View

S/O Satya Murthy Movie Review

Thursday,April09th,2015, 07:56 AM

చిత్రం - సన్నాఫ్ సత్యమూర్తి
బ్యానర్ - హారిక & హాసిని క్రియేషన్స్
నటీనటులు - అల్లు అర్జున్, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, రావు రమేష్, బ్రహ్మానందం, అలీ, వెన్నెల కిషోర్, స్నేహ, సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ, సింధు తులానీ, పవిత్రా లోకేష్, ప్రియ తదితరులు
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ - ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి
నిర్మాత - యస్. రాధాకృష్ణ (చినబాబు)
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్

సరిగ్గా మూడేళ్ల క్రితం అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'జులాయి' ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఆ చిత్రానికి ఎస్. రాధాకృష్ణ ఓ నిర్మాత. ఇప్పుడు సోలో నిర్మాతగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఆయన నిర్మించిన చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి' ('ఎస్ఒఎస్'). ఈ త్రయం మళ్లీ మరో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంటారా?.. 'ఎస్ఒఎస్' ఆరంభం నుంచి జరుగుతున్న చర్చ ఇది. మరి.. ఈ త్రయానికి 'ఎస్ఒఎస్' మరో హిట్ ఇస్తుందా? రండి చూద్దాం...

à°•à°¥
సత్యమూర్తి (ప్రకాష్ రాజ్) పెద్ద బిజినెస్ మ్యాన్. 300కోట్ల ఆస్తిపరుడు. డబ్బు కంటే విలువలతో బ్రతకడం ముఖ్యమని భావించే వ్యక్తి. తన వల్ల ఎవ్వరూ ఇబ్బందిపడకూడదని, ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవాలని తపించే వ్యక్తి. అతనికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు (వెన్నెల కిషోర్) తండ్రి చాటు బిడ్డ. చిన్న కొడుకు విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) ఎలాంటి చీకూ చింతా లేకుండా జాలీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు.

సత్యమూర్తి ఓ యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. సత్యమూర్తి అప్పులు, ఆస్తులు సరిసమానంగా ఉంటాయి. దాంతో తండ్రి చేసిన అప్పులు తనకు సంబంధంలేదని చెప్పి ఐ.పి పెట్టేయమని విరాజ్ ఆనంద్ కి సత్యమూర్తి ఫ్రెండ్ సాంబశివరావు (రాజేంద్రప్రసాద్) సలహా ఇస్తాడు. కానీ అలా చేయడం వల్ల తన తండ్రి మోసగాడుగా మిగిలిపోతాడని, విలువలతో బ్రతికిన ఆయన పేరుకు ఎలాంటి కళంకం రాకూడదని చెప్పి, ఆస్తిని వదిలేసుకుని తన కుటుంబాన్ని తీసుకుని బయటికి వచ్చేస్తాడు విరాజ్ ఆనంద్. తన కూతురు (ఆదాశర్మ)ని విరాజ్ ఆనంద్ కు ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్న రావు రమేష్ కూడా ఆస్తి పోవడంతో సంబంధం తెంచుకుంటాడు.

విలువులతో బ్రతకడం కాదు... డబ్బులు సంపాదించి దర్జాగా బ్రతకాలనే ఆశయంతో ఉండే సాంబశివరావు తన ఫ్రెండ్ కొడుకు విరాజ్ ని తండ్రి ఆలోచనలను నెత్తిన వేసుకున్న పిచ్చివాడుగా భావిస్తుంటాడు. పైగా తనకు లిటికేషన్ ఉన్న భూమిని అమ్మిన సత్యమూర్తి మోసగాడే కదా అని విరాజ్ తో అంటాడు. తన తండ్రిని మోసగాడు అనడం భరించలేని విరాజ్ ఆ లిటికేషన్ భూమి ఒరిజినల్ పేపర్స్ తీసుకువచ్చి సాంబశివరావు చేతిలో పెట్టి తన తండ్రిని మోసగాడు అనే మాట పడనివ్వకుండా చేయాలని నిర్ణయించుకుంటాడు. అలా చేస్తే విరాజ్ ప్రేమించిన తన కూతురు సమీరా (సమంత) ని ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు సాంబశివరావు.

అయితే ఆ లిటికేషన్ భూమిని ఓ పెద్ద రౌడీ దేవరాజ్ (ఉపేంద్ర) కబ్జా చేస్తాడు. అతని నుంచి విరాజ్ ఆ లిటికేషన్ భూమి పేపర్స్ ఎలా సంపాదిస్తాడు? సాంబశివరావు చివరికి సత్యమూర్తి గొప్ప వ్యక్తి అని ఒప్పుకుంటాడా? విరాజ్, సమీరా పెళ్లి జరుగుతుందా అనేదే ఈ చిత్రం సెకండాఫ్.

నటీనటుల పర్ఫార్మెన్స్
ఈ సినిమా మొత్తం అల్లు అర్జున్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. విరాజ్ ఆనంద్ పాత్రను సునాయాసంగా చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి పరిణతి కనబర్చాడు. ముఖ్యంగా తండ్రి పాటించిన విలువలను కాపాడ్డానికి తాపత్రయ పడే కుర్రాడిగా 'మంచి కొడుకు' అనే స్థాయిలో నటించాడు. సమంత చాలా క్యూట్ గా ఉంది. ఉన్నంతలో అదాశర్మ ఓకే అనిపించుకుంది. నిత్యామీనన్ ఎప్పటిలానే బాగా నటించింది. తన పాత్రకు తను డబ్బింగ్ చెప్పుకుని, పరిపూర్ణమైన నటి అని మరోసారి నిరూపించుకుంది. ధర్మరాజు పాత్రకు ఉపేంద్రను ఎంపిక చేయడం బాగుంది. ఈ మధ్య కాలంలో కనిపించిన విలన్లే ప్రతి సినిమాలోనూ కనిపిస్తుండటంతో ఉపేంద్ర చేయడం ఓ ష్రెష్ ఫీల్ ని కలగజేసింది. స్నేహ కూడా బాగుంది. ఇక, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, బ్రహ్మానందం, పవిత్రా లోకేష్, సింధు తులానీ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. కీ.శే. ఎమ్మెస్ నారాయణ నటించిన సన్నివేశాలు బాగున్నాయి. ప్రకాష్ రాజ్ కనిపించేది కాసేపే అయినా గుర్తుండిపోతాడు.

సాంకేతిక వర్గం
ఈ సినిమాకి తీసుకున్న స్టోరీ లైన్ చాలా బాగుంది. సినిమా సక్సెస్ కి ముడి అక్కడే పడింది. చిన్న పాయింట్ చుట్టూ కథ అల్లి, తీసిన వైనం బాగుంది. తనలో మంచి దర్శకుడు ఉన్న విషయాన్ని త్రివిక్రమ్ మరోసారి నిరూపించుకున్నాడు. సంభాషణలు బాగున్నాయి. పాటలకన్నా దేవిశ్రీ ప్రసాద్ రీ-రికార్డింగ్ పరంగా బాగా మెరిశాడు. ప్రసాద్ మూరెళ్ల కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది. కంటెంట్ కి తగ్గట్టు ఎడిటింగ్ చేసాడు ప్రవీణ్ పూడి. నిర్మాణ విలువలు బ్రహ్మాండం అనే చెప్పాలి.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఎంతో ఉన్నతంగా బ్రతికిన తన తండ్రి చనిపోవడం, ఆ తండ్రి విలువలనే ఆస్తిగా తయుడు భావించడం అనే పాయింట్ బాగుంది. తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయినా ఆయన ఖ్యాతి మాత్రం అలా నిలిచిపోవాలనే తనయుడి తాపత్రయం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ఓ ఎమోషన్ ఉంటుంది. ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ కొంచెం ఎక్కడో దారి తప్పుతుందేమో అనిపిస్తుంది. కానీ, ఆ ఫీలింగ్ నుంచి బయటపడేసే విధంగా తదుపరి సన్నివేశాలుంటాయి. విలన్ ఇంట్లోనే హీరో తిష్ట వేసి, కూల్ గా వ్యవహారం నడపడం అనేది ఈ మధ్య అన్ని సినిమాల్లోనూ చూస్తున్నదే. ఈ సినిమాలోనూ చూస్తాం. అది కాస్త రొటీన్ అనిపించినా ఓవరాల్ గా సినిమా బాగుంది. ఈ సినిమా ఎందుకు చూడాలి? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. 'అల్లు అర్జున్' కోసం అని చెప్పాలి. లుక్ బాగుంది. చాలా స్టయిలిష్ గా ఉన్నాడు. బాగా యాక్ట్ చేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. 'సన్నాఫ్ సత్యమూర్తి...' అని గర్వంగా చెప్పకుంటాడు హీరో. సమాజంలో కూడా 'డాటరాఫ్... ', 'సన్నాఫ్...' అంటే గర్వంగా బిడ్డలు చెప్పుకునే గొప్ప తండ్రులు ఉన్నారు. ఆ తండ్రులకు తగ్గ బిడ్డలూ ఉన్నారు. అలా ఉన్నవాళ్లకి ఈ సినిమా నచ్చుతుంది.. లేని వాళ్లకి ఈ చిత్రం ఓ చిన్నపాటి సందేశం ఇస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఇది 'హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్'. అందరూ ఎంజాయ్ చెయ్యొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !