View

శంకరాభరణం మూవీ రివ్య్వూ

Friday,December04th,2015, 08:25 AM

చిత్రం - శంకరాభరణం
బ్యానర్ - ఎంవీవీ సినిమాస్
సమర్పణ - కోన వెంకట్
నటీనటులు - నిఖిల్, నందిత, సుమన్, సితార, రావు రమేష్, సప్తగిరి, పృథ్వీ, సంపత్ రాజ్, సుజయ్ మిశ్రా, పిటూబాష్ త్రిపాఠి, అంజలి (కీలక పాత్ర), తదితరులు
కెమెరా - సాయి శ్రీరామ్
సంగీతం - ప్రవీణ్ లక్కరాజు
ఎడిటింగ్ - ఛోటా.కె.ప్రసాద్
రచనా సహకారం - వెంకటేశ్ కిలారు, భవాని ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రామన్ చౌదరి
సహ నిర్మాతలు - వి.ఎస్.ఎన్.కుమార్ చీమల, జి.వెంకటేశ్వరావ్
నిర్మాత - ఎం.వి.వి.సత్యనారాయణ
కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ - కోన వెంకట్
దర్శకత్వం - ఉదయ్ నందనవనమ్

 

స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సస్ సూర్య... ఇలా వరుస విజయాలతో నిఖిల్ దూసుకెళుతున్నాడు. మంచి కథలు ఎంపిక చేసుకుంటాడనే పేరు తెచ్చుకున్నాడు. స్టార్ రైటర్ కోన వెంకట్ పిలిచి 'శంకరాభరనం'కి అవకాశం ఇవ్వడంతో నిఖిల్ కెరీర్ మరో మెట్టు పైకి ఎదుగుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో కోన వెంకట్ కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ఈ సినిమాపై మొదట్నుంచీ అంచనాలు నెలకొన్నాయి. ఎంవీవీ సత్యనారాయణతో కలిసి కోన వెంకట్ నిర్మించిన ఈ 'శంకరాభరణం' మనసు దోచుకుంటుందా? నిఖిల్ సక్సెస్ ఫుల్ కెరీర్ కి కొనసాగింపు చిత్రం అవుతుందా?... చూద్దాం.

 

à°•à°¥
గౌతమ్ (నిఖిల్) తన తండ్రి సంపాదించిన డబ్బుతో హ్యాపీగా అమెరికాలో లైఫ్ లీడ్ చేస్తుంటాడు. గౌతమ్ తండ్రి రఘు (సుమన్) ని బిజినెస్ పార్టనర్స్ అయిన అతని ఫ్రెండ్స్ మోసం చేయడంతో భారీగా మోసపోతాడు. అప్పుల్లో మునిగిపోతాడు. డబ్బు కట్టకపోతే కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితిలో ఉంటాడు. అమెరికాలో ఉన్న తన ఆస్థినంతా ఆమ్మినా సరే రఘు ఇంకా అప్పులతోనే మిగిలిపోతాడు. ఈ సమస్య నుంచి బయటపడటానికి షూట్ చేసుకుని చనిపోవడానికి ప్రయత్నిస్తాడు రఘు. తండ్రి ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకుని తండ్రి సమస్యను తెలుసుకుంటాడు గౌతమ్. భర్తను ఈ స్థితిలో చూసిన రఘు భార్య రజ్జోదేవి (సితార) షాక్ అవుతుంది. తన భర్త ప్రాబ్లమ్ ని క్లియర్ చేయడానికి బిహార్ లో ఉన్న తన 'శంకరాభరణం' ప్యాలెస్ ని అమ్మేయాలని డిసైడ్ అవుతుంది. ఆ ప్యాలెస్ ని అమ్మి డబ్బు తీసుకురావాల్సిందిగా కొడుకు గౌతమ్ ని బిహార్ కి పంపిస్తుంది రజ్జోదేవి. కట్ చేస్తే...


రజ్జోదేవి అన్నయ్య బద్రినాథ్ ఠాగూర్ (రావు రమేష్) కుటుంబం మొత్తం ఆ ప్యాలెస్ లోనే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఆ ప్యాలెస్ లోనే చోటు కల్పించి వాళ్ల బరువు బాధ్యతలను చూసుకుంటుంటాడు బద్రినాథ్. అయితే ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన రజ్జోదేవి అంటే బ్రదినాథ్ కి పడదు. ఆ పరిస్థితులు చూసిన గౌతమ్ ఆ ప్యాలెస్ ని అమ్మడం అంత ఈజీ కాదని తెలుసుకుంటాడు. ఆ ప్యాలెస్ లో ఉన్న ప్రతి ఒక్కరి సంతకం తీసుకుంటే 12కోట్లుకు ఓ వ్యక్తి ప్యాలెస్ ని కొనుగోలు చేయడానికి రెడీగా ఉంటాడు. దాంతో అందరినీ అమెరికా తీసుకెళుతున్నానని చెప్పి పాస్ పోర్ట్ ల కోసం అందరి సంతకం తీసుకుంటాడు గౌతమ్. కానీ ఆ ప్యాలెస్ ని అమ్మేస్తే చిన్న పిల్లల దగ్గర్నుంచి మొత్తం కుటుంబం రోడ్డు పాలవుతుందని గ్రహించిన గౌతమ్ ప్యాలెస్ అమ్మే ప్రయత్నం చేయలేకపోతాడు. పైగా కుటుంబ సభ్యులు పంచే ప్రేమముందు డబ్బు ముఖ్యంకాదని తెలుసుకుంటాడు. తనను ప్రేమిస్తున్న మరదలు హ్యాపీ (నందిత)ని గౌతమ్ కూడా ప్రేమిస్తాడు. కట్ చేస్తే...


డబ్బున్న ఎన్నారై వచ్చాడని తెలుసుకున్న బీహార్ లోని మూడు గ్యాంగ్ లు గౌతమ్ ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని డిసైడ్ అవుతారు. అసలు డబ్బులే లేని గౌతమ్ ని కిడ్నాప్ చేసిన ఈ మూడు గ్యాంగ్ లు గౌతమ్ ని ఏం చేస్తాయి. ఈ కిడ్నాప్ గ్యాంగ్ ల నుంచి గౌతమ్ ఎలా బయటపడతాడు... ఇందుకోసం అతను ఎలాంటి గేమ్ ఆడతాడు... తన చెల్లెలు రజ్జోదేవి కుటుంబం అప్పుల్లో ఇరుక్కుందని, రజ్జోదేవి భర్త హాస్పటల్లో అడ్మిట్ అయ్యాడని తెలుసుకున్న బద్రినాథ్ 'శంకరాభరణం' ప్యాలెస్ ని అమ్మడానికి ముందుకొచ్చాడా... మరదలితో గౌతమ్ పెళ్లి అయ్యిందా... కుటుంబ సభ్యులందరినీ గౌతమ్ అమెరికా తీసుకెళ్లాడా అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
ఎన్నారై కుర్రాడిగా నిఖిల్ సూట్ అయ్యాడు. తన పాత్రకు ఎక్కువ డైలాగ్స్ లేవు. ఉన్న డైలాగ్స్ లో తెలుగు, ఇంగ్లిష్ మిక్స్ చేసినవే ఎక్కువ. ఆ సంభాషణలు స్టయిలిష్ గా పలికాడు. నటన పరంగా పెద్దగా రెచ్చిపోయే అవకాశం లేదు. డ్యాన్సులు కూడా ఇరగదీసే స్కోప్ లేదు. ఆ మాటకొస్తే సినిమాలో నటనపరంగా రెచ్చిపోయే స్కోప్ ఏ పాత్రకూ లేదు. విలన్ పాత్రధారులు సంపత్ రాజ్, సుజయ్ మిశ్రా, పిటూబాష్ త్రిపాఠి ఓకే అనిపించుకున్నారు. ఆడ విలన్ పాత్రలో అంజలి హాట్ గా ఉంది. నందిత ఓకే. సుమన్, సితార, రావు రమేశ్ యాజ్ ఇట్ ఈజ్ గత చిత్రాల్లో ఎంత బాగా చేశారో అంతే బాగా చేశారు. సప్తగిరి బాగానే నవ్వించాడు. పృథ్వీ, షకలక శంకర్ తదితర కమెడియన్లు సీన్ కి తగ్గట్టుగా చేశారు.


సాంకేతిక వర్గం
దాదాపు పదిహేనేళ్ల కింద బిహార్ వెళ్లినప్పుడు అక్కడ జరిగే కిడ్నాప్ లు గురించి తెలుసుకుని కోన వెంకట్ ఈ కథ రాసుకున్నాడు. హిందీ చిత్రం 'ఫస్ గయారే ఒబామా' చిత్రం హక్కులు తీసుకుని, బిహార్ లో తాను తెలుసుకున్న సంఘటనలతో ఈ కథ తయారు చేశాడు. 'ఫస్ గయారే ఒబామా' కథను పూర్తిగా మార్చేశాడు. కథ డిఫరెంట్ గా ఉంది. డైలాగ్స్ కూడా పేలాయి. అయితే ప్రతి సీన్లోనూ నవ్వించాలనే టార్గెట్ పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. ఒక పంచ్ కి నవ్వే లోపు మరో పంచ్.. అది పూర్తయ్యేలోపు మరో పంచ్.. పంచ్ ల దూకుడు తట్టుకోవడం కొంచెం కష్టమే. పాటలు సోసోగా ఉన్నాయి. బోల్గడన్ని ట్విస్టులతో దర్శకుడు కథ నడిపాడు. అన్ని ట్విస్టులతో తీయడం సామాన్యమైన విషయం కాదు. ఫస్టాఫ్ బాగున్నట్లనిస్తుంది. సెకండాఫ్ అలా అనిపించదు. కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


ఫిల్మీ బజ్ విశ్లేషణ
తెలుగు చిత్రసీమలో ఉన్న క్లాసిక్స్ లో కె. విశ్వనాథ్ 'శంకరాభరణం' ఒకటి. ఆ టైటిల్ తో ఇప్పుడు సినిమా తీయడం సాహసమే. అది మంచి మ్యూజికల్ మూవీ. దానికీ, ఈ 'శంకరాభరణం'కీ సంబంధం లేదనీ, టైటిల్ మాత్రమే పెట్టామని చెప్పుకుంటూ వచ్చారు. కరెక్టే. ఆ సినిమా ఎక్కడ? ఈ సినిమా ఎక్కడ? అసలిది మన బ్యాక్ డ్రాప్ సినిమానే కాదు. బిహార్ లో ఉండే ఓ కుటుంబం కథ. ఆ కుటుంబం తెలుగు భాషే మాట్లాడుతుంది. వేషధారణ, ఆ బ్యాక్ డ్రాప్, పెళ్లికి పాడిన పాటలు కూడా అక్కడివే. దాంతో మనం తెలుగు సినిమా చూస్తున్నామా? అనువాద చిత్రం చూస్తున్నామా? అనే ఫీల్ కలగక మానదు. హీరో.. కూడా ఎన్నారై కుర్రాడు కాబట్టి, తెలుగింగ్లీష్ మాట్లాడుతూ మాస్ పీపుల్ కి కనెక్ట్ కాడు. పైగా ఇండియాలో ఉన్న తన కుటుంబం పట్ల అమెరికా హీరో అనుబంధం పెంచుకున్నట్లు ఎలివేట్ చేయతగ్గ బలమైన సన్నివేశాలు లేవు. దాంతో హీరో ఎమోషన్ ప్రేక్షకుల మనసులను తాకదు. 'శంకరాభరణం' పేరు పెట్టినందుకుగాను వీనుల విందుగా ఒక్క పాటైనా ఉండి ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు ఎదురు చూడటం తప్పు కాదు. 'శంకరాభరణం' పేరు తల్చుకుంటేనే తియ్యని అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి అలా మిగిలిపోవాలంటే ఈ 'శంకరాభరణం' జోలికి వెళ్లకూడదు. కాసేపు నవ్వుకోవాలంటే వెళ్లొచ్చు. దాదాపు ప్రతి ఫ్రేమ్ లోనూ బోల్డంత మంది నటీనటులు, దూకుడు వేగంతో డైలాగులు గజిబిజిగా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపూ కిడ్నాపర్లు పెద్ద వెర్రి వెంగళప్పలేమో అనిపిస్తుంది. కిడ్నాపులు చేసి, జనాలను వణికించే మనుషులు ఇంత సులువుగా మోసపోతారా? అని ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా 50 కోట్లు హీరోకి ఇచ్చి విలన్ తేలికగా బై బై చెప్పినప్పుడు కిడ్నాపర్ల మీద సానుభూతి కలగక మానదు. 'బ్రూస్ లీ'లో కోన రాసిన 72 సన్నివేశాలు వాడలేదట. అందుకే పోయిందేమోననే పాయింట్ ను ఆ మధ్య కోన రైజ్ చేశాడు. ఈ సినిమాలో మొత్తం వాడి ఉంటారు. కానీ, ఫలితం????


ఫైనల్ గా చెప్పాలంటే... నిఖిల్ వరుస విజయాలకు 'శంకరాభరణం' చిన్నపాటి బ్రేక్ అయ్యే అవకాశం పాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !