View

నేను సినిమా లవర్ ని - సుమంత్ అశ్విన్

Sunday,August17th,2014, 02:27 PM

సుమంత్ అశ్విన్, నందిత జంటగా హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లవర్స్'. డైరెక్టర్ మారుతి కథ, స్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన ప్రేక్షకాదరణ పొందుతూ ముందుకు దూసుకెళుతోంది. 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో సక్సెస్ అందుకున్న సుమంత్ అశ్విన్ తాజాగా 'లవర్స్' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు (17.8.2014) మీడియాకి ఇంటర్య్వూ ఇచ్చారు సుమంత్ అశ్విన్. ఆ విశేషాలు ఈ విధంగా...

'లవర్స్' విజయం పట్ల మీ ఫీలింగ్?

ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం మా టీమ్ కి ముందునుంచి ఉంది. ఆ నమ్మకం వమ్ము కాలేదు. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్... అన్ని వయసుల వారు సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకుల నవ్వులతో థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. ఆ సందడి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.

కథ విన్నప్పుడే ఈ సినిమా విజయాన్ని ఊహించారా?

నేను కథ విన్న తర్వాత నాన్నగారు విన్నారు. ఆయన కొన్ని సూచనలు ఇచ్చి, మార్పులు చేయమన్నారు. ఆ మార్పులు చేసిన తర్వాత సినిమా మంచి విజయం సాధిస్తుందని నాన్నగారు అన్నారు. ఆయన జడ్జిమెంట్ వంద శాతం కరెక్ట్ అయ్యింది.

నాన్నగారి జడ్జిమెంట్ వర్కవుట్ అయ్యింది కదా? ఇక ముందు కూడా ఆయనే కథలు వింటారా?

నాన్నగారు కథలు వింటారు. కాకపోతే నిర్ణయం నన్ను తీసుకోమని అంటున్నారు. నటించేది నువ్వే కాబట్టి... కథపై అవగాహన రావాలని, జడ్జిమెంట్ తీసుకునేంత అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు. ఎక్స్ పీరియన్స్ తో  à°‡à°¦à°¿ సాధ్యమవుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే à°ˆ సినిమా విషయంలో ఫస్టాప్ సూపర్ హిట్ అవుతుందనుకున్నాను. కానీ నిజం చెప్పాలంటే సెకండాఫ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కాబట్టి నా జడ్జిమెంట్ రాంగ్ అయినట్టే కదా... అందుకే ఎక్స్ పీరియన్స్ తోనే పర్ ఫెక్ట్ జడ్జిమెంట్ వస్తుందంటున్నాను.

నందిత గురించి చెప్పండి?

నందిత తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. తనని తప్ప మరెవరినీ ఈ పాత్రలో ఊహించలేము. అంత బాగా తన పాత్రలో ఒదిగిపోయింది నందిత.

సప్తగిరి గురించి చెప్పండి?

ఈ సినిమా చివరి 40నిముషాలు సప్తగిరిపైనే నడిచింది. అతని కామెడీ టైమింగ్, నటన సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. ఈ సినిమా సప్తగిరికి చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది.

మీరు ప్రేమలో పడ్డారా?

లేదండి... నేను సినిమాని ప్రేమిస్తాను. సినిమా లవర్ ని. à°ˆ సినిమాలోని à°“ సన్నివేశంలో నేను నటించినప్పుడు...  à°ªà±à°°à±‡à°®à°¿à°•à±à°²à± మాత్రమే ఇంత బాగా చేయగలరు... నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు అంటూ ఆట పట్టించారు మారుతిగారు. అలాంటిదేం లేదండి... నాకు సినిమా అంటే ఇష్టం అని చెప్పాను.

ఈ సినిమా చూసిన తర్వాత ఏ సీన్ లో అయినా ఇంకా బాగా నటించి ఉంటే బాగుండేది కదా అనిపించిందా?

ఏ ఆర్టిస్ట్ కైనా తెరపై సినిమా చూసుకున్నప్పుడు ఈ సీన్ ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది కదా... ఈ షాట్ లో ఈ ఎక్స్ ప్రెషన్ ఇస్తే బాగుండేది కదా అనిపిస్తుంది. ఇందుకు నేను కూడా భిన్నం కాదు. తెరపై సినిమా చూసేటప్పుడు ఇలా చేస్తే బాగుండేది కదా అనుకున్నాను. నటుడు అన్న తర్వాత ఇది కామన్.

ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్ వివరాలు?

దిల్ రాజు గారి బ్యానర్ లో అడవి సాయికిరణ్ గారి దర్శకత్వంలో 'కేరింత' సినిమా చేస్తున్నాను. ఇప్పటికే 20రోజులు షూటింగ్ పూర్తయ్యింది. సుకుమారి గారి అసిస్టెంట్ వేమారెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఈ రెండూ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న చిత్రాలే. చాలా మంచి కథలు.

మీ సొంత బ్యానర్ లో ఎప్పుడు సినిమా చేయబోతున్నారు?

మా బ్యానర్ లో సినిమా ఉంటుంది. ఆ విశేషాలు తరువాత తెలియజేస్తాను అంటూ ఇంటర్య్వూకు ముగింపు పలికారు సుమంత్ అశ్విన్.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !