చిత్రం - నా లవ్ స్టోరీ
నటీనటులు - మహిధర్, సోనాక్షిసింగ్, శివన్నారాయణ, తోటపల్లి మధు తదితరులు
మాటలు - మాల్కారి శ్రీనివాస్
సంగీతం - వేదనివాస్
ఎడిటింగ్ - నందమూరి హరి
సినిమాటోగ్రఫీ - కిరణ్
నిర్మాతలు - లక్ష్మి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - శివ గంగాధర్
యూత్ ఫుల్ లవ్ స్టోరీలకు ఆడియన్స్ నుంచి చక్కటి ఆదరణ ఉంటుంది. ఇక ఈ లవ్ స్టోరీలకు సెంటిమెంట్, కామెడీ లాంటి అదనపు హంగులు కుదిరితే బొమ్మ హిట్టే. ఈ తరహా లవ్ స్టోరీ 'నా లవ్ స్టోరీ'. శివగంగాధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 29న థియేటర్స్ కి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది... ఆడియన్స్ ఎంటర్ టైన్ చేయగల సత్తా ఉన్న సినిమానేనా తెలుసుకుందాం.
కథ
ప్రశాంత్ (మహీధర్) లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడిపేస్తుంటాడు. ఈ కుర్రాడికి నందిని (సోనాక్షి) అనే అమ్మాయి తారసపడుతుంది. ఆ అమ్మాయిపై మనసు పారేసుకుంటాడు ప్రశాంత్. ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఇద్దరి మధ్య మనస్ఫర్ధలు నెలకొనడంతో విడిపోతారు. తర్వాత కలుసుకున్నప్పటికీ, ఇద్దరి తండ్రులు వీరు ప్రేమను వ్యతిరేకిస్తారు. దాంతో ఇద్దరూ ఓ నిర్ణయం తీసుకుంటారు. నందిని. ప్రశాంత్ తీసుకున్న నిర్ణయం వల్ల వీరి తండ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు.. వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
మహీధర్ హీరోగా పరిచయం అయిన సినిమా ఇది. అయినప్పటికీ చాలా ఈజ్ గా నటించి తన నటనతో ఆడియన్స్ ని మెప్పించగలిగాడు, ప్రశాంత్ పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. కొన్ని యాంగిల్స్ లో ప్రభాస్ ని గుర్తుకు తెస్తాడు. హీరోయిన్ సోనాక్షి కూడా క్లయిమ్యాక్స్ ఎపిసోడ్ లో బాగా నటించి వావ్ అనిపించుకుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకి హైలైట్. రొమాంటిక్ సాంగ్ లో చక్కటి ఎక్స్ ప్రెషన్స్ తో అలరించారు. హీరో తండ్రి, హీరోయిన్ తండ్రి పాత్రలు చేసిన శ్రీమన్నారాయణ, తోటపల్లి మధు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. ఆడియన్స్ ని నవ్వించారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం...
సంగీత దర్శకుడు వేదనివాస్ ట్యూన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ ట్యూన్స్ కి సరిపడా సాహిత్యం అందించారు లిరిక్ రైటర్స్ భువనచంద్ర, శివశక్తి దత్తా. రీరికార్డింగ్ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. ఫోటోగ్రఫీ సూపర్బ్. డైలాగ్స్, ఎడిటింగ్ కూడా చక్కగా కుదిరాయి. క్వాలిటీ పరంగా నిర్మాతలు కాంప్రమైజ్ అవ్వలేదు. చక్కటి స్ర్కీన్ ప్లేతో డైరెక్టర్ ఈ లవ్ స్టోరీని అన్ని వర్గాల ఆడియన్స్ ని అకట్టుకునేలా తెరకెక్కించగలిగారు.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ కథ. చక్కటి స్టోరీ లైన్ కి స్ర్కీన్ ప్లే తో పాటు సెంటిమెంట్స్, ఎమోషన్స్, కామెడీ యాంగిల్స్ ని ఆవిష్కరించిన విధానం బాగుంది. సినిమా బోర్ కొట్టకుండా హాయిగా సాగిపోతుంది. హీరో, హీరోయిన్ తీసుకున్న నిర్ణయం వల్ల పేరేంట్స్ లో మార్పు రావడం అనే పాయింట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యూత్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమాని ఎంజాయ్ చెయ్యొచ్చు.
ఫైనల్ గా చెప్పాలంటే...
మంచి కథ, స్ర్కీన్ ప్లేతో తెరకెక్కిన సినిమా. లవ్, కామెడీ, సెంటిమెంట్ లాంటి అన్ని యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి, అందరూ సినిమాని చూడొచ్చు. సో.. డోంట్ మిస్ ఇట్.. ఈ వీకెండ్ ని ఈ సినిమాతో ఎంజాయ్ చెయ్యొచ్చు.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5