View

'అనామిక' రివ్వ్యూ

Thursday,May01st,2014, 07:54 AM

చిత్రం - అనామిక
నటీనటులు: నయనతార, హర్షవర్థన్ రాణె, వైభవ్, సీనియర్ నరేష్, పశుపతి, శ్రీరంజని తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
కెమెరా: విజయ్ సి. కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - యండమూరి వీరేంద్రనాధ్, శేఖర్ కమ్ముల
దర్శకత్వం: శేఖర్ కమ్ముల.
నిర్మాతలు - వయాకామ్ 18, ఐడెంటిటీ మోషన్ పిక్చర్స్, లాగ్ లైన్ పిక్చర్స్
విడుదల తేదీ - 1 మే, 2014

ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్.. ఇలా చేసిన ప్రతి సినిమా ద్వారా తనలో మంచి దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించుకున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పటివరకు స్ర్టయిట్ చిత్రాలు మాత్రమే చేసిన శేఖర్ కమ్మల తొలిసారి చేసిన రీమేక్ మూవీ 'అనామిక'. విద్యాబాలన్ నాయికగా రూపొందిన సూపర్ హిట్ మూవీ 'కహానీ'కి ఇది రీమేక్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. మరి.. హిందీలో విద్యాబాలన్ నటించినంత అద్భుతంగా నయనతార నటించిందా? హిందీ చిత్రాన్ని సుజోయ్ ఘోష్ తీసినంత అద్భుతంగా తెలుగు వెర్షన్ ని శేఖర్ తీశాడా? ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూద్దాం...

à°•à°¥
పీపుల్ ప్లాజాలో బాంబు బ్లాస్ట్ జరగడంతో కథ ఆరంభమవుతుంది. ఈ బాంబు బ్లాస్ట్ కు బాధ్యత వహిస్తూ హోం మినిస్టర్ రాజీనామా చేస్తాడు. దాంతో కొత్త హోం మినిస్టర్ గా ఆదికేశవయ్య (సీనియర్ నరేష్) బాధ్యతలు స్వీకరిస్తాడు. పీపుల్ ప్లాజా బాంబు బ్లాస్ట్ లకు కారణం మిలింద్ అంజీ అని డిసైడ్ అయిన పోలీసాఫీసర్ ఖాన్ (పశుపతి) అతనిని విచారించడానికి హోం మినిస్టర్ పర్మిషన్ అడుగుతాడు. మతకలహాలు జరుగుతాయనే కారణం చెప్పి మిలింద్ అంజీని విచారించడానికి ఖాన్ కి పర్మిషన్ ఇవ్వడు హోం మినిస్టర్. ఇదే సమయంలో అమెరికా నుంచి అనామిక (నయనతార) వచ్చి తన భర్త అజయ్ శాస్ర్తి (హర్షవర్ధన్ రాణె) కనబడటంలేదని పోలీస్ స్టేషన్ లో కంఫ్లైంట్ చేస్తుంది. కానీ ఈ కంఫ్లైంట్ ని లైట్ గా తీసుకుంటారు. అనామిక మాత్రం ఓల్డ్ సిటీ అంతా తన భర్త కోసం వెతుకుతుంటుంది. పార్థసారధి (వైభవ్ రెడ్డి) మాత్రం భర్తను వెతుకున్న అనామికకు సహాయం చేస్తాడు. ఈ ప్రాసెస్ లో అనామికకు సహాయం చేస్తున్న వారందరూ చనిపోతుంటారు. అనామికను సైతం చంపడానికి ట్రై చేస్తుంటారు. అనామికను చంపాలనుకుంటున్నది ఎవరు? అనామికకు సహాయం చేస్తున్న వారందరూ ఎందుకు చనిపోతున్నారు? అనామిక భర్త అజయ్ శాస్ర్తి ఏమయ్యాడు? హోం మినిస్టర్ మిలింద్ ని ఎందుకు విచారణ చేయకుండా ఆపాడు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఫిల్మీ బజ్ విశ్లేషణ

నటీనటులు
అనామిక పాత్ర ప్రాధాన్యంగా ఈ సినిమా సాగుతుంది. కాబట్టి ఈ పాత్రను పోషించే ఆర్టిస్ట్ మంచి అభినయం కనబర్చగలగాలి. ఆ రకంగా అనామిక పాత్రకు నయనతార సూట్ అయ్యింది. వంద శాతం ఈ పాత్రలో ఒదిగిపోయింది నయనతార. ఆమె నటన ఈ సినిమాకి మెయిన్ హైలెట్. ఎమోషనల్ సీన్స్ లో నయనతార కనబర్చిన నటన ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయం. అజయ్ శాస్ర్తి పాత్ర నిడివి చాలా తక్కువ. కానీ నిడివి తక్కువ పాత్రను కూడా ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకునిపోయేలా నటించాడు హర్షవర్ధన్ రాణె. పార్థసారధిగా వైభవ్ రెడ్డి చాలా డీసెంట్ గా నటించాడు. పోలీసాఫీసర్ గా పశుపతి, హోం మినిష్టర్ గా సీనియర్ నరేష్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం
యండమూరి వీరేంద్రనాధ్, శేఖర్ కమ్ముల అందించిన డైలాగులు, స్క్రీన్ ప్లే à°ˆ సినిమాకి చాలా ప్లస్. సెకండాఫ్ లో థ్రిల్లింగ్ అంశాలు, క్లయిమాక్స్ బాగున్నాయి. ఫస్టాప్ కు సంబంధించి శేఖర్ కమ్ముల మరికొంత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఫస్టాప్ లోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తాయి. ఎంటర్ టైన్ మెంట్ గురించి శేఖర్ కమ్ముల అసలు ఆలోచించలేదు.  అఫ్ కోర్స్ à°ˆ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి, ఎంటర్ టైన్ మెంట్ గురించి శేఖర్ పెద్దగా ఆలోచించకపోయి ఉండొచ్చు. కానీ ప్రేక్షకులు రిలాక్స్ అవ్వాలంటే ఎంటర్ టైన్ మెంట్ కంపల్సరీ. అలాగే, సినిమాలో  అక్కడక్కడా ఉన్న హిందీ డైలాగులకు తెలుగు లేక ఇంగ్లిష్ లో సబ్ టైటిల్స్ వేసి ఉండాల్సిది. హిందీ భాష తెలియనివాళ్లు à°† సన్నివేశాలకు కనెక్ట్ అయ్యే ప్రసక్తే లేదు. à°ˆ సినిమాకి ప్లస్ పాయింట్ నిడివి తక్కువ కావడం. ఫస్టాప్ బోర్ కొట్టినప్పటికీ, సెకండాఫ్ థ్రిల్లింగ్ à°—à°¾ సాగడంతో ప్రేక్షకులు సినిమాలో లీనమై చూస్తారు, à°† à°°à°•à°‚à°—à°¾ శేఖర్ కమ్ముల సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఓవరాల్ à°—à°¾ శేఖర్ కమ్ముల à°ˆ చిత్రాన్ని చక్కగా హ్యాండిల్ చేయగలిగాడు. à°Žà°‚à°¤ మంచి సినిమాలో అయినా చిన్న చిన్న లోపాలుంటాయి. à°ˆ సినిమాలోని లోపం కథానాయికను 'గర్భవతి'à°—à°¾ చూపించకపోవడం. అబద్ధపు గర్భంతో తన నాయిక సమాజాన్నిమోసం చేయడం ఇష్టం లేకే గర్భవతిగా చూపించలేదని శేఖర్ పేర్కొన్నాడు. కానీ, హిందీ 'కహానీ'లో మంచి ఫీల్ క్యారీ కావడానికి కథానాయిక గర్భవతి కావడమే ప్రధాన కారణం అయ్యింది. తెలుగు నాయిక కూడా గర్భవతిగా కనిపించి ఉంటే, à°ˆ సినిమాకి ఇంకా ప్లస్ అయ్యుండేదే తప్ప మైనస్ మాత్రం అయ్యుండేది కాదు. à°ˆ సినిమాకి యం. యం.కీరవాణి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసాయి. విజయ్.సి.కుమార్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్ à°—à°¾ సినిమా చాలా రిచ్ à°—à°¾ ఉంది. మరీ ముఖ్యంగా ఓల్డ్ సిటీని చాలా చక్కగా చూపించారు. మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ షార్ప్ à°—à°¾ ఉంది. ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ ఎడిట్ చేస్తే బాగుండేదేమోనని అనిపిస్తుంది. కానీ సినిమా నిడివి తక్కువ కావడంతో à°ˆ లోపం పెద్దగా కనిపించదు. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ఓల్డ్ సిటీ సెట్ ని చక్కగా రూపొందించారు. వయాకామ్ 18, ఐడెంటిటీ మోషన్ పిక్చర్స్, లాగ్ లైన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్ à°—à°¾ ఉన్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే... హిందీ చిత్రం 'కహానీ'కి 'అనామిక' రీమేక్ అయనప్పటికీ... సినిమా మొదలైన 10నిముషాలకే ఈ విషయాన్ని మర్చిపోతాం. కాబట్టి 'కహాని'ని చూసిన ప్రేక్షకులు సైతం ఈ సినిమాని చూడొచ్చు. ఇక ఆ సినిమాని చూడని ప్రేక్షకులు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని హాయిగా ఎంజాయ్ చెయ్యొచ్చు.




Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !