View

రూల్స్ రంజన్ మూవీ రివ్య్వూ

Friday,October06th,2023, 09:16 AM

చిత్రం: రూల్స్ రంజన్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్ వెన్నెల కిశోర్, ఆది, సుదర్శన్, అజయ్, సుబ్బరాజు, మక్రంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ తదితరులు
నిర్మాణ సంస్థ:  స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్
రచన, దర్శకుడు: రత్న కృష్ణ
నిర్మాత: దివ్యాంగ్‌ లవానియా, మురళి కృష్ణ వేమూరి
సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్
సినిమాటోగ్రాఫర్: దులీప్ కుమార్ ఎం.ఎస్
విడుదల తేదీ: 06-10-2023


వరస సినిమాలతో అలరిస్తున్న హీరో కిరణ్ అబ్బవరం, హాట్ బ్యూటీ హీరోయిన్ నేహా శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం రూల్స్ రంజన్. సమ్మోహనుడా అనే ఒక్క సాంగ్‌తో సినిమాపై కావాల్సినంత హైప్ తీసుకొచ్చారు. అలాగే పబ్లిసిటీ కూడా పీక్స్ లో చేశారు. దాంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ శుక్రవారం థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం..


కథ:
మనోరంజన్(కిరణ్ అబ్బవరం) అనే వ్యక్తి ముంబైలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆయన పెట్టుకున్న రూల్స్ కి ఆ కంపెనీలో అందరూ అతని రూల్స్ రంజన్ అని ఆటపట్టిస్తుంటారు.ఈ క్రమంలో హీరోయిన్ సనా(నేహా శెట్టి ) అదే కంపెనీలో పనిచేస్తూ ఆయనకి మంచి ఫ్రెండ్ గా మారుతుంది. అది కాస్త ప్రేమగా మారే సమయంలో ఇద్దరికి మనస్పర్థలు వచ్చి దూరం అవుతారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవలు ఏంటి, అలాగే వాళ్ళిద్దరూ చివరికి కలుస్తారా లేదా విడిపోతారా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమాని చూడాల్సిందే.


విశ్లేషణ:
ముంబై సాఫ్ట్ వేర్ కంపేనీలో కథ మొదలు అవుతుంది. కథ ఆద్యాంతం చాలా కూల్ వాతావరణంలో రోమాంటిక్‌గా సాగుతుంది. సినిమాలో ఫస్ట్ మొత్తం చాలా కొత్తగా అనిపిస్తుంది. సినిమా మొదటి నుంచే వినుత్నంగా అలరిస్తుంది. మనోరంజన్ పాత్రను ప్రేక్షకుడు గుర్తుపెట్టుకునేలా అతను చేసే ఫీట్స్ అద్భుతంగా ఉంటాయి. తరువాత లవ్ ట్రాక్ మొదలౌతుంది. హీరోయిన్ బ్యూటీఫుల్ గా కనిపిస్తుంది. సినిమా మొదటి భాగం అంతా కామెడీ, లవ్ ట్రాక్‌తో ఆద్యాంతం ఆహ్లాదకరంగా సాగుతుంది. కథలో రూల్స్ రంజన్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసే సీన్లు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రేక్షకుడికి ఓ గొప్ప అనుభూతి కలుగుతుంది. తరువాత వచ్చే వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ అడల్ట్ హాస్యాన్ని అందించినప్పటికీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు. తరువాత సెకండ్ ఆఫ్ మొత్తం వీలేజ్ బ్యాగ్రౌండ్ లో కథ సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో ప్రేక్షకుడికి తరువాత ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం మొదలు అవుతుంది. సెకండ్ ఆఫ్ సినిమా ముంబై నుంచి విలేజ్‌కు మారుతుంది. ఇక్కడ హాస్యనటులు హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్‌లను పరిచయం చేస్తారు. అయితే సెకండ్ ఆఫ్‌లో వచ్చే కామెడీ ఫస్ట్ ఆఫ్ ను మించి ఉంటుంది. ముఖ్యంగా కామెడీ రైటింగ్‌ సూపర్బ్. అలగే హీరోయిన్, హీరో ల నడుమ వచ్చే సీన్లు కొంచెం ఫన్నీగా ఉన్నా.. చాలా ఎమోషనల్ గా సాగుతాయి.  ఇక క్లైమాక్స్‌లో వధువు గురించి వచ్చే డైలాగ్‌లు మనుసును దోచేస్తాయి. వివాహ వేదిక వద్ద సాగే మెలోడ్రామా ప్రేక్షకుల హృదయాన్ని అత్తుకునేలా ఉంటుంది.


ఎవరెలా చేశారు:
మనోరంజన్‌గా కిరణ్ అబ్బవరం అద్భుతంగా నటించాడు. ఒక నిజాయితీ, అమాయకత్వంతో కూడిన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. సరదాగా సాగే పాత్రలో బలమైన భావోద్వేగాలను పలికించాడు. ఇక మనోరంజన్ పాత్రను ప్రేక్షకులకు ఎక్కించడంలో కిరణ్ చేసే సీన్స్ ఆకట్టుకున్నాయి. హాట్ బ్యూటీ నేహా శెట్టి సనాగా మెప్పించింది. సినిమాలో తనకు చాలా ఇంపార్టెంట్ పాత్ర కాబట్టి మూవీ ఆద్యాంతం తన అందంతో ఆకట్టుకుంది. అలాగే మిగితా నటీనటులు అద్బుతమైన ప్రదర్శనను అందించారు. వెన్నెల కిషోర్ అడల్ట్ కామెడీ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చిన ముగ్గురు హాస్యనటులు - హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్‌లు స్వతహాగా వారు కమెడియన్స్ కాబట్టి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి కామెడీ ట్రాక్ సినిమాకు పెద్ద ప్లస్. అలాగే మిగా నటులు కూడా చాలా బాగా చేశారు.


సాంకేతిక అంశాలు:
దర్శకుడు రత్నం కృష్ణ తన రచనతో డైరెక్షన్ తో మెప్పించాడు. ఫస్ట్ ఆఫ్ అంతా ముంబైలో కామెడీ, లవ్ ట్రాక్ ను రాసుకొని కథను చాలా ఆసక్తిగా నడిపించారు. అలాగే సెకండ్ ఆఫ్ విలేజ్ లో సాగే ఎమోషన్స్ ను చాలా బాగా చూపించారు.  అమ్రిష్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచిన సమ్మోహనుడా అనే చార్ట్ బస్టర్ పాటను అందించారు. మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ తో అలరించారు.  అలాగే సినిమాటో గ్రాఫర్ దులీప్ కుమార్ ఎం.ఎస్ తన పని తనాన్ని చూపించారు. నగరంలో, పల్లేలో రెండు వేరియేషన్లలో చూపించే విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ బాగుంది.  నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. హీరో కిరణ్ అబ్బవరం మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా చిత్రీకరించారు. 


ప్లస్ పాయింట్లు
కథ
కథనం
రచన
దర్శకత్వం
మ్యాజిక్
సమ్మోమనుడా సాంగ్


రేటింగ్: 3/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !