View

ఆది, ఠాగూర్ లను 'అల్లుడు శీను' మించాడు - డైరెక్టర్ వి.వి.వినాయక్

Tuesday,July29th,2014, 02:34 PM

''నిన్న (28.7.2014) నా కుటుంబ సభ్యులతో కలిసి సాయిబాబా గుడికి వెళ్లాను. అక్కడ కొంతమంది మహిళలు సినిమా బాగుందన్నారు. చాలా ఆనందం కలిగింది. ముఖ్యంగా నైజాంలో భారీ వసూళ్లు రాబట్టడం చాలా చాలా ఆనందంగా ఉంది. నేటి నుండి కొన్ని ఏరియాల్లో థియేటర్లు కూడా పెంచారు'' అని వి.వి.వినాయక్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో తన కుమారుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ బెల్లంకొండ సురేష్ సమర్పించిన చిత్రం 'అల్లుడు శీను'. బెల్లంకొండ గణేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోందని వి.వి.వినాయక్ అన్నారు. మరి కొన్ని విశేషాలను ఈ ఇంటర్య్వూలో ఈ విధంగా చెప్పారు.

బెల్లంకొండ శ్రీనివాస్ కి మంచి హిట్ ఇవ్వాలనే పట్టుదలతో ఈ సినిమా చేసారు. మరి వసూళ్లు ఎలా ఉన్నాయి?

వాస్తవానికి ఓ స్టార్ హీరో చిత్రాన్ని ఆదరించినట్లుగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం విశేషం. నిజం చెప్పాలంటే ఇప్పటివరకూ నేను దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటిలోకెల్లా నైజాం ఏరియాల్లో ఆది, ఠాగూర్ అత్యధిక వసూళ్లు సాధించాయి. ఆ ఏరియాలో ఆ చిత్రాల వసూళ్లను 'అల్లుడు శీను' అధిగమించడం విశేషం. వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నాయి. శ్రీనివాస్ కి ఓ మంచి హిట్ ఇవ్వాలనే నా కోరిక నెరవేరినందుకు ఆనందంగా ఉంది.

ఈ చిత్రం ఈ స్థాయి విజయం సాధించిన ఘనత దర్శకుడిదే అనాలా?

ఏ దర్శకుడికైనా ఓ బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ ఓ నాలుగు ఆటలకు ప్రేక్షకులను థియేటర్ కి తీసుకురాగలదు. కానీ సినిమా బాగోలేకపోతే ఆ తర్వాత వసూళ్లు అగమ్యగోచరమే. జనరల్ గా నా సినిమాలు బి, సి సెంటర్స్ లో బాగా ఆడతాయి. కానీ ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. అందుకే మంచి విజయాన్ని చవిచూసింది.

ఓ స్టార్ హీరోతో చేసినట్లుగా ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా చేయడానికి కారణం ఏంటీ?

ఈ సినిమా గురించి బెల్లంకొండ సురేష్ నా దగ్గర చెప్పినప్పుడు శ్రీనివాస్ ని పెద్ద హీరోలా లాంఛ్ చేయాలన్నారు. అవసరమైతే వంద కోట్ల బడ్జెట్ తో హిందీ చిత్రం 'ధూమ్'లాంటిది తీయమన్నారు. దాంతో కొంచెం టెన్షన్ పడ్డాను. సురేష్ కోరికమేరకు శ్రీనివాస్ ని గ్రాండ్ గా లాంఛ్ చేయాలంటే అందుకుతగ్గ కథ కుదరాలనుకున్నాను. అలాగే ఆ కథలో అన్ని అంశాలు ఉంటే గ్రాండ్ గా సినిమా తీయ్యొచ్చని భావించాను. ఖర్చు విషయంలో సురేష్ అసలు వెనుకాడలేదు. ఆయనను కంట్రోల్ చేయడం నాకు, ఛోటాకూ కష్టమయ్యింది. తనయుడి మీద సురేష్ కున్న ప్రేమకు ఇది నిదర్శనం.

శ్రీనివాస్ గురించి చెప్పండి?

శ్రీనివాస్ చాలా టాలెంటెడ్. దేశవిదేశాల్లో అతను తీసుకున్న ట్రైనింగ్ ఈ సినిమాకి చాలా ఉపయోగపడింది. సినిమా ప్రారంభంనాడు చిన్న పిల్లాడిలా కనిపించినా, ఆ తర్వాత తను మ్యాన్లీగా కనిపించాడు. ఎక్కడా ఓవర్ యాక్షన్ చేయించకుండా కథకు ఎంత కావాలో అంతే చేయించాను. అల్లుడు శీను మంచి విజయాన్ని సొంతం చేసుకోవడానికి గల కారణాలు? సినిమా మొత్తం కలర్ ఫుల్ గా ఉంటుంది. డ్యాన్స్ లు, ఫైట్స్ బాగా హైలెట్ అయ్యాయి. బంగీ జంప్ ఓ ఎస్సెట్ అని చెప్పాలి. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ చూపించని లొకేషన్స్ ని ఇందులో చూపించాము. ఎంతో కష్టపడి ఆ లొకేషన్స్ కి పర్మిషన్ తీసుకున్నాం. బ్రహ్మానందంగారు చేసిన డింఫుల్ క్యారెక్టర్ బాగా హైలెట్ అయ్యింది. ఓవరాల్ గా ఈ సినిమా విజయానికి కారణం టీమ్ వర్క్ .

మీ తదుపరి చిత్రాలు?

శ్రీనివాస్ తో సినిమాని ఎంతో బాధ్యతగా తీసుకున్నాను. తనకో మంచి విజయం ఇవ్వాలనే నా కోరిక నెరవేరింది. అందుకని రిలాక్స్ అయిపోయాను. ఓ నెలరోజులు ఈ విజయాన్ని ఆస్వాదించి, ఆ తర్వాత నా తదుపరి చిత్రం గురించి తెలియజేస్తాను అంటూ ఇంటర్య్వూకు ముగింపు పలికారు వి.వి.వినాయక్.

V.V.Vinayak Interview about Alludu Srinu



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !