చిత్ర పరిశ్రమకు శుక్రవారం చాలా ఇంపార్టెంట్. ఆ రోజు రిలీజ్ అయ్యే సినిమాల స్థాయిని బట్టి బాక్సాఫీస్ కళకళలాడిపోతుంది. ఈ శుక్రవారం (17.11.2023) చాలా స్పెషల్. ఎందుకంటే లేడి ఓరియంటెడ్ సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఈ ముద్దుగుమ్మల సినిమాలు కాసుల వర్షం కురిపిస్తాయా... ఆడియన్స్ ని మెప్పించే హీరోయిన్ ఎవరు... ఏ హీరోయిన్ గెలుపు గుర్రం ఎక్కబోతోంది తెలుసుకుందాం.
పాయల్ రాజ్ ఫుత్, హీరోయిన్ గా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన "మంగళవారం" రేపు థియేటర్స్ కి వస్తోంది. ఈ సినిమా పై చాల అంచనాలు ఉన్నాయి. ఆర్ ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ ఫుత్, అజయ్ భూపతి చక్కటి విజయాన్ని అందుకున్నారు. మళ్లీ వీరి కాంబినేషన్ తో తెరకెక్కిన "మంగళవారం" కూడా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో చిత్రం యూనిట్ ఉంది. ఈ సినిమా పాయల్ కెరీర్ కి ఎలాంటి బ్రేక్ ఇవ్వనుందో చూడాల్సిందే.
మెహ్రీన్, రుక్సార్ దిల్లాన్ మెయిన్ లీడ్స్ గా తెరకెక్కిన సినిమా "స్పార్క్". ఈ సినిమా విజయం ఈ ఇద్దరి హీరోయిన్లకు చాలా ఇంపార్టెంట్. వరుస ఫ్లాప్ లతో మెహ్రీన్ కెరీర్ చాలా ఇబ్బందుల్లో ఉంది. సక్సెస్ ఫుల్ సినిమాతో మళ్లీ తన కెరీర్ ని గాడిలో పడేలా చేసుకోవాలనే తాపత్రయంతో ఉంది మెహ్రీన్. రుక్సార్ సైతం సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. మరి "స్పార్క్" ఈ ఇద్దరి హీరోయిన్లకు కలిసొస్తుందా... వీరి కెరీర్ కు మంచి మలుపు అవుతుందా వేచి చూడాల్సిందే.
హన్సిక లీడ్ రోల్ చేసిన లేడీ ఓరియంటెడ్ మూవీ "మై నేమ్ ఈజ్ శృతి". ఈ సినిమా కూడా రేపు థియేటర్స్ కి వస్తోంది. చాలా గ్యాప్ తర్వాత హన్సిక నటించిన తెలుగు సినిమా ఇది. ఈ సినిమా విజయం సాధిస్తే... తెలుగులో మరికొన్ని సినిమాలు చేసే అవకాశం హన్సిక కు వస్తుంది. లేకపోతే తెలుగు సినిమాలకు హన్సిక దూరమయ్యే అవకాశం ఉంది. మరి హన్సిక కెరీర్ కి ఈ సినిమా ఎలాంటి మలుపు అవుతుందో వేచిచూద్దాం.
సో... రేపు విడుదలవుతున్న ఈ సినిమాలు ఏ హీరోయిన్ ని గెలుపు గుర్రం ఎక్కేలా చేస్తాయో వేచిచూద్దాం.