View

మనమంతా మూవీ రివ్య్వూ

Friday,August05th,2016, 09:14 AM

చిత్రం - మనమంతా
బ్యానర్ - వారాహి చలన చిత్రం
నటీనటులు - మోహన్ లాల్, గౌతమి, విశ్వాంత్, రైనా రావ్, అనీషా అంబ్రోస్, నాజర్, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, పరుచూరి వెంకళటేశ్వరరావు, ఎల్.బి.శ్రీరాం, వెన్నెల కిషోర, బ్రహ్మాజీ, ధన్ రాజ్ , తారకరత్న తదితరులు
సినిమాటోగ్రఫీ - రాహుల్ శ్రీవాత్సవ్
డైలాగ్స్ - చంద్రశేఖర్ యేలేటి, రవిచంద్ర తేజ
సంగీతం - మహేష్ శంకర్
ఎడిటింగ్ - జి.వి.చంద్రశేఖర్
నిర్మాత - సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - చంద్రశేఖర్ యేలేటి

 

ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మనమంతా'. తెలుగుతో పాటు తమిళంలో నమ్మదు, మలయాళంలో విస్మయం అనే టైటిల్స్ తో ఈ రోజు (5.8.2016) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 22 ఏళ్ళ తర్వాత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధానపాత్రలో నటించిన చిత్రమిది. గౌతమి, ఊర్వశి, విశ్వాంత్, అనీషా ఆంబ్రోస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. వారాహి చలనచిత్ర బ్యానర్ కంటూ ఓ ఇమేజ్ ఉంది. ఈ బ్యానర్ లో సినిమా అంటే ఖచ్చితంగా ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ అయ్యుంటుందని, ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా అయ్యుంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. 'మనమంతా' కూడా అలాంటి సినిమానే అని పోస్టర్స్, థియేట్రికల్ ట్రైలర్ చూసి ఫిక్స్ అయపోయారు. మరి వారాహి నుంచి వచ్చిన ఈ 'మనమంతా' ఎలా ఉందో చూద్దాం.


కథ
విజేత సూపర్ మార్కెట్ లో స్టోర్ అసిస్టెంట్ సాయిరాం (మోహన్ లాల్). అదే మార్కెట్ లో సేల్స్ అసిస్టెంట్ విశ్వనాధ్ (హర్షవర్ధన్). ఆ మార్కెట్ మేనేజర్ పరుచూరి వెంకటేశ్వరరావు రిటైర్ మెంట్ అయిపోతున్న తరుణంలో మేనేజర్ పోస్ట్ కి సాయిరాం ప్రమోట్ అవుతాడా... విశ్వనాధ్ ప్రమోట్ అవుతాడా అనే టెన్షన్ సూపర్ మార్కెట్ లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎలాగైనా తనే మేనేజర్ గా ప్రమోషన్ కొట్టేయాలనే తపన సాయిరాంకి ఉంటుంది. తనే ప్రమోషన్ కొట్టేస్తాననే ధీమాలో విశ్వనాధ్ ఉంటాడు. ఎలాగైనా ప్రమోషన్ తనే కొట్టేయాలనే తాపత్రయంతో ఉన్న సాయిరాం మేనేజర్ ని సెలెక్ట్ చేసే రోజున విశ్వనాధ్ ని ఆఫీసుకు మూడు, నాలుగు గంటలు రానివ్వకుండా ఉండటానికి దాసు అనే రౌడీ సహాయం తీసుకుంటాడు. ఆ దాసు విశ్వనాధ్ ని కిడ్నాప్ చేసి తనకు లక్షన్నర కావాలని సాయిరాం దగ్గర డిమాండ్ చేస్తాడు.


మిడిల్ క్లాస్ మహిళ గాయ్రతి (గౌతమి). తన కుటుంబం కోసం తాపత్రయపడే గాయత్రి స్కూల్, కాలేజ్ డేస్ లో ఫస్ట్ ర్యాంక్ హోల్టర్. ఎప్పుడు చిరునవ్వుతో ఉండే గాయత్రి అంటే ప్రొపెసర్ మారుతీరావు (గొల్లపూడిమారుతీరావు) కి చాలా ఇష్టం. మిడిల్ క్లాస్ జీవితంతో తన ఇష్టాలను పక్కన పెట్టేసి తన గురించి కాకుండా తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచించే గాయత్రిని చూసిన ప్రొపెసర్ ఆమె టాలెంట్ ని గుర్తు చేసి సింగపూర్ లో మంచి జాబ్ ఉంది.. కెరియర్ గురించి ఆలోచించి ఆ జాబ్ చేయమని సలహా ఇస్తాడు. తన కుటుంబాన్ని వదిలేసి సింగపూర్ వెళ్లాలా లేదా ఆనే ఆలోచనలో పడిపోతుంది గాయత్రి.


అభి కాలేజ్ స్టూడెంట్. చదువే అతని ప్రధాన ధ్యేయం. తన తోటి విద్యార్ధులకు ఫీజు తీసుకోకుండా ట్యూషన్ చెప్పేంత మంచి కుర్రాడు. ఓ అమ్మాయి (అనీషా ఆంబ్రోస్) ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి మాత్రం అభిని ఫ్రెండ్ లానే అనుకుంటుంది. ప్రేమలో పడిన అభి ఎప్పుడూ ఆమె గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ అమ్మాయికి యు.యస్ విసా రావడంతో వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. ఆ సమయంలో అభి తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఆ అమ్మాయి అభి ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దాంతో చనిపోవడానికి సిద్ధమవుతాడు అభి.


మహిత ఓ స్కూల్ స్టూడెంట్. స్కూల్ వెళుతున్న సమయంలో కనిపించిన చిన్నపిల్లాడు వీరశంకర్ తో మహితకు అటాచ్ మెంట్ పెరుగుతుంది. వీరశంకర్ ఒకరోజు కనిపించకుండా పోతాడు. ఆ పిల్లవాడిని వెతకటానికి మహిత చాలా ధైర్యం చేస్తుంది. చిన్న పిల్ల అయినా మినిష్టర్ కొడుకు, పోలీసులను సైతం కదిలిస్తుంది.


ఈ నలుగురుకి ఉన్న లింకేంటి... ఈ నలుగురు సమస్యలు ఏ విధంగా తీరతాయి అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పర్ పామెన్స్
సాయిరాం పాత్రలో మోహన్ లాల్ అద్భుతంగా నటించారు. ఓ మిడిల్ క్లాస్ తండ్రి, భర్త పాత్రలో ఆయన ఒదిగిపోయిన వైనం సూపర్. తెలుగు నేర్చుకుని మరీ మోహన్ లాల్ డబ్బింగ్ చెప్పారు. ఆ పట్టుదలకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. గాయత్రి పాత్రను గౌతమి హ్యాండిల్ చేసిన విధానం సూపర్. గౌతమి పాత్ర ప్రతి మహిళకు తనని తాను గుర్తు చేసుకునే విధంగా ఉంటుంది. డబ్బింగ్ కూడా అద్భుతంగా చెప్పింది గౌతమి. ఊర్వశి ని స్ర్కీన్ పై చూస్తుంటే మన పక్కంటి ఆవిడినో, అక్కనో, వదిననో చూస్తున్నట్టు ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర అలానే ఉంటుంది. ఊర్వశి ఈ పాత్రలో జీవించింది. చంద్రమోహన్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి మారుతీరావు, ధనరాజ్, వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. హర్షవర్ధన్, అనితా చౌదరి తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ఈ చిత్రంలో నటించిన బాల నటీనుటులు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మహిత, వీరశంకర్ పాత్రలు చేసిన పిల్లలు అద్భుతంగా నటించారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఏ సినిమా చేసినా, పాయింట్ సింఫుల్ గా ఉంటుంది. కానీ ఆ సింఫుల్ పాయింట్ కి అల్లే స్ర్కీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. ఆ కథలోని పాత్రలకున్న రిలేషన్ షిప్ ని, ఎమోషన్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయడంలో ఆయన దిట్ట. ఈ సినిమాలో కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేసారు. మహేష్ శంకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్, సీన్ లోని ఎమోషన్ ని ఎలివేట్ అయ్యేలా రీ-రికార్డింగ్ కుదరడం ఈ సినిమాకి హైలైట్. ఈ సినిమాకి పాటలు అడ్డంకిగా అనిపిస్తాయి. అది ఫీలయ్యే డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి సిట్యువేషనల్ సాంగ్స్ కి ప్రిపరెన్స్ ఇచ్చి ఉంటారు. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే పాట బాగుంటుంది. ఎడిటింగ్ బాగుంది. ఇక నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కమర్షియల్ సినిమాలు తీయడానికి ఏ నిర్మాత అయినా రెడీగానే ఉంటాడు. కానీ ఓ మంచి స్టోరీ లైన్ ని నమ్మి సినిమా నిర్మించాలంటే మాత్రం నిర్మాతకి దమ్ముండాలి. పైగా ఆ సినిమాని సొంతంగా రిలీజ్ చేయడమంటే మామూలు విషయం కాదు. వారాహి చలనచిత్ర అధినేత సాయి కొర్రపాటిది టేస్ట్ ఫుల్ నిర్మాతల జాబితాలో ముందు వరసలో ఉండే పేరు. 'మనమంతా' స్టోరీ లైన్ ఆయనకు బాగా కనెక్ట్ అవ్వడం, తనకు కనెక్ట్ అయినట్టుగానే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనే నమ్మకం కుదరడంతో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించారు. మోహన్ లాల్ తో సినిమా నిర్మించడానికి కూడా వెనుకాడలేదు. ఆయన నమ్మకం వమ్మవ్వలేదు. ఈ స్టోరీ లైన్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఆ బ్యానర్ ఇమేజ్ ని మరింత పెంచుతుంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
డబ్బు అవసరం ఎంత మంచి మనిషి చేత అయినా తప్పు చేయిస్తుంది. ఆ తప్పు చేసిన మనిషికి మనశ్శాంతి ఉండదు. జీవితంలో ఎన్ని కష్టాలున్నా, సమస్యలున్నా బ్రతికేయవచ్చుగానీ, తప్పు చేసిన మనిషి బ్రతకడం చాలా కష్టం అనే పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి. ఈ పాయింట్ కనెక్ట్ అవ్వడానికి ఆయన అల్లిన సీన్స్ చాలా బాగున్నాయి. ఓ చిన్నపిల్లకు తప్పుగా జోస్యం చెప్పి, ఆ పిల్ల అమాయకంగా నమ్మడంతో, తను చేసిన తప్పు తెలుసుకుని ఆ జోస్యం చెప్పే వ్యక్తి ఫీలవ్వడంలాంటి సీన్లు తప్పు చేస్తే మనశ్శాంతి ఉండదని బలంగా ఆడియన్స్ మనసుల్లోకి చొచ్చుకుపోయేలా చేస్తుంది. సాయిరాం, గాయత్రి పాత్రలను డైరెక్టర్ మలిచిన విధానం సూపర్. ఓ రౌడీ అయినా, ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా పరిస్థితులు కారణంగానే తమ ఉనికిని కోల్పోయే స్థాయికి దిగజారతారని, కానీ చేసే ఒక్క తప్పు భరించరాని క్షోభకు గురి చేస్తుందని సాయిరాం, దాసు, గాయత్రి పాత్రల ద్వారా చాలా చక్కటి సీన్స్ తో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయగలిగారు. ప్రీ క్లయిమ్యాక్స్, క్లయిమ్యాక్స్ కి కన్నీళ్లు పెట్టని ప్రేక్షకుడు ఉండడు. కుర్రాళ్లకైతే తమ తల్లిదండ్రులను, భర్తలకు తమ కుటుంబం, భార్యకు తన భర్త, పిల్లలను గుర్తుకు తేవడం ఖాయం. ఇలాంటి మంచి సినిమాలు రావడం సమాజానికి చాలా అవసరం. మరుగునపడిపోతున్న మనుషుల్లోని మంచితనాన్నితట్టిలేపడం ఖాయం.


ఫైనల్ గా చెప్పాలంటే... ఈ 'మనమంతా' సినిమా తమ కుటుంబంతోనే కాకుండా, పక్కవాళ్లు, బంధువులు అందరితో కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా. డోంట్ మిస్ ఇట్.. ఈ సినిమాని మిస్ అయితే ఓ మంచి సినిమాని మిస్ అయినట్టే. Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !