View

రాజుగారి గది మూవీ రివ్య్వూ

Wednesday,October21st,2015, 07:44 PM

చిత్రం - రాజుగారి గది
బ్యానర్ - ఓఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లి
సమర్పణ - సాయి కొర్రపాటి, అనిల్ సుంకర
నటీనటులు - అశ్విన్, ధన్య బాలకృష్ణన్, చేతన్, ఈశాన్య, పూర్ణ, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, రాజీవ్ కనకాల, పవిత్రా లోకేష్, షకలక శంకర్, ధనరాజ్, సప్తగిరి, ప్రభాస్ శ్రీను, విద్యులేఖ రామన్ తదితరులు
మాటలు - సాయిమాధవ్ బుర్రా
ఎడిటింగ్ - నాగరాజ్
సంగీతం - సాయికార్తీక్
కెమెరా - ఎస్.జ్ఞానమ్
లైన్ ప్రొడ్యూసర్స్ - ఆర్.దివాకరన్, ప్రవీణ.ఎస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కళ్యాణ్ చక్రవర్తి
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - ఓంకార్


థ్రిల్లర్ మూవీస్ కు సీజన్ తో పని లేదు. ఎప్పుడు విడుదల చేసినా ప్రేక్షకాదరణ పొందుతాయి. కాకపోతే నచ్చేలా కథ, కథనం ఉండాలి. ఆద్యంతం ఆసక్తికరంగా అనిపించే సన్నివేశాలు ఉండాలి. అలా అసక్తి రేకెత్తించే కథ, కథనాలు, సన్నివేశాలతోనే 'రాజుగారి గది' తీశానని దర్శకుడు ఓంకార్ పేర్కొన్నాడు. ఈ చిత్రం గురించి తెలిసి, సాయి కొర్రపాటి, అనిల్ సుంకర విడుదల హక్కులు కొన్నారు. ఇద్దరు పెద్ద నిర్మాతలు, అది కూడా మంచి అభిరుచి ఉన్నవాళ్లు కొనడంవల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన తమ్ముడు అశ్విన్ ని హీరోగా నిలబెట్టాలనే తపనతో ఓంకార్ తీసిన చిత్రం ఇది. మరి.. ఈ చిత్రం అశ్విన్ కి ఎలాంటి బ్రేక్ ఇస్తుంది? 'జీనియస్'తో తనలో మంచి టెక్నీషియన్ ఉన్న విషయాన్ని నిరూపించుకున్న ఓంకార్ ని దర్శకుడిగా ఈ చిత్రం మరో మెట్టు ఎక్కించే విధంగా ఉంటుందా... రండి 'రాజు గది'కి వెళ్లి తెలుసుకుందాం...


à°•à°¥
నందిగామలో ఉన్న రాజమహల్ లో దెయ్యం ఉందని స్థానికులు గట్టిగా నమ్ముతుంటారు. దాంతో ఆ రాజమహల్ లోపలికి ఎవ్వరూ వెళ్లడానికి సాహసించరు. ఆ మహల్ లోపలికి వెళ్లిన 31మంది అక్కడే చనిపోతారు. రాజమహల్ పై ఓ షార్ట్ ఫిలిం తీసి యుట్యూబ్ లో పెట్టి ఒక్క గంటలోనే లక్షల లైక్ లు సాధించవచ్చనే ధ్యేయంతో ఓ అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు రాజమహల్ లో అడుగుపెడతారు. ఆ ముగ్గురూ కూడా చనిపోతారు. దాంతో ఆ రాజమహల్ లో దెయ్యం ఉందని బలంగా అందరూ నమ్ముతుంటారు. పోలీసులు అక్కడి చనిపోయిన వారి గురించి ఇన్వెస్ట్ గేట్ చేస్తుంటారు.


'మా' టివి చానెల్ 7 రోజులు ఆ రాజమహల్ లో ఉండి బయటికి వచ్చిన వారికి 3కోట్లు ప్రైజ్ మనీ ఇస్తామనే కాన్సెఫ్ట్ తో ఓ రియాల్టీ షో ప్లాన్ చేస్తుంది. ఈ రియాల్టీ షో పార్టిసిపెంట్స్ కోసం జరిగిన ఆడిషన్స్ లో అశ్విన్ (అశ్విన్), చేతన్ (నందు), బాల (ధన్య బాలకృష్ణన్), బార్బీ (ఈశాన్య), శివుడు (ధనరాజ్), మైదానం (షకలకశంకర్) బుజ్జిమా (విద్యులేఖరామన్) సెలెక్ట్ అవుతారు. ఈ ఏడుగురు రాజమహల్ కి వెళతారు.


రాజమహల్ లో దెయ్యంలేదని డా.నందు, ఏదో శక్తి ఉందని అశ్విన్ నమ్ముతారు. ఆ రాజమహల్ లోని రాజుగారి గది తెరిచేటప్పటికి అక్కడ బొమ్మాళి (పూర్ణ) ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ముందున్న బాక్స్ తెరిస్తే అందులో ఉన్న పుస్తకం ద్వారా బొమ్మాళీ ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోలేక ఆ రాజమహల్ లో ఉరి వేసుకుని చనిపోయిందని, ఆమె ఆత్మ ఆ రాజమహల్ లో ఉందని బొమ్మాళీ తండ్రి పోసాని చనిపోయిన తర్వాత ఆత్మకథ రాసినట్టు ఉంటుంది. దాంతో ఆ రాజమహల్ లో బొమ్మాళీ దెయ్యం అయ్యి తిరుగుతుందనుకుంటారు. అశ్విన్ మాత్రం అక్కడ ఏదో జరుగుతుందని నమ్ముతాడు. రాజమహల్ ని పరిశీలిస్తున్న క్రమంలో బాలకు తన అన్నయ్య డా.కార్తీక్ (రాజీవ్ కనకాల ఆ రాజమహల్ లోనే చనిపోయాడని చెబుతాడు అశ్విన్. ఎలా చనిపోయాడన్న రహసాన్ని ఛేదించడానికే రాజమహల్ కి వచ్చానని కూడా చెబుతాడు. దెయ్యంలేదని చెప్పిన డా.నందు దెయ్యం ఉందని చెబుతాడు.


మరి రాజమహల్ లో దెయ్యం ఉందా.. అశ్విన్ అన్నయ్య ఆ రాజమహల్ లో ఎలా చనిపోయాడు.. అశ్విన్ ఆ రాజమహల్ లో దాగి ఉన్న రహస్యాన్ని ఛేదించగలిగాడా అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
అశ్విన్ పాత్రకు అశ్విన్ వంద శాతం నప్పాడు. అన్నయ్య మరణం వెనక దాగి ఉన్న రహస్యాన్ని ఛేదించే కుర్రాడిగా సినిమా మొత్తం సీరియస్ మోడ్ లో ఉంటాడు అశ్విన్. ఆ సీరియస్ నెస్ ని చక్కగా మెయిన్ టైన్ చేశాడు. ముఖ్యంగా హంతకుణ్ణి పట్టుకున్నాక 'మనుషుల ప్రాణాలను జంతువులతో పోల్చుతావ్ రా.. మనుషులకు బంధాలు.. అనుబంధాలు ఉంటాయిరా..' అంటూ ఎమోషనల్ అయ్యే సీన్ ని బాగా చేశాడు. ధన్యా బాలకృష్ణ తెలంగాణ మాండలికం మాట్లాడే బాల త్రిపురసుందరి పాత్రలో భేష్ అనిపించుకుంది. నెగటివ్ షేడ్ ఉన్న పాత్రను చేతన్ చీను బాగా చేశాడు. పోసాని కృష్ణమురళి కనిపించేది కొన్ని నిముషాలైనా ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి ఆయన చేస్తేనే బాగుంటుంది. అలాగే, దెయ్యంగా, మామూలు అమ్మాయిగా పూర్ణ యాక్టింగ్ అదుర్స్. అమ్మ పాత్రలో పవిత్రా లోకేష్ గుర్తుండిపోతుంది. ధన్ రాజ్, షకలక శంకర్, సప్తగిరి కామెడీ సుపర్బ్. ఇంకా విద్యుల్లేకా రామన్,ఈషాన్య, జీవా, రాజీవ్ కనకాల, రఘుబాబు తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.


సాంకేతిక వర్గం
హార్రర్ చిత్రాలకు ఎలాంటి కథ అయితే ఆసక్తికరంగా ఉంటుందో ఓంకార్ అలాంటి కథతోనే ఈ సినిమా తీశాడు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు చాలా ఆసక్తికరంగా మలిచాడు. ఓంకార్ లో మంచి దర్శకుడు ఉన్న విషయాన్ని ఈ చిత్రం నిరూపించింది. ఈ చిత్రానికి మరో బలం బుర్రా సాయిమాధవ్ సంభాషణలు. 'కృష్ణం వందే జగద్గురుమ్', 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' వంటి చిత్రాల్లో ఆలోచింపజేసే సంభాషణలు అందించిన సాయి మాధవ్ అలాంటి చిత్రాలకే పనికొస్తారన్నది కొంతమంది అభిప్రాయం. కానీ, ఈ చిత్రంతో ఆ అభిప్రాయం పోతుంది. హారర్ కామెడీ జానర్ సినిమాకి తేలికైన పదాలతో చక్కని సంభాషణలు రాశారు. కామెడీ ట్రాక్ కి సంబంధించిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఈ చిత్రంలో రెండే పాటలుంటాయి. సందర్భానుసారం సాగే ఆ పాటలకు సాయి కార్తీక్ మంచి స్వరాలిచ్చాడు. ముఖ్యంగా తను చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అవుతుంది. ఎస్. జ్ఞానం కెమెరా పనితనం బాగుంది. ఓవరాల్ గా టెక్నికల్ టీమ్ భేష్ అనే చెప్పాలి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఎంచుకున్న కథలో బలం, ఆ కథను తెరకెక్కించడంలో దర్శకుడికి ఉన్న దమ్ము ఓ సినిమా సక్సెస్ కి కారణమవుతాయి. ఈ రెండు విషయాల పరంగా ఈ సినిమా పాస్ అయ్యింది. హారర్, కామెడీని చక్కగా బ్లెండ్ చేసి, భయపెట్టడంతో పాటు నవ్వించగలిగాడు ఓంకార్. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ సినిమా చూపించాడు. సో.. తీసినవాళ్లకీ, కొనుక్కున్నవాళ్లకీ సేఫ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. 'నా తమ్ముణ్ణి హీరోగా నిలబెట్టడానికి ఈ సినిమా తీశా' అని ఓంకార్ అన్నాడు. తమ్ముడికి నిజంగానే న్యాయం చేశాడు. కొంచెం డైలాగ్ డెలివరీపై అశ్విన్ దృష్టి పెడితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక, దర్శకుడిగా ఓంకార్ కి ఈ సినిమా ప్లస్. తల్లి, ఇద్దరి కొడుకుల సన్నివేశాలు చాలా బాగా తీశాడు. ఇంకా కామెడీ ట్రాక్స్, ఎమోషనల్ సీన్స్ అన్నీ బాగానే హ్యాండిల్ చేయగలిగాడు.


ఫైనల్ గా చెప్పాలంటే... ఎక్కడా బోర్ అనిపించదు. సో.. 'రాజుగారి గది'కి వెళ్లండి... భయపడుతూ, నవ్వుతూ.. సినిమా థియేటర్ నుంచి వచ్చేటప్పుడు తేలికైన మనసుతో రండి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !