View

'పోరా పోవే' నాకు మంచి మలుపు అవుతుంది - సంగీత దర్శకుడు యాజమాన్య

Wednesday,July02nd,2014, 01:01 AM

మణిశర్మ, కీరవాణి, చక్రి, శ్రీలేఖ తదితర సంగీత దర్శకుల దగ్గర కీ బోర్డ్ ప్లేయర్ గా వర్క్ చేసిన యాజమాన్య 'నువ్వే నా బంగారం' చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం 'పోరా పోవే' చిత్రానికి సంగీతం అందించారు యాజమాన్య. యస్.వి.మూవీ మేకర్స్ బ్యానర్ పై కరణ్, సౌమ్య సుకుమార్ లను హీరో, హీరోయిన్ లుగా పరిచయం చేస్తూ యెల్కిచర్ల వీరేంద్రరెడ్డి, శ్రీనివాస్ బింగమళ్ళ నిర్మాతలుగా, బెట్టింగ్ బంగార్రాజు, పూలరంగడు రచయిత లంకపల్లి శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం విశేషాలను, తన భవిష్యత్తు ప్రాజక్ట్ ల గురించి యాజమాన్యతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం...

కీ బోర్డ్ ప్లేయర్ గా చిత్ర పరిశ్రమలోకి ఎలా ఎంటరయ్యారు?

నేను చాలా కచేరీలకు కీ బోర్డ్ ప్లేయర్ గా వ్యవహరిస్తుండేవాడిని. ఓ కచేరీలో సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ గారు నన్ను చూసి ఓ చిన్న అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చిత్ర పరిశ్రమలో స్థిరపడటానికి కృషి చేసాను. అందులో భాగంగా చాలామంది సంగీత దర్శకుల దగ్గర కీ బోర్డ్ ప్లేయర్ గా వర్క్ చేసాను.

నువ్వే నా బంగారం సినిమాకి ఎలా అవకాశం వచ్చింది?

నిజం చెప్పాలంటే... కీ బోర్డ్ ప్లేయర్ గా వర్క్ చేస్తునప్పుడు సంగీత దర్శకుడిగా చాలా అవకాశాలు వచ్చాయి. కానీ మంచి సినిమా ద్వారా, సంగీతానికి ప్రాధాన్యం ఉన్న సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవ్వాలనుకున్నాను. 'నువ్వే నా బంగారం' మ్యూజిక్ కి స్కోప్ ఉన్న చిత్రం. అందుకే ఆ సినిమా ఆఫర్ రాగానే అంగీకరించాను. సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదుగానీ, ఆడియో, రీ-రికార్డింగ్ కి మంచి పేరు వచ్చింది. దాంతో సంగీత దర్శకుడిగా ఆ సినిమాతోనే నాకు గుర్తింపు లభించింది.

పోరా పోవే గురించి చెప్పండి?

ఈ సినిమాకి పాటలు చాలా వెరైటీగా ట్రై చేసాను. ఈ చిత్రంలో ఆరు పాటలున్నాయి. ఓ పది ట్యూన్లు చేసాను. అందులోంచి ఆరు ట్యూన్స్ ని డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు. మంచి సబ్జెక్ట్ తో ఈ చిత్రం రూపొందింది. కాబట్టి డెఫనెట్ గా ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. అలాగే సంగీత దర్శకుడిగా నాకు ఈ చిత్రం ఓ మంచి మలుపు అవుతుందని నమ్ముతున్నాను.

ఈ చిత్రానికి సింగిల్ కార్డుతో చంద్రబోస్ పాటలు రాసారు కదా?

అవును. మొత్తం పాటలు ఆయనే రాసారు. ట్యూన్స్ రెడీ అవ్వగానే, ఎవరు పాటలు రాస్తే బెటర్ అని డైరెక్టర్ అడిగారు. చంద్రబోస్ గారు రాస్తే, సాహిత్యం విలువలు ఉంటాయని చెప్పాను. దాంతో ఆయన్ని అప్రోచ్ అయ్యాము. మొత్తం ఆరు పాటలు రాయమని అడిగాము. ఈ చిత్రం కథ, ట్యూన్స్ ఆయనకి కూడా బాగా నచ్చడంతో అన్ని పాటలు రాయడానికి అంగీకరించారు. లిరిక్స్ చాలా బాగా కుదిరాయి.

మీరు ఈ చిత్రంలో ఓ పాట కూడా పాడారు కదా?

అవును... ఓ పాట పాడాను. అదనాన్ సామి వాయిస్ లో ఈ పాటను ట్రై చేసాను. చాలా బాగా వచ్చింది. అలాగే హర్షదీప్ కౌర్ తో ఈ సినిమా కోసం తొలిసారి తెలుగులో పాట పాడించాను. ఈ పాట కూడా చాలా బాగా వచ్చింది. ఇటీవలే ఈ చిత్రం ఆడియో విడుదలయ్యింది. ఈ ఆల్బమ్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. పాటలన్నీ విజువల్ గా కూడా చాలా బాగుంటాయి.

సంగీత దర్శకుల్లో ఎవరంటే చాలా ఇష్టం?

అందరూ నాకు ఇష్టమే. కానీ చిన్నప్పట్నుంచి ఇళయరాజా, ఏ.ఆర్.రహమాన్ పాటలంటే చాలా ఇష్టం. వారిని స్ఫూర్తిగా తీసుకునే సంగీత దర్శకుడిగా ఎదగాలనుకున్నాను.

'నాటుకోడి' చిత్రానికి పాటలిచ్చారు కదా? దాని గురించి చెప్పండి?

ఈ చిత్రానికి శ్రీకాంత్ గారు హీరో. ఈ చిత్రంలో నాలుగు పాటలున్నాయి. ఇటీవలే రికార్డింగ్ చేసాము. పాటలు చాలా బాగా వచ్చాయి. రీ-రికార్డింగ్ కి కూడా స్కోప్ ఉన్న సినిమా ఇది. డిఫరెంట్ గా ఆర్.ఆర్ చేస్తాను. ఇది కూడా నా కెరియర్ లో మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది.

ఇంకా ఏమైనా సినిమాలు కమిట్ అయ్యారా?

à°“ నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఫైనలైజ్ అవ్వగానే తెలియజేస్తాను. మంచి అవకాశాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు అయినప్పటికీ, సంగీత దర్శకుడిగా నాకు పేరు తెచ్చి పెట్టే చిత్రాలే కావడంతో  à°•à±†à°°à°¿à°¯à°°à± ఆశాజనకంగా ఉంది. 

Yajamanya Interview



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !