View

రైట్ రైట్ మూవీ రివ్య్వూ

Friday,June10th,2016, 09:43 AM

చిత్రం - రైట్ రైట్
బ్యానర్ - శ్రీ సత్య ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - సుమంత్ అశ్విన్, పూజా జవేరి, పావని, నాజర్, 'బాహుబలి' ఫేం ప్రభాకర్, రాజా రవీంద్ర, భరత్ రెడ్డి, వినోద్, రాజ్యలక్ష్మీ, సుధ, కరుణ, జయవాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, షకలక శంకర్, జీవా తదితరులు
కథ - సుజీత్
సంగీతం - జె.బి
కెమెరా - శేఖర్.వి.జోసఫ్
మాటలు - డార్లింగ్ స్వామి
కో-ప్రొడ్యూసర్ - జె.శ్రీనివాసరాజు
నిర్మాత - జె.వంశీకృష్ణ
సమర్పణ - వత్సవాయి వెంకటేశ్వర్లు
దర్శకత్వం - మను


సినిమా సినిమాకీ తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకుంటూ, యూత్, ఫ్యామిలీస్ కి దగ్గయరయ్యాడు సుమంత్ అశ్విన్. లవర్స్, కేరింత, కొలంబస్... ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న ఈ యువహీరో ప్రస్తుతం నటించిన చిత్రం 'రైట్ రైట్'. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు (10.6.2016) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో ఘవిజయం సాధించిన 'ఆర్డనరీ' చిత్రానికి ఇది రీమేక్. మలయాళంలో మూడున్నర కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 16కోట్లు వసూలు చేసింది. మరి తెలుగులో కూడా ఈ సినిమా ఇదే రేంజ్ విజయాన్ని అందుకుంటుందా తెలుసుకుందాం.


కథ
పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కనే రవి (సుమంత్ అశ్విన్) బస్ కండక్టర్ అవుతాడు. యస్.కోటా నుండి గవిటికి వెళ్లే బస్సు రూటుకు కండక్టర్ గా రవి, డ్రైవర్ గా శేషు (బాహుబలి ఫేం ప్రభాకర్) జర్నీని ఎంజాయ్ చేస్తూ గవిటి గ్రామానికి చెందిన ప్రజలతో మంచి అనుబంధం పెంచుకుంటారు. ఆ గ్రామ సర్పంచ్ విశ్వనాధం (నాజర్) తో కూడా వీరికి చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. సర్పంచ్ కొడుకు దేవా సూరత్ లో ఉంటాడు. చిన్నప్పట్నుంచి పెంచుతున్న అమృతని తన కొడుకు దేవాకి ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు సర్పంచ్. అమ్మ, నాన్న చనిపోవడంతో అనాధ అయిన భద్ర అనే కుర్రాడిని కూడా సర్పంచ్ చేరదీసి చిన్నప్పట్నుంచి పెంచుతాడు. భద్ర ఊళ్లోని వాళ్లందరికీ చేదోడువాదోడుగా ఉంటాడు. అదే గ్రామానికి చెందిన కళ్యాణ్ ని ప్రేమిస్తాడు రవి. కట్ చేస్తే...


ఒక రోజు బస్సు రిపేర్ అవుతుంది. రిపేర్ చేయించిన తర్వాత తాగి ఉన్న శేషు బస్ డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదని భావించి రవి బస్సు డ్రైవ్ చేస్తాడు. ఆ సమయంలో దేవా బస్సుకు అడ్డంగా రావడంతో యాక్సిడెంట్ అవుతుంది. అటు వైపుగా వెళుతున్న జీప్ లో దేవాని హాస్పటల్లో చేర్పించమని చెప్పి రవి. శేషు గవిట గ్రామానికి చేరుకుంటారు. కొడుకు గ్రామానికి వస్తున్నాడని సర్పంచ్ ఆనందంగా ఎదురుచూస్తుంటారు. యాక్సిడెంట్ అయిన విషయాన్ని దాచేస్తారు రవి, శేషు. కట్ చేస్తే...


హాస్పటల్లో ఉండాల్సిన దేవా కొండ లోయల్లో శవమై తేలతాడు. దాంతో నిర్ఘాంతపోయిన రవి, శేషు తమవల్లే దేవా చనిపోయాడని మదనపడిపోతుంటారు. యాక్సిడెంట్ సమయంలో దొరికిన దేవా బ్యాగ్ లోని లెటర్స్ రవి చదువుతున్నప్పుడు ఆ లెటర్స్ అమృత చేతికి చిక్కుతాయి. దాంతో దేవాని రవి, శేషు ఏదో చేసారని, అందుకే దేవా చనిపోయాడని భావించిన గవిటి ప్రజలు పోలీసులకు రవి, శేషును అప్పజెబుతారు.


మరి ఈ కేసు నుంచి రవి, శేషు ఎలా తప్పించుకున్నారు. యాక్సిడెంట్ కి గురైన దేవా లోయల్లో ఎలా శవమై తేలాడు.. దేవాది హత్య... ఆత్మహత్య.. హత్య అయితే ఎవరు చేసారు అనేదే ఈ చిత్రం సెకండాఫ్.


నటీనటుల పెర్ ఫామెన్స్
బస్ కండక్టర్ గా, ఓ మిడిల్ క్లాస్ కుర్రాడైన రవి పాత్రలో సుమంత్ అశ్విన్ బాగున్నాడు. ఓ యాక్సిడెంట్ కి తనదే బాధ్యత అని, ఓ తండ్రికి కొడుకు లేకుండా చేసానని, ఓ అమ్మాయి జీవితం నాశనమవ్వడానికి తనే కారణమని భావిస్తూ మదనపడిపోయే సీన్స్ లో సుమంత్ అశ్విన్ బాగా నటించాడు. బాహుబలి ఫేం ప్రభాకర్ తొలిసారి పాజిటివ్ రోల్ చేసాడు. బస్ డ్రైవర్ గా రఫ్ లుక్ తో బాగున్నాడు. సుమంత్, ప్రభాకర్ కెమిస్ట్రీ బాగుంది. కళ్యాణి పాత్రలో పూజా జవేరి ఫర్వాలేదనిపించుకుంటుంది. అమృత పాత్ర చేసిన పావని బాగుంది. నాజర్, సుధ, రాజ్యలక్ష్మీ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. భద్ర పాత్రధారి నటన ఆకట్టుకుంటుంది. షకలక శంకర్, ధనరాజ్, తాగుబోతు రమేష్ తమ పాత్రలకు న్యాయం చేసారు.


సాంకేతిక వర్గం
ఇది సింఫుల్ స్టోరీ లైన్. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ ట్విస్ట్ తో ఉంటుంది. సెకండాఫ్ లో ఈ ట్విస్ట్ ని రివీల్ చేసే సన్నివేశాలు బాగున్నాయి. మలయాళ రీమేక్ కావడంతో తెలుగు నేటివిటీకి సరిపడా కొన్ని మార్పులు చేసారు. స్ర్కీన్ ప్లేని ఇంకాస్త మెరుగ్గా చేసే అవకాశం ఉన్న స్టోరీ లైన్ అయినప్పటికీ, డైరెక్టర్ ఆ వైపుగా ప్రయత్నం చేయకపోవడం నిరాశపరిచే విషయం. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్, పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కథకు సరిపడా బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫస్టాప్ లో కొన్ని బలమైన సీన్స్, హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ని ఇంకాస్త మెరుగ్గా చేసి ఉంటే బాగుండేది. చాలా మాములు సీన్స్ తో ఫస్టాప్ నడిచిన విధానం ఆడియన్స్ ని నిరాశపరిచే అవకాశముంది. షకలక శంకర్, ధనరాజ్, తాగుబోతు రమేష్ లాంటి కమడియన్స్ ఉన్నారు కాబట్టి కామెడీ ట్రాక్ ని ఇంకా బెటర్ గా వర్కవుట్ చేసి ఉండొచ్చు. కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే చేయకుండా, చిన్న ట్విస్ట్ లతో కూడుకున్న ఓ క్రైమ్ స్టోరీని అటెంప్ట్ చేసి మరో మెట్టు ఎక్కడానికి ట్రై చేసాడు సుమంత్ అశ్విన్. ఇందులో భాగంగా రెండు, మూడు సెంటిమెంట్ సీన్స్ లో మెచ్చుర్డ్ గా నటించి సినిమాకి సినిమాకి నటుడిగా మెరుగవ్వడానికి సుమంత్ అశ్విన్ చేస్తున్న ప్రయత్నాన్నిఅభినందించాల్సిందే. కథకు లింక్ అయిన సీన్స్ తో సెకండాఫ్ వేగంగా సాగడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. క్లయిమ్యాక్స్ వరకూ అదే టెంపో మెయింటెన్ చేయడంతో సెకండాఫ్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఫస్టాప్ విషయంలో డైరెక్టర్ ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.


ఫైనల్ గా చెప్పాలంటే...
ఎలాంటి అంచనాలు లేకుండా సుమంత్ అశ్విన్ నుంచి లవ్ స్టోరీని మాత్రమే ఆశించే ఆడియన్స్ కి ఈ సినిమాలోని ట్విస్ట్ , క్రైమ్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ వీకెండ్ టైమ్ పాస్ కోసం ఈ బస్ జర్నీకి ఒకసారి రైట్ రైట్ అనొచ్చు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !