View

'ఏకమ్' మూవీ రివ్య్వూ

Saturday,October30th,2021, 08:50 AM

చిత్రం - ఏకమ్
నటీనటులు - అభిరామ్ వర్మ, తనికెళ్ల భరణి, అదితి మైకేల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి, శ్వేతా వర్మ తదితరులు
బ్యానర్స్ - ఆనంద థాట్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ, సంస్క్తృతి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం - జోన్ ఫ్రాంక్లిన్
సమర్పణ - బోయపాటి రఘు
కథ, దర్శకత్వం - వరుణ్ వంశీ


అభిరామ్ వర్మ, తనికెళ్ల భరణి, అదితి మైకేల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి, శ్వేతా వర్మ  ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఏకమ్'. బోయపాటి రఘు సమర్పణలో ఆనంద థాట్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ, సంస్క్తృతి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం (29.10.2021) థియేటర్స్ కి వచ్చింది. ఈ సినిమా ట్రైలర్స్, పాటలు ఆడియన్స్ ని విపరీతంగా అలరించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా ఉందా, ఆడియన్స్ ని ఈ సినిమా మెప్పించగలిగిందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.


కథ
ఆనంద్ (అభిరామ్ వర్మ), తనికెళ్ల భరణి (అప్పయ్య పంతులు), అదితి మైకేల్ (దివ్య), కల్పిక గణేష్ (నిత్య), దయానంద్ రెడ్డి (డేవిడ్), శ్వేతా వర్మ (నిర్వాణ) ఈ పాత్రల చుట్టూ అల్లుకున్న కథ 'ఏకమ్'. చిన్న వయసులోనే కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు ఆనంద్. ప్రేమించిన అమ్మాయి కూడా దూరమవ్వడంతో, తను చేస్తున్న ఉద్యోగానికి కూడా స్వస్తి పలికి, ఏదో అన్వేషిస్తూ తిరుగుతుంటాడు ఆనంద్. నిత్యం దేవుడును పూజించే తనకు ఎలాంటి పని లేకుండా చేసాడని, ఆ శివయ్య మీద కోపం పెంచుకుని, అదే శివయ్యను స్మశానంలోకి తీసుకునిపోయి అక్కడే తను కూడా నివసించడం మొదలుపెడతాడు అప్పయ్య పంతులు. తండ్రిని కోల్పోయిన దివ్య కాఫీ షాప్ పెట్టి కెరీర్ లో ఎదగాలనే టార్గెట్ తో ఉంటుంది. ఆ కాఫీ షాప్ లో తనకు ఉండటానికి, తినడానికి లేదని చెప్పి చేరతాడు విలన్ డేవిడ్. ఆ కాఫీ షాప్ లోనే పని చేస్తాడు. ఆనంద్ లో మార్పు తీసుకువచ్చి పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఉంటుంది నిత్య. ఇక తను ప్రేమించిన అబ్బాయికి అనుకోకుండా జరిగిన సంఘటన వలన దూరమవుతుంది నిర్వాణ. సరిగ్గా ఇలాంటి సమయంలో అనంద్, నిర్వాణ కలుసుకుంటారు. అలాగే స్మశానంలో ఉన్న అప్పయ్య పంతులను కూడా ఆనంద్ కలుసుకుంటాడు. అసలు ఎందుకు నిర్వాణ, అనంద్, అప్పయ్య పంతులు కలుసుకుంటారు. విలన్ అయిన డేవిడ్ ఎందుకు నిత్య కాఫీ షాప్ లో పనికి చేరతాడు. చివరికి నిత్య, ఆనంద్ కలుసుకుంటారా అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా సాగుతుంది. 


విశ్లేషణ
ముందుగా ఈ సినిమాకి ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చింది. దీన్నిబట్టి కంటెంట్ పరంగా సినిమాకి ఎంత వ్యాల్యూ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో నటించిన అభిరామ్ వర్మ, తనికెళ్ల భరణి, శ్వేతా వర్మ, దయానంద్ రెడ్డి, అదితి మైకేల్ వారు చేసిన పాత్రల్లో ఒదిగిపోయిన వైనాన్ని అభినందిచాల్సిందే. ప్రతి ఒక్కరూ తమ క్యారెక్టర్ లో లీనమై నటించారు. కల్పిక గణేష్ పాత్ర నిడివి తక్కువైనప్పటికీ, తన ప్రెజెన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి స్పెషల్ మెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సెకండాఫ్ లో 'శివుడు' పై సాగే పాట ఆడియన్స్ ని మెప్పిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఉండటం ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్. డైలాగ్స్ బాగున్నాయి. ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ప్రతి మాటకి ఓ అర్ధం ఉంటుంది. డైలాగ్స్ లో ఉన్న డెప్త్ ఆడియన్స్ ని ఆలోచింజేస్తుంది. డైరెక్టర్ వరుణ్ వంశీ తను రాసుకున్న కథను చాలా చక్కగా తెరపై ఆవిష్కరించారు. ప్రతి క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం సూపర్బ్. తడబడకుండా, తను చెప్పాలనుకున్న పాయింట్ ను ఆసక్తికరమైన మలుపులతో ఇంట్రస్టింగ్ గా చెప్పగలిగారు డైరెక్టర్. జీవిత అన్వేషణలో సాగే ప్రతి ఒక్కరికి మా చిత్రం అంకితం అని చెప్పిన విధానం బాగుంది. ఇక నిర్మాతల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కథకు సరిపడా బడ్జెట్ సమకూర్చి, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. అది వారికి కథ మీద ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. 


ఫైనల్ గా చెప్పాలంటే... ఈ సినిమాకి కథ, క్యారెక్టర్స్, సంగీతం, స్ర్కీన్ ప్లే, డైరెక్షన్ ప్లస్ పాయింట్స్. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. సో... డోంట్ మిస్ ది మూవీ. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. 


ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !