలాంటి ఛీర్ ఫుల్ క్యారెక్టర్స్ చేయమని చెప్పారు. అలాగే చాలామంది యంగ్ హీరోలు ఫోన్ చేసి అభినందించారు. మీడియా మిత్రులు కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయడంతో పాటు, హిట్ సినిమా చేస్తే ఎంత సపోర్ట్ చేస్తారో తెలియజేసారు.

ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?

క్రాంతి మాధవ్ గారి దర్శకత్వంలో కె.యస్.రామారావుగారు నిర్మిస్తున్న చిత్రం ఓ షెడ్యూల్, కొన్ని పాటలు మినహా పూర్తయ్యింది. ఈ సినిమా నాకు చాలా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులో నా సరసన నిత్యామీనన్ నటిస్తోంది.

ఇంకా ఏమైనా సినిమాలు కమిట్ అయ్యారా?

తమిళంలో ఓ సినిమా కమిట్ అయ్యే అవకాశం ఉంది. ఆ సినిమా చర్చలు జరుగుతున్నాయి. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చర్చలు దశలో ఉన్నాయి. ఫైనలైజ్ అయిన తర్వాత అన్ని విషయాలు తెలియజేస్తాను అంటూ ఇంటర్య్వూకు ముగింపు పలికారు శర్వానంద్.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !