చిత్రం - ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ
నటీనటులు - కీర్తి చావ్లా, సాధికా, ఆధీ ప్రేమ్, కవిత, శ్రీమాన్, గౌతంరాజు, నిళల్ గల్ రవి తదితరులు
బ్యానర్ - చిన్నా ప్రొడక్షన్స్
ఎడిటింగ్ - మేనగ శ్రీను
నిర్మాతలు - ఏబి.శ్రీనివాస్, ఆర్.సుందర్, శ్రీధర్ పోతూరి, శాకముద్ర శ్రీధర్
డైరెక్టర్ - జి.సురేందర్ రెడ్డి
కీర్తి చావ్లా లీడ్ రోల్ లో సాధికా, ఆధీ ప్రేమ్, కవిత, రవళి, శ్రీమాన్ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ' ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ'. జి.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏ బి.శ్రీనివాస్, ఆర్.సుందర్, శ్రీధర్ పోతూరి, శాకముద్ర శ్రీధర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. లేడీ ఓరియంటెడ్ చిత్రం కావడం, హారర్ జానర్ లో గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన చిత్రం కావడంతో, ఈ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు ఉన్నాయి. ఈ రోజు (30.4.2021) ఈ సినిమా విడుదలయ్యింది. కరోనా ప్యాండమిక్ సిచ్చువేషన్ లో కూడా వెనకడుగు వేయకుండా నిర్మాతలు ఈ సినిమాని థియేటర్స్ కి తీసుకువచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
రామచంద్ర, కవిత లకు ఒక్కగానొక్క కొడుకు ఆనంద్ (శ్రీమాన్). ఇతనికి కీర్తి చావ్లాతో పెళ్లి జరుగుతుంది. తన తండ్రి చేసిన 2 లక్షల అప్పును తీర్చడానికి సిటీలో ఉద్యోగం చేయడానికి వస్తాడు ఆనంద్. కార్ల కంపెనీ ఓనర్ (సాధిక) దగ్గర వర్క్ చేస్తున్న మేనేజర్ 5 లక్షల బ్యాగ్ ని పోగొట్టుకుంటాడు. ఆ బ్యాగ్ ఆనంద్ కి దొరుకుతుంది. ఆ బ్యాగ్ ని మేనేజర్ కి అందజేస్తాడు ఆనంద్. ఆ ఇన్సిడెంట్ ని సాధిక చూస్తుంది. ఆనంద్ సిన్సియార్టీ నచ్చడంతో అతనికి జాబ్ ఆఫర్ చేస్తుంది. 2 లక్షలు డి.డి కూడా ఇస్తుంది. భర్తకు ఉద్యోగం రావడంతో కీర్తి చావ్లా సిటీకి వస్తుంది. తన భర్త సాధికతో క్లోజ్ గా ఉండటం గమనించిన కీర్తి చావ్లా, ఆమెను అవమానించి తన ఇంటి నుండి గెంటేస్తుంది. తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సాధిక... కీర్తి చావ్లా నుంచి ఆనంద్ ని విడగొట్టాలని డిసైడ్ అవుతుంది. ఆనంద్ ని ఎలాగైనా దక్కించుకోవాలని ఫిక్స్ అయిపోతుంది. సాధిక ఇంట్లో పనిచేసే వ్యక్తి చనిపోతాడు. అతనిని ఆనంద్ చంపినట్లు ఫోటోస్ ద్వారా క్రియేట్ చేస్తుంది సాధిక. ఆ ఫోటోస్ తో బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఓ రాత్ర సాధిక కూడా హత్యకు గురవుతుంది. ఆనంద్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. సాధికను హత్య చేసింది ఎవరు? సాధిక ఇంట్లో పని చేసే వ్యక్తిని చంపిందెవరు? ఆనంద్ పై మోపబడిన ఈ నేరాల నుంచి నిర్ధోషిగా బయటపడతాడా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
రోల్ చేసిన కీర్తి చావ్లా తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. శ్రీమాన్, సాధిక చాలా బాగా నటించారు. రవళి, గౌతంరాజు, నిళల్ గల్ రవి తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం
సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీత దర్శకుడు అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని ఎలివేషన్స్ ఎపిసోడ్స్ లో రీరికార్డింగ్ సూపర్ గా ఉంది. ఎడిటర్ మేనగ శ్రీను షార్ట్ అండ్ స్వీట్ గా కట్ చేసాడు. నిర్మాతలు ఏబి.శ్రీనివాస్, ఆర్.సుందర్, శ్రీధర్ పోతూరి, శాకముద్ర శ్రీధర్ లు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గా నిర్మించారు. దర్శకుడు జి సురేందర్ రెడ్డి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి వరకు మేకింగ్ లో తన ప్రత్యేకత చూపించారు. హారర్ మూవీకి స్ర్కీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. ఆ పరంగా డైరెక్టర్ కి ప్లస్ మార్కులు పడతాయి.
విశ్లేషణ
యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. ఫస్ట్ సీన్ నుంచి కథ మీదున్న పట్టును, క్రియేటివ్ స్క్రీన్ ప్రెజెన్స్ ను చూపిస్తూ కథను గందరగోళం లేకుండా పర్ఫెక్ట్ గా క్లైమాక్స్ వరకు లీడ్ చేశారు డైరెక్టర్ జి.సురేందర్ రెడ్డి. ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ లోని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. సినిమా ఎక్కడా బోర్ అనిపించదు. రెండు గంటల పాటు హ్యాపీగా సినిమాని చూడొచ్చు.
ఫైనల్ గా చెప్పాలంటే... క్రైమ్ సినిమాలను ఇష్టపడేవారు 'ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ' ని అస్సలు మిస్ అవ్వద్దు.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5