View

కిక్ 2 మూవీ రివ్య్వూ

Friday,August21st,2015, 09:11 AM

చిత్రం - కిక్ 2
బ్యానర్ - యన్.టి.ఆర్ ఆర్ట్స్
నటీనటులు - రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్ధి, రవికిషన్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, కబీర్ దూహన్, ఫృథ్వీ తదితరులు
కథ, మాటలు - వక్కంతం వంశీ
సంగీతం - యస్.యస్.తమన్
సినిమాటోగ్రఫీ - మనోజ్ పరమహంస
ఎడిటింగ్ - గౌతంరాజు
నిర్మాత - నందమూరి కళ్యాణ్ రామ్
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - సురేందర్ రెడ్డి

 

ఐదేళ్ల క్రితం 'కిక్' అంటూ సూపర్ హిట్ ఇచ్చారు రవితేజ, సురేందర్ రెడ్డి. రవితేజ అభిమానులకు ఓ రేంజ్ లో కిక్ ఇచ్చిన చిత్రం అది. మళ్లీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా సినిమా చేస్తే? ఆల్రెడీ హిట్ కాంబినేషన్ కాబట్టి, భారీ అంచనాలు ఉంటాయి. ఆ విధంగా ఈ కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం 'కిక్ 2' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'కిక్'లో హీరో, హీరోయిన్ల కొడుకు కథ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు తెరకొచ్చింది. హీరోగా రవితేజకు, దర్శకుడిగా సురేందర్ రెడ్డికి, నిర్మాతగా కల్యాణ్ రామ్ కి ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని మిగుల్చుతుంది. మొదటి 'కిక్'లా ఈ 'కిక్ 2' సూపర్ హిట్ అవుతుందా?... తెలుసుకుందాం...

 

à°•à°¥
కిక్ (రవితేజ) తనయుడు రాబిన్ హుడ్ (రవితేజ). కంఫర్ట్ గా ఉండటమే అతని ప్రధాన ధ్యేయం. తల్లి కడుపులో ఉండటం కంఫర్ట్ గా లేదని 7నెలలకే బయటికి వచ్చేసిన రకం రాబిన్ హుడ్. చిన్నప్పట్నుంచి కంఫర్ట్ గా ఉండటానికి ఎలా బ్రతకాలో అలవాటు చేసుకుంటాడు. తనకు తను కంఫర్ట్ గా ఉండాలంటే డాక్టర్ అవ్వడం కరెక్ట్ అనుకుని మెడిసిన్ చదువుతాడు. తన కోసం ఓ హాస్పటల్ కట్టుకోవడానికి హైదరాబాద్ లో ఉన్న తన తాత స్థలం ఇవ్వమని తండ్రి కిక్ ని అడుగుతాడు. ఆ స్థలం కబ్జాలో ఉందని చెప్పడంతో యు.యస్ నుంచి హైదరాబాద్ వచ్చేస్తాడు. తన స్థలం కబ్జా చేసిన సెటిల్ మెంట్ దుర్గ (ఆశిష్ విద్యార్ధి) ని కలుస్తాడు రాబిన్ హుడ్. తన స్థలం తనకు ఇచ్చేయమని అడుగుతాడు. కానీ రౌడీ అయిన దుర్గ ఇందుకు ఒప్పుకోడు. దాంతో చాలా కంఫర్ట్ గా అతనే తనకు స్థలం ఇచ్చేలా చేస్తానని చెప్పిన రాబిన్ హుడ్ తెలివితేటలను ఉపయోగించి అన్నంత పని చేస్తాడు. ఈ సమయంలో రోడ్డు మీద కంఫర్ట్ గా ఉన్న తనను యాక్సిడెంట్ చేసి కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్లిపోయిన బలరామ్ (మధు)ని వెతుక్కుంటూ వచ్చి చితక్కొట్టేస్తాడు రాబిన్ హుడ్. తనకు ఏదైనా డిస్ కంఫర్ట్ జరిగితే ఏంత దూరం వెళ్లడానికైనా రాబిన్ హుడ్ వెనుకాడడని అక్కడే ఉన్న చందు గ్రహించి ఓ స్కెచ్ వేస్తాడు.


రాబిన్ హుడ్ కి ఓ కాఫీ షాపులో పరిచయం అవుతుంది చైత్ర (రకుల్ ప్రీత్ సింగ్). అతనిని ప్రేమిస్తుంది. కానీ తనకు కంఫర్ట్ గా ఉంటేనే ప్రేమిస్తానని, లేకపోతే ఫీల్ అవ్వకూడదని చెప్పేస్తాడు రాబిన్. అయినా సరే అతని వెనకాలేపడుతుంది. హైదరాబాద్ లో తనకు దక్కాల్సిన స్థలం దక్కడంతో యు.యస్ వెళ్లడానికి సిద్ధపడతాడు రాబిన్. తనను ప్రేమించిన చైత్రను ఓ ఫ్రెండ్ గానే భావించి వదిలి వెళ్లిపోవాలనుకుంటాడు. ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన తర్వాత చైత్రను తను ప్రేమిస్తున్న విషయం గ్రహించి ఆమె కోసం తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు చైత్ర హైదరాబాద్ అమ్మాయి కాదని, ఆమె బీహార్ లోని విలాస్ పూర్ గ్రామానికి చెందిన అమ్మాయని తెలుసుకుంటాడు. ఆమె కోసం విలాస్ పూర్ బయలుదేరతాడు.


అసలు చైత్ర ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? రాబిన్ ని విలాస్ పూర్ ఎందుకు రప్పిస్తుంది... చందు వేసిన స్కెచ్ ఏంటీ? విలాస్ పూర్ లో ఉన్న పరిస్థితులు ఏంటీ అనేదే ఈ చిత్రం సెకండాఫ్.

 

నటీనటుల పర్ఫార్మెన్స్
తండ్రిగా సినిమా ఆరంభంలో కొన్ని నిమిషాలు, ఆ తర్వాత కొడుకుగా సినిమా మొత్తం కనిపిస్తాడు రవితేజ. సినిమా మొత్తం ఈ రాబిన్ హుడ్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రను బాగానే చేశాడు. కానీ, ఎందుకో రవితేజ గత చిత్రాల్లోని జోష్ తగ్గిందనిపిస్తోంది. మరి.. ఈ పాత్రకు ఈ మాత్రం ఉంటే చాలని దర్శకుడు అనుకున్నాడో ఏమో... రకుల్ ప్రీత్ సింగ్ చూడచక్కగా ఉంది. విజృంభించి నటించే స్కోప్ మాత్రం తనకు లేదు. విలన్ గా రవికిషన్ సూపర్. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. పండిట్ రవితేజ పాత్రను బ్రహ్మానందం బాగా చేశారు. కానీ, నవ్వు రాదు. తనికెళ్ల భరణి తనదైన శైలిలో నటించారు. 'జిల్' ద్వారా విలన్ గా పరిచయమైన కబీర్ ఈ చిత్రంలోనూ విలన్ గానే చేశాడు. కానీ, నటనకు స్కోప్ లేని పాత్ర ఇది. ఆశిష్ విద్యార్థి తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

 

సాంకేతిక వర్గం
'కిక్' చిత్రంలో హీరో కిక్ కోసం ఏమైనా చేస్తాడు. ఈ 'కిక్ 2'లో హీరో కంఫర్ట్ కోసం ఏమైనా చేస్తాడు. తన సౌకర్యమే ముఖ్యం అనుకునే దిశలో అతను పూర్తిగా స్వార్థపరుడు అని ఎదుటి వ్యక్తికి అనిపిస్తాడు. ఈ కథ యుఎస్ లో మొదలై, అట్నుంచి హైదరాబాద్, అట్నుంచి బీహార్ కి సాగుతుంది. ఈ సాగే జర్నీ మొత్తం ఇల్లాజికల్ గా ఉంటుంది. అందుకని, కథ పరంగానే తప్పు జరిగిపోయింది. ఇక, మిగతావి.. అంటే పాటలు, ఫైట్లు, డైలాగులు బాగుంటే ఏం ప్రయోజనం? కల్యాణ్ రామ్ బాగా ఖర్చు పెట్టి తీశారు. ఇంకా చెప్పాలంటే తను హీరోగా నటించిన చిత్రాలకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ
రవితేజ మార్క్ ఎనర్జీ అతను పోషించిన పాత్రలో కనిపించకపోవడం ఓ మైనస్. పైగా, బాగా సన్నబడటంవల్లనో ఏమో హ్యాండ్ సమ్ గా అనిపించలేదు. బానిస బతుకు బతుకున్న ఓ అమ్మాయి (హీరోయిన్) సిటీకి వచ్చి, రాబిన్ హుడ్ ని ప్రేమలో పడేసి, అతని కోసం బాగా డబ్బులు ఖర్చుపెట్టి, తన ఊరు తీసుకెళ్లడం అనే పాయింట్ మింగుడుపడదు. ఫస్టాఫ్ లైటర్ వేన్ గా సాగుతుంది. ఇక సెంకడాఫ్ లో మొదలయ్యే అసలు డ్రామా మొత్తం నాటకీయంగా ఉంటుంది. విలన్ చేతిలో నిస్సహాయులుగా మిగిలిపోయిన ఊరి ప్రజలు కంటతడిపెట్టే సన్నివేశాలు ప్రేక్షకులను ఏ మాత్రం కదిలించవు. లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, ఎమోషనల్ సీన్స్.. ఇలా ఏ రసాన్ని తీసుకున్నా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 'కిక్', 'రేసు గుర్రం' వంటి చిత్రాలు తీసిన సురేందర్ రెడ్డేనా ఈ చిత్రం చేసింది? అనే సందేహం కలగక మానదు. అలాగే, రవితేజ కథల ఎంపిక విషయం ఏమైనా జడ్జిమెంట్ కోల్పోయాడా? అనే అనుమానం రావడం కూడా సహజం. ఇక.. కల్యాణ్ రామ్ తనకు 'అతనొక్కడే'వంటి విజయవంతమైన చిత్రం ఇచ్చాడు కాబట్టి, సురేందర్ రెడ్డిని నమ్మి ఈ సినిమా తీసి ఉంటాడు.


ఫైనల్ గా చెప్పాలంటే... ఈ సినిమాలో హీరో కంఫర్ట్ చూసుకుంటాడు. ప్రేక్షకులు కూడా కంఫర్ట్ చూసుకోవాలిగా. ఈ సినిమా కిక్ ఇవ్వకపోగా... డిస్ కంఫర్ట్ గా కూడా ఉంటుంది. 'కిక్' మ్యాజిక్ ని 'కిక్ 2' రిపీట్ చేసే అవకాశమే లేదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !