View

Heart attack Review

Friday,January31st,2014, 03:49 PM

చిత్రం - హార్ట్ ఎటాక్
బ్యానర్ - పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్
నటీనటులు - నితిన్, ఆదాశర్మ, అజాజ్ ఖాన్, బ్రహ్మానందం, అలీ తదితరులు
సంగీతం - అనూప్ రూబెన్స్
ఎడిటింగ్ - ఎస్.ఆర్.శేఖర్
సినిమాటోగ్రఫీ - అమోల్ రాథోడ్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం - పూరి జగన్నాధ్
సమర్పణ - లావణ్య
విడుదల తేదీ - 31 జనవరి, 2014

వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న నితిన్ హీరోగా పూరి జగన్నాధ్ స్వీయదర్శకత్వంలో రూపొందిన 'హార్ట్ ఎటాక్' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యంది. టైటిల్ దగ్గర్నుంచి, ఈ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్ అన్నింటిలోనూ వైవిధ్యం చూపించి ఈ సినిమాపై అంచనాలు పెంచేసాడు పూరి. యూత్ ని టార్గెట్ చేసుకుని ఈ సినిమా చేసాడు. మరి పూరి జగన్నాధ్ ఈ అంచనాలను చేరుకునేలా సినిమా చేయగలిగాడా అనే విషయాన్ని తెలుసుకుందాం.

à°•à°¥
తల్లిదండ్రులను ఒక యాక్సిడెంట్ లో పోగొట్టుకుని ఎలాంటి టార్గెట్ పెట్టుకోకుండా ప్రతి రోజూ దొరికిన పని చేస్తూ, లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ జీవిస్తుంటాడు వరుణ్ (నితిన్). తన ఫ్రెండ్ ప్రేమను ఆమె తండ్రితో అంగీకరింపజేయడానికి హయాతీ (అదా శర్మ)  స్పెయిన్ వస్తుంది. స్పెయిన్ లో అడుగు పెట్టిన వెంటనే వరుణ్ కి ఎదురుపడుతుంది హయాతీ. ఆమెను చూసిన దగ్గర్నుంచి ఆమె వెనకాల ఓ ముద్దు కావాలంటూ వెంటపడుతుంటాడు వరుణ్. అతని యాటిట్యూడ్ నచ్చిన హయాతీ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ ముద్దు మాత్రం చాలని, ఆమెతో రిలేషన్ షిప్ కి రెడీగా లేనని చెబుతాడు వరుణ్. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వరుణ్ కి లిప్ కిస్ ఇవ్వడానికి అంగీకరించిన హయాతీ ఇక జీవితంలో తనకు ఎదురుపడకూడదనే కండీషన్ ని వరుణ్ కి పెడుతుంది.
తన ఫ్రెండ్ పెళ్లి అయిపోవడంతో హయాతీ గోవా వెళ్లి పోతుంది. కానీ వరుణ్ ని మాత్రం హయాతీ పెదవి ముద్దు వెంటాడుతుంటుంది. అప్పుడు హయాతీని తను ప్రేమిస్తున్న విషయం తెలుసుకుని ఆమెను కలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. హయాతీ ఫ్రెండ్ సిస్టర్ ద్వారా హయాతీ గోవాలో ఉందనే విషయం తెలుసుకుంటాడు.
గోవా వెళ్లి హయాతీని కలుసుకుంటాడు వరుణ్. కానీ హయాతీకి ఆల్రెడీ పెళ్లి కుదరిందని తెలుసుకుని ఆమెను ఎలాగైనా కన్వీన్స్ చేసి తను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు వరుణ్. హయాతీని పెళ్లి చేసుకోబోయే మకరంద్ ఆమె తండ్రి ఆపరేషన్ నిమిత్తం 20లక్షలు ఇచ్చాడని, అందుకే అతనిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిందని తెలుసుకుంటాడు. ఆ 20లక్షలు తను ఇస్తానని, హయాతీని వదిలేయాలని మకరంద్ ని అడుగుతాడు వరుణ్.  20లక్షలు సంపాదించే ప్రాసెస్ లో వరుణ్ కి ఓ పని దొరుకుతుంది. ప్రకాష్ రాజ్ కూతురు కిడ్నాప్ కు గురవుతుంది. తన కూతురిని విడిపించి తీసుకు వస్తే 2కోట్లు ఇస్తానని వరుణ్ కి చెబుతాడు ప్రకాష్ రాజ్. దాంతో అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్న గ్యాంగ్ ని కనిపెడతాడు. మకరందే ఈ పని చేస్తున్నాడని, కిడ్నాప్ చేసిన అమ్మాయిలను విదేశాలకు అమ్మేస్తున్నాడని తెలుసుకుని ఈ గ్యాంగ్ ని పట్టుకోవడానికి అతని ఐల్యాండ్ కి వెళతాడు వరుణ్. అక్కడ హయాతీని విదేశాలకు అమ్మేయడానికి సిద్ధపడుతుంటాడు మకరంద్. ఆ గ్యాంగ్ ని అంతమొందించి హయాతీ కి దగ్గరవుతాడు వరుణ్.

ఫిల్మీబజ్ విశ్లేషణ
'గుండె జారి గల్లతయ్యిందే', 'ఇష్క్' లాంటి మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ చేసిన నితిన్ 'హార్ట్ ఎటాక్' చిత్రంతో మరోసారి యూత్ ని ఆకట్టుకోవడంతో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. స్టైలిష్ లుక్, బాడీ లాంగ్వేజ్ తో ఓ గోల్ లేని కుర్రాడు ఎలా ఉంటాడో పర్ ఫెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగాడు. హయాతీగా అదాశర్మ తొలి సినిమాతోనే కుర్రకారు మనసులను కొల్లగొట్టేయడం ఖాయం. రమణబాబుగా బ్రహ్మానందం మరోసారి అలరించాడు. అలీ, విలన్ గ్యాంగ్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

చిన్న స్టోరీ లైన్ ని తీసుకుని ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లే తో ప్రేక్షకులను అలరించడం పూరి జగన్నాధ్ కు వెన్నతో పెట్టిన విద్య.  అతని గత చిత్రాలను గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. ఇక 'హర్ట్ ఎటాక్' విషయంలో కూడా అదే పంధాను ఫాలో అయ్యాడు. కాకపోతే తన ప్రతి సినిమాలో ఉండే ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ ని ఈ సినిమాలో మిస్ అయ్యాడు. అది ఈ సినిమాకి చాలా మైనస్ అయ్యింది. కెమెరామాన్ అమోల్ రాధోడ్ స్పెయిన్, గోవా అందాలను చక్కగా చూపించాడు. ప్రతి ప్రేమ్ రిచ్ గా ఉంది. అనూప్ పాటలు ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా 'సెలవనుకో...' పాట ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాతగా పూరి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు.

ఫైనల్ గా...
యూత్ ని టార్గెట్ చేసుకుని తీసిన  'హార్ట్ ఎటాక్' వారికి మాత్రమే రీచ్ అవుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !