View

సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు మూవీ రివ్య్వూ

Friday,January29th,2016, 11:08 AM

చిత్రం - సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు
బ్యానర్ - శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్
నటీనటులు - రాజ్ తరుణ్, ఆర్తన, రణధీర్, రాజా రవీంద్ర, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, నవీన్, డైరెక్టర్ యన్.శంకర్ తదితరులు
సంగీతం - గోపీ సుందర్
ఎడిటింగ్ - కార్తీక్ శ్రీనివాస్
కెమెరా - విశ్వ
సమర్పణ - శ్రీమతి పూర్ణిమ ఎస్.బాబు
నిర్మాతలు - ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - శ్రీనివాస్ గవిరెడ్డి


ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ విజయాలతో రాజ్ తరుణ్ సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు. వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన ఈ కుర్ర హీరో నటించిన తాజా చిత్రం 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు'. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం టైటిల్ పరంగా ఇప్పటికే అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పటివరకూ చేసిన మూడు చిత్రాల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఖాతాలో మరో హిట్ పడుతుందా? నూతన దర్శకుడు గవిరెడ్డికి ఈ చిత్రం మంచి పేరు తెచ్చే విధంగా ఉంటుంందా?.. తెలుసుకుందాం.


à°•à°¥
రామచంద్రాపురం ప్రెసిడెంట్ (రాజా రవీంద్ర) కు ఓ కొడుకు, కూతురు సీత (ఆర్తన) ఉంటారు. అదే ఊరికి చెందిన రాము (రాజ్ తరుణ్) కి సీత అంటే చిన్నప్పట్నుంచి ఇష్టం. ఎంత ఇష్టం అంటే తను క్రికెట్ ఆడుతున్న బ్యాట్ వల్ల సీతకు దెబ్బ తగిలిందని చిన్నప్పట్నుంచి క్రికెట్ ఆడటమే మానేస్తాడు రాము. వయసుతో పాటు చిన్నప్పటి ప్రేమ పెరిగి పెద్దదై సీతను ఎలాగైనా తనదానిని చేసుకోవాలనుకుంటాడు రాము. బయట ఊర్లో చదువుకుంటున్న సీత సెలవులకు రావడం, రాము ఆమెను చూడటం, తన ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంటుంది.


సీత తండ్రి మాత్రం తన కూతురిని డబ్బులున్న అబ్బాయికో, లేక డబ్బులు బాగా సంపాదిస్తున్న కుర్రాడికో ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఒక సందర్భంలో సీతకు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు రాము. మెడిసిన్ చదువుతున్న సీత తను మాత్రం అతనిని ప్రేమించడంలేదని చెబుతుంంది. ప్రేమిస్తున్నానంటూ చెల్లెలు వెంటపడుతున్న రాము అంటే సీత అన్నయ్యకు కోపం. ప్రేమిస్తున్నానన్న అబ్బాయిని తిరస్కరించి, తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని తన కూతురు చెప్పడంతో సీత తండ్రి సంతోషపడిపోతాడు.


అయితే తనను రాము ఎంత నిజాయితీగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్న సీత... రామును ప్రేమించడం మొదలుపెడుతుంది. చెల్లెలు రాముని ప్రేమిస్తుందని తెలుసుకున్న సీత అన్నయ్య, సీత తండ్రి ఆమెకు ఇండియా కోసం క్రికెట్ ఆడబోతున్న వరుణ్ తో పెళ్లి నిశ్చయం చేస్తారు.


మరి రాము తన ప్రేమను ఎలా గెలుచుకుంటాడు... సీతతో పెళ్లి ఫిక్స్ అయిన వరుణ్ ఏం చేస్తాడు... సీత అన్నయ్య, తండ్రి సీత ప్రేమను అంగీకరిస్తారా అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
ఇంటర్ పాస్ అవ్వకుండా, పదే పదే ఇంటర్ చదువుతూ ఓ బ్యాచ్ ని వెంటేసుకుని గాలిగా తిరిగే కుర్రాడి పాత్రకు రాజ్ తరుణ్ వంద శాతం న్యాయం చేసాడు. ఓ అమ్మాయిని విపరీతంగా ప్రేమించే ప్రేమికుడిగా. తన ప్రేమను గెలిపించుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడే కుర్రాడిగా కూడా మంచి ఎక్స్ ప్రెషన్స్ తో అద్భుతంగా నటించాడు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కి తన లోని డ్యాన్సర్ ని బయటపెట్టే అవకాశం కూడా దక్కింది. డ్యాన్స్ బాగా చేసాడు. ఒకటి, రెండు ఫైట్స్ కూడా ఉన్నాయి. టోటల్ గా యూత్ ని కట్టిపడేసే పాత్ర చేసాడు. సీతగా ఆర్తన ఫర్వాలేదనిపించుకుంటుంది. రాజరవీంద్ర, రణధీర్, సురేఖావాణి, శ్రీలక్ష్మీ, రత్నాసాగర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు. హీరో ఫ్రెండ్ గా షకలక శంకర్ కడుపుబ్బా నవ్వించాడు. కొడుకు ప్రేమను అంగీకరించి, ప్రేమను సాధించుకోవడానికి కొడుకును ప్రోత్సహించే పాత్రలో డైరెక్టర్ శంకర్ బాగున్నారు.


సాంకేతికవర్గం
శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. సింఫుల్ లవ్ స్టోరీతో సినిమాని తెరకెక్కించారు. టేకింగ్ బాగుంది. హీరో క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసిన విధానం బాగుంది. రాజ్ తరుణ్ తో ఎలాంటి సినిమా తీయాలో కరెక్ట్ గా అలాంటి సినిమానే అటెంప్ట్ చేయడం మెచ్చుకోదగ్గ విషయం. గోపీసుందర్ పాటలు బాగున్నాయి. 'సీత హెల్ప్ అడిగింది...' పాట ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. రీ-రికార్డింగ్ కూడా బాగుంది. విశ్వ కెమెరా వర్క్ ఆహ్లాదకరంగా ఉంది. ఎలాంటి ల్యాగ్ లేకుండా, షార్ప్ గా సీన్స్ ని ఎడిట్ చేయడం వల్ల ఆడియన్స్ బోర్ ఫీలవ్వరు. హీరో మార్కెట్, కొత్త డైరెక్టర్ అన్నీ పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ మించనీయకుండా, కథకు సరిపడా బడ్జెట్ సమకూర్చి పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో సేఫ్ ప్రాజెక్ట్ చేసారు నిర్మాతలు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
రొటీన్ స్టోరీ లైన్. ఇలాంటి కథలు వెండితెరపై చాలనే చూసాం. కొత్త డైరెక్టర్ అయినప్పటికీ, స్ర్కీన్ ప్లే విషయంలో ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా టోటల్ గా యూత్ ని టార్గెట్ చేస్తూ అల్లిన సీన్స్ సినిమాకి ప్లస్. సెపరేట్ కామెడీ ట్రాక్ కాకుండా, కథతోనే లింక్ అయిన క్యారెక్టర్ షకలక శంకర్ తో కడుపుబ్బా నవ్వించడం బాగుంది. ఇప్పుడొస్తున్న కొత్త డైరెక్టర్లు, అప్ కమింగ్ హీరోలు పవన్ కళ్యాణ్ ని అసలు మర్చిపోవడంలేదు. ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ ని వాడుకుని పవర్ స్టార్ అభిమానులను పడేస్తున్నారు. ఈ డైరెక్టర్ కూడా ఆ పని పక్కాగా చేసారు. కనీసం అరడజను సీన్స్ లో అయినా పవన్ ని గుర్తు చేసారు. పక్షులను స్వేచ్ఛగా వదిలేయాలని హీరోయిన్ చేసిన సీన్... హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడానికి హీరో ఏకంగా పాములను స్వేచ్చగా వదిలేసే సీన్స్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాయి. అమ్మ తన ప్రపంచంలో కొడుకును హీరో చేస్తే... కొడుకు తన ప్రపంచంలో అమ్మను పని మనిషి చేయడంలాంటి సెంటిమెంట్ సీన్, డైలాగ్ ఆకట్టుకుంటాయి. ఓ కుర్ర హీరోతో ఇలాంటి మెసేజ్ ఉన్న సీన్ చేయించడం బాగుంది. ఇంటర్ నెట్ ఉంటే కనెక్ట్ అవ్వడం, లేకపోతే డిస్ కనెక్ట్ అయ్యే ప్రేమకాదు నాది అని హీరో చెప్పే లవబుల్ సీన్ ఆకట్టుకుంటుంది. రాజ్ తరుణ్ యాక్టింగ్ ఈ సినిమాకి ప్లస్. బి, సి సెంటర్స్ ఆడియన్స్ ని రాజ్ తరుణ్ నటనతో పాటు షకలక శంకర్ పంచ్ డైలాగులు, కామెడీ సీన్స్ కట్టి పడేస్తాయి. కాకపోతే తన ప్రేమను గెల్చుకోవడానికి క్రికెట్ ఆడటం, హీరో ఆటకి హీరోయిన్ అన్నయ్య అండగా నిలబడటం, తన కూతురి మీద హీరోకి ఎంత ప్రేమ ఉందో తెలుసుకుని కూతురు ప్రేమను తండ్రి గెలిపించడం రొటీన్ గా ఉంటుంది. కానీ ఆ రోటీన్ సీన్స్ లో రాజ్ తరుణ్ నటన, ల్యాగ్ లేకుండా సీన్స్ ని ప్రెజెంట్ చేసిన విధానం ఆడియన్స్ కి బోర్ కలిగించదు. పైగా మినిమమ్ బడ్జెట్ తో సింఫుల్ లవ్ స్టోరీతో తెరకెక్కించిన సినిమా కాబట్టి యూత్ ఓసారి సినిమాని చూసేస్తారు. బి, సి సెంటర్స్ వసూళ్లు కూడా బాగుంటాయి. కాబట్టి ఇది సేఫ్ ప్రాజెక్ట్.


ఫైనల్ గా చెప్పాలంటే... లైటర్ వీనర్ రాము, సీత లవ్ స్టోరీని ఓసారి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. యూత్ తమ ప్రేమ కథలను గుర్తుకు తెచ్చుకోవచ్చు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !