View

శౌర్య మూవీ రివ్య్వూ

Friday,March04th,2016, 08:25 AM

చిత్రం - శౌర్య
బ్యానర్ - సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్స్ ఇండియా ప్రై.లిమిటెడ్
నటీనటులు - మంచు మనోజ్, రెజీనా, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, షయాజీ షిండే, సుబ్బరాజు, నాగినీడు, శ్రవణ్, బెనర్జీ, జి.వి, ప్రభాస్ శ్రీను, సత్యప్రకాష్, సూర్య, సుధ, హేమ తదితరులు
రచనా సహకారం - హరికృష్ణ, సాయికృష్ణ
రచన - గోపీ మోహన్
ఎడిటింగ్ - ఎస్.ఆర్.శేఖర్
సంగీతం - వేదా.కె
సినిమాటోగ్రఫీ - మల్హర్ భట్ జోషి
నిర్మాత - శివకుమార్ మల్కాపురం
సమర్పణ - బేబి త్రిష
స్ర్కీన్ ప్లే - గోపు కిషోర్
దర్శకత్వం - దశరధ్


మంచు మనోజ్ మంచి ఎనర్జీ ఉన్న హీరో. ఎలాంటి పాత్రని అయినా సునాయాసంగా చేసేయగలడు. మాస్ కీ, ఫ్యామిలీస్ కీ బాగా నచ్చుతాడు. విడిగా కూడా మనోజ్ చాలా జోవియల్ గా ఉంటాడు కాబట్టి, యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక.. దశరధ్ మంచి ఫ్యామిలీ మూవీస్ డైరెక్టర్. మాస్ హీరో మనోజ్ తో దశరధ్ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీసి ఉంటాడని ఊహించవచ్చు. ఈ చిత్రం కోసం మనోజ్ 8 కిలోలు బరువు పెరిగాడు. ఇప్పటివరకూ చేసిన ఏ సినిమాలోనూ కనిపించనంత వెరైటీ లుక్ తో మనోజ్ కనిపిస్తున్న ఈ 'శౌర్య' ఎలా ఉంటుంది? ఇప్పటివరకూ దాదాపు విజయవంతమైన చిత్రాలనే నిర్మించిన మల్కాపురం శివకుమార్ ఈసారి కూడా విజయం అందుకుంటాడా?... చూద్దాం.


కథ
శౌర్య (మంచు మనోజ్) తను ప్రేమించిన నేత్ర (రెజీనా) తో కలిసి యు.కె వెళ్లడం కోసం తనకు వచ్చిన మంచి బిజినెస్ ఆఫర్ ని కూడా వదిలిలేసుకుంటాడు. ఆమె తల్లిదండ్రులు ఒప్పుకునేంతవరకూ ఇద్దరం రేపే యు.కె వెళుతున్నామని తన ఫ్రెండ్ దగ్గర చెబుతాడు శౌర్య. ఒక్క రోజు గ్యాప్ ఉండటంతో నేత్రతో కలిసి ఆమెకు ఎంతో ఇష్టమైన కోటిలింగాల గుడిలో మహా శివరాత్రి సందర్భంగా జాగారం చేయడానికి అంగీకరిస్తాడు శౌర్య. అర్ధరాత్రి తర్వాత శౌర్య పక్కనే నిద్రలో ఉన్న నేత్ర గొంతు కోస్తారు. చావు బ్రతుకల మధ్య ఉన్న నేత్రను ఆంబులెన్స్ లో హాస్పటల్ కి తీసుకెళతారు. నేత్రను శౌర్య హత్య చేసాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. నేత్ర తండ్రి ఎం.పి కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుంటారు. కేసును కృష్ణప్రసాద్ (ప్రకాష్ రాజ్) హ్యాండిల్ చేస్తాడు. నేత్రకు బంధువైన కృష్ణప్రసాద్ కేసును పరిశీలించి శౌర్య ఈ హత్య చేయలేదని నమ్ముతాడు. కోర్టులో శౌర్యను హాజరుపర్చుతాడు. కట్ చేస్తే...


కోర్టులో తనే నేత్రను గొంతు కోసి చంపేసానని జడ్జి ముందు చెబుతాడు శౌర్య. ఇది కృష్ణప్రసాద్ తో పాటు అందరినీ షాక్ కి గురి చేస్తుంది. హాస్పటల్లో ఉన్న నేత్ర 365 అని పేపర్ మీద రాసి చనిపోతుంది.


అసలు నేత్రను శౌర్య ఎందుకు చంపాడు.. నిజంగానే నేత్ర చనిపోయిందా... శౌర్య ఈ కేసు నుంచి ఎలా బయటపడతాడు... నేత్ర రాసిన 365 అంకె వెనుక ఉన్నరహస్యం ఏంటీ... అసలు శౌర్య ఎందుకు ఇదంతా చేసాడు అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
ఇప్పటివరకూ చూసిన మనోజ్ వేరు.. ఈ సినిమాలో కనిపించిన మనోజ్ వేరు అన్నట్లుగా తను చేసిన శౌర్య పాత్ర ఉంది. హై ఓల్టేజ్ యాక్షన్ క్యారెక్టర్స్ మాత్రమే కాదు.. కూల్ గా సాగే ఇంటెలిజెంట్ క్యారెక్టర్స్ ని కూడా బ్రహ్మాండంగా చేయగలనని శౌర్య పాత్ర ద్వారా నిరూపించుకున్నాడు. రెజీనాతో ప్రేమ సన్నివేశాల్లో మనోజ్ హావభావాలు బాగున్నాయి. నేత్ర పాత్ర మీద తనకున్న ప్రేమనంతా కళ్లల్లోనే పలికించగలిగాడు. ఆ సన్నివేశాల్లో మనోజ్ డైలాగ్స్ పలికిన తీరు కూడా టచింగ్ గా ఉంటుంది. ఓవరాల్ గా మనోజ్ బెస్ట్ పర్ఫార్మర్ అని మరోసారి నిరూపించిన చిత్రం ఇది. రెజీనా చాలా క్యూట్ గా ఉంది. నేత్ర పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. లవ్ సీన్స్ లో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ క్యూట్ గా ఉన్నాయి. పోలీసాఫీసర్ పాత్రలో ప్రకాశ్ రాజ్ బాడీ లాంగ్వేజ్, నటన బాగున్నాయి. నాగినీడు, సుబ్బరాజు, సుధ తదితరులు పాత్రల్లో ఒదిగిపోయారు.


సాంకేతిక వర్గం
ఈ స్టోరీ లైన్ చాలా డిఫరెంట్ గా ఉంది. స్ర్కీన్ ప్లే ఇంకా బలంగా ఉండి ఉంటే బాగుండేది. ఇంటర్వెల్ కార్డు పడేసరికి తర్వాత స్టోరీ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనే ఆసక్తి కలుగుతుంది. ఆ తర్వాత జరిగిన స్టోరీ బాగానే ఉన్నా, ఇంకా ఏదో ఉండి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ కలగక మానదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను తీసిన దశరధ్ ఈ చిత్రాన్ని కూడా ఆ పంథాలో నడిపించినా, థ్రిల్లింగ్ ఎలిమెంట్ యాడ్ చేసి ఈ సినిమా తీశాడు. సంగీత దర్శకుడు వేద ఇచ్చిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. డైలాగ్స్ ఓకే అనిపించే విధంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా అంతే.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫస్టాఫ్ సరదాగా సాగుతూ, ఇంటర్వెల్ కి చిన్న ట్విస్ట్ ఇచ్చి, సెకండాఫ్ మీద ఆసక్తి కలిగేలా చేశారు. ఫస్టాఫ్ కొంచెం స్లోగా సాగినా సెకండాఫ్ వేగం పెంచడంతో అది కవర్ అయిపోతుంది. ఇది పూర్తిగా మనోజ్ షో అనే చెప్పాలి. తన సెటిల్డ్ పర్ఫార్మెన్సే సినిమాకి ప్లస్. క్లయిమ్యాక్స్ కూడా బాగుంది. నేత్ర నిజంగానే చనిపోయిందా? బతికే ఉందా? అనే ఆసక్తి ప్రేకకులకు కలిగేలా సీన్స్ అల్లడం బాగుంది. శౌర్య ఆడే ఇంటెలిజెంట్ గేమ్ బాగుంటుంది. ట్విస్ట్ లను ఊహించే విధంగా ఉండవు కాబట్టి ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతారు. చివరికి వచ్చేసరికి సుబ్బరాజు హంతకుడు అని ఊహించగలిగినా, మనోజ్ ఎందుకు తన మీద హత్య నేరం వేసుకుంటాడనే అంశం ఆసక్తిగా ఉంటుంది.


ఓవరాల్ గా చెప్పాలంటే.. రొటీన్ కి భిన్నంగా మంచి స్టోరీ లైన్ తో సాగే చిత్రం ఇది. అక్కడక్కడా చిన్ని చిన్ని లోపాలు కనిపించినా.. వాటిని పెద్దగా పట్టించుకోకుండా చూస్తే.. బాగానే ఉంటుంది. మనోజ్ నటన కోసం చూడాల్సిన సినిమా ఇది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !