View

దొర మూవీ రివ్య్వూ

Friday,July01st,2016, 12:50 PM

చిత్రం - దొర
బ్యానర్ - సెల్యూలాయిడ్స్
నటీనటులు - సత్యరాజ్, శిబిసత్యరాజ్, బిందుమాధవి తదితరులు
సినిమాటోగ్రఫీ - యువరాజ్
సంగీతం - సిద్దార్ధ్ విపిన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - చిన్నా
మాటలు - శశాంక్ వెన్నెలకంటి
నిర్మాత - జక్కం జవహర్ బాబు
దర్శకత్వం - ధరణీధరన్


హారర్ ఎంటర్ టైనర్స్ ని ఇష్టపడే ఆడియన్స్ సంఖ్య ఎక్కువైపోయింది. అందుకే ఈ జానర్ లో సినిమా తెరకెక్కించడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. మినిమమ్ బడ్జెట్ తో సినిమా నిర్మిస్తే నిర్మాత సేఫ్... ఓ సింఫుల్ స్టోరీ అయినా సరే ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లే చేయగలిగితే డైరెక్టర్ కి పాస్ మార్కులు. ఇక నటీనటులకు సైతం తమ టాలెంట్ ని బయట పెట్టుకునే అవకాశం. అందుకే ఈ జానర్ లో సినిమాలు చేయడానికి అందరూ ఇష్టపడతున్నారు. ఇప్పుడీ జానర్ లో రూపొందిన సినిమా 'దొర'. తమిళంలో 'జాక్సన్ దొర'గా ఈ చిత్రం రూపొందింది. 'కట్టప్ప'గా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న సత్యరాజ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఆయన తనయుడు శిబిసత్యరాజ్, బిందుమాధవి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ధరణీ దరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జవహర్ బాబు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది... ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందా తెలుసుకుందాం.


కథ
దొరపురంలో జాక్సన్ అనే ప్రేతాత్మ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటుంది. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఎస్.ఐ సత్య (శిబిసత్యరాజ్) రంగంలోకి దిగుతాడు. దొరపురం చేరుకున్న సత్య ఆ ఊరి ప్రెసిడెంట్ కూతురు విజయ (బిందుమాధవి) ని ప్రేమిస్తాడు. వీరి ప్రేమ వ్యవహారం ప్రెసిడెంట్ వరకూ వెళుతుంది. కానీ విజయ్ ని పెళ్లి చేసుకోవడానికి ఆమె బావ వీర (కరుణాకరన్) కూడా ముందుకు రావడంతో ప్రెసిడెంట్ ఓ ప్లాన్ చేస్తాడు. వారం రోజులు జాక్సన్ బంగాళాలో ఎవరైతే గడుపుతారో వారితో విజయ పెళ్లి జరుగుతుందని చెబుతాడు. ప్రెసిడెంట్ మాటల మేరకు సత్య, విజయ జాక్సన్ బంగళాకు వెళతారు. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి... జాక్సన్, దొర ఎవరు... సత్యరాజ్ కి లింకేంటీ అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
సత్యరాజ్, శిబిసత్యరాజ్, బిందుమాధవి, కరుణాకరన్ అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. కరుణాకరన్, శిబి కాంబినేషన్ లోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
బ్రిటిష్ ఆత్మకు, ఇండియన్ ఆత్మకు జరిగే గొడవ ఈ చిత్రం మెయిన్ స్టోరీ లైన్. ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్ అయినప్పటికీ, స్ర్కీన్ ప్లే పరంగా ఫెయిల్ అవ్వడంతో ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. యువ సినిమాటోగ్రఫీ బాగుంది. సిద్దార్ద్ సంగీతం యావరేజ్ గా ఉంది. చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
స్టోరీ లైన్ బాగుంది. స్ర్కీన్ ప్లే పరమైన తప్పిదం వల్ల ఈ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం కష్టం. భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ లేవు... కడుపుబ్బా నవ్వించే ఎంటర్ టైన్ మెంట్ లేదు. ఇలాంటి సినిమాల నుంచి ప్రేక్షకులు ఈ రెండింటిని ఎక్స్ ఫెక్ట్ చేస్తారు. ఆ ఎలిమెంట్స్ మిస్ అయితే సినిమా సాగతీసినట్టు ఉంటుందే తప్ప... ప్రేక్షకులు కథలో ఇన్ వాల్వ్ అవ్వలేరు. ఈ సినిమాకి ఇదే మైనస్ పాయింట్. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేస్తే, కనీసం సినిమా పాస్ట్ గా పూర్తయిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా సత్యరాజ్ గెటప్స్ ఆసక్తిని పెంచాయి. అయితే ఈ అంచనాలకు తగ్గట్టు సినిమా లేకపోవడం కూడా మైనస్ అవుతుంది.


ఫైనల్ గా చెప్పాలంటే... బ్రిటిష్, ఇండియన్ ఆత్మలు భయపెట్టలేదు సరికదా.. కనీసం నవ్వించలేకపోయాయి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !