View

సైజ్ జీరో మూవీ రివ్య్వూ

Friday,November27th,2015, 08:08 AM

చిత్రం - సైజ్ జీరో
బ్యానర్ - పివిపి
సమర్పణ - ప్రసాద్ à°µà°¿ పొట్లూరి
నటీనటులు - అనుష్క, ఆర్య, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, ఊర్వశి, గొల్లపూడి మారుతిరావు, అడవి శేష్, పోసాని కృష్ణమురళి, భరత్, బ్రహ్మానందం, హేమ తదితరులు
సంగీతం - యం.యం.కీరవాణి
సినిమాటోగ్రఫీ - నిరవ్ షా
డైలాగ్స్ - కిరణ్ కుమార్
ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సందీప్ గుణ్ణం
నిర్మాత - పరమ్ .వి.పొట్లూరి, కవిన్ అన్నే
కథ, స్ర్కీన్ ప్లే - కణిక థిల్లాన్
దర్శకత్వం - ప్రకాష్ కోవెల మూడి

 

కథానాయికలు మెరుపు తీగల్లా కనిపిస్తేనే ఇప్పుడు ముద్దు. బొద్దుగా కనిపించే తారలకు అంత క్రేజ్ ఉండదు. సో.. 'సైజ్ జీరో' అని టైటిల్ పెట్టి, హీరోయిన్ ని బందరు లడ్డూ అంత బొద్దుగా చూపించాలనుకోవడం ఓ రిస్క్. సేమ్ టైమ్ సినిమాలో 'సమ్ థింగ్' ఉందని ఎక్స్ పెక్టేషన్స్ కలగడం కూడా ఖాయం. 'బొమ్మలాట', 'అనగనగా ఓ ధీరుడు' వంటి డిఫరెంట్ మూవీస్ చేసిన ప్రకాశ్ కోవెలమూడి చేసిన తాజా చిత్రం 'సైజ్ జీరో'. ఈ చిత్రం కోసం అనుష్క దాదాపు 20 కిలోలు బరువు పెరిగింది. ఇప్పుడు తగ్గే పని మీద ఉంది. ఆ విధంగా తను రిస్క్ తీసుకున్నట్లే. మంచి కథా చిత్రం ఇవ్వాలనే ఆశయంతో పొట్లూరి వి. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి.. ఈ 'సైజ్ జీరో' ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుంది? అనుష్క తీసుకున్న రిస్క్ కి న్యాయం జరుగుతుందా?... చూద్దాం.

 

à°•à°¥
సౌందర్య ఉరఫ్ (స్వీటీ) చిన్నప్పట్నుంచి బొద్దుగా, ముద్దుగా ఉంటుంది. వెయిట్ మెషీన్ లో వెయిట్ చూసుకోవడంతో పాటు ఆ వెయిట్ చూపించే కార్డ్ లో మెసేజ్ ని చదివి ఓ పాజిటివ్ వైబ్రేషన్ తో ముందుకు సాగే మనస్తత్వం తన తండ్రి (రావు రమేశ్) వల్ల అలవాటు చేసుకుంటుంది స్వీటీ. చిన్నప్పడే తండ్రిని కోల్పోతుంది స్వీటీ. తల్లి రాజేశ్వరి (ఊర్వళి), తమ్ముడు భరత్, తాతయ్య (గొల్లపూడి మారుతిరావు), తాను పని చేస్తున్న రెస్టారెంట్.. పెద్దయ్యాక ఇదే స్వీటీ ప్రపంచం. తనకు నచ్చింది తింటూ లావుగా ఉన్నాసరే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. పెళ్లి వయసు వచ్చేసరికి లావుగా ఉండటం పెద్ద సమస్య అని తెలుస్తుంది. ఎన్నో సంబంధాలు రావడం, లావుగా ఉండటం వల్ల సంబంధాలు తప్పిపోవడం జరుగుతుంటుంది. తల్లి రాజేశ్వరికి కూతురి పెళ్లి పెద్ద సమస్యగా మారుతుంది. కూతురిని బరువు తగ్గమని చెబుతూ ఉంటుంది. కట్ చేస్తే..


పెళ్లి చూపుల కోసం వచ్చిన ఎన్నారై అభి (ఆర్య) తనకు నచ్చలేదని స్వీటీ చెబుతుంది. అభికి కూడా పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యం లేకపోవడంతో ఆ సంబంధం తప్పిపోతుంది. అయితే ఓ పెళ్లిలో అభిని చూసిన స్వీటీ మనసు పారేసుకుంటుంది. అభి ఓ డాక్యుమెంటరీ చేస్తుంటాడు. ఆ డాక్యుమెంటరీ, అతని హెల్పింగ్ టెండన్సీ స్వీటీని ఇంప్రెస్ చేస్తుంది. అదే సమయంలో ఎన్.జి.ఓ సంస్థకు చెందిన సిమ్రాన్ (సోనాల్ చౌహాన్) డాక్యుమెంటరీ విషయంలో అభికి హెల్ప్ చేయడం, ఇద్దరూ ఒకరంటే ఒకరికి అట్రాక్షన్ ఏర్పడం జరుగుతుంది. వాళ్లిద్దరూ క్లోజ్ గా ఉన్న సమయంలో చూసిన స్వీటీ హర్ట్ అయ్యి బరువు తగ్గాలని, లేకపోతే తనను ప్రేమించే వాళ్లుగానీ, పెళ్లి చేసుకునేవారుగానీ దొరకరని,జస్ట్ ఫ్రెండ్ గా ఉండేవాళ్లే మిగులుతారని ఫిక్స్ అయిపోతుంది. దాంతో బరువు తగ్గాలని నిర్ణయించుకుంటుంది.


సైజ్ జీరో వెయిట్ లాస్ స్టూడియోలో తల్లి కోరిక మేరకు చేరుతుంది. వెయిట్ తగ్గడానికి కష్టపడుతుంటుంది. అదే స్టూడియోలో తన ఫ్రెండ్ జ్యోతి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి వర్కవుట్లు చేస్తుంటుంది. మోడల్ అవ్వాలనే ఆశయంతో ఉంటుంది జ్యోతి. వర్కవుట్స్ చేస్తున్న జ్యోతి అనారోగ్యానికి గురవ్వడంతో హాస్పటల్లో అడ్మిట్ అవుతుంది. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇస్తున్న ఫుడ్. డ్రింక్స్ వల్ల ఆమె కీడ్నీ ఎఫెక్ట్ అయ్యిందని వెంటనే ఆపరేషన్ చేయాలని అందుకు 25లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో స్వీటీ షాక్ అవుతుంది.


తన ఫ్రెండ్ కి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని, సైజ్ జీరో లాంటి స్టూడియోలు స్థాపించి బరువుగా ఉన్నవారి వీక్ సెస్ ని క్యాష్ చేసుకుంటున్న సత్యానంద్ (ప్రకాష్ రాజ్) లాంటి వారికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి పూనుకుంటుంది స్వీటీ. ఆమెకు అండగా సిమ్రాన్, అభి నిలుస్తారు. పివిపి స్ట్పోర్ట్స్ అధినేత అడవి శేష్ కూడా వీళ్లకి అండగా నిలుస్తాడు. స్వీటీ యాక్టివిటీస్ అతన్ని ఇంప్రెస్ చేస్తాయి.


మరి... జ్యోతి ఆపరేషన్ కి అయ్యే అమౌంట్ ని స్వీటి అండ్ కో ఎలా సమకూర్చారు. వెయిట్ లాస్ స్టూడియోస్ చేస్తున్న వ్యాపారంపై ప్రజల్లో ఎలాంటి అవగాహన తెప్పించగలిగారు.. ఫైనల్ గా తను ఇష్టపడిన అభిని స్వీటి పెళ్లి చేసుకుంటుందా? తనంటే ఇంప్రెస్ అయిన శేష్ ని స్వీటీ పెళ్లి చేసుకుంటుందా? పెళ్లి కోసం తగ్గుతుందా? తాను తగ్గకుండా నెగ్గుతుందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

నటీనటుల పర్ఫార్మెన్స్
కుమారి సౌందర్య వెర్సస్ స్వీటీ క్యారెక్టర్ ను అనుష్క అద్భుతంగా చేసింది. ఈ పాత్ర కోసం తను బరువు పెరిగిన వైనం తెరపై స్పష్టంగా కనిపించింది. బాడీ లాంగ్వేజ్ ని మార్చుకుంది. హావభావాలు చక్కగా పలికించింది. టోటల్ గా కొత్త అనుష్కను చూసినట్లననిపిస్తుంది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై క్యారీ చేయగలిగింది. అనుష్క తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర ఊర్వశిది. తనదైన సహజమైన నటనతో తల్లి పాత్రకు న్యాయం చేసిందామె. ఆర్య కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. సొనాల్ చౌహాన్ ఫర్వాలేదనిపించుకుంది. ఇంట్లో ఉండే తాతయ్యలానే తాత పాత్రలో గొల్లపూడి మారుతీరావు అనిపించారు. రావు రమేష్ కొన్ని సన్నివేశాల్లోనే కనిపించినా, గుర్తుండిపోతాడు. నాగార్జున స్పెషల్ అపియరెన్స్ అదిరింది. లక్ష్మీప్రసన్న మంచు ఆకట్టుకుంది. తమన్నా, జీవా, శ్రీదివ్య బాబీ సింహా అపియరె్న్స్ అలరించింది. అడవి శేష్ ది మంచి పాత్ర. ఆ పాత్రను బాగా చేశాడు. ప్రకాష్ రాజ్ గెటప్ డిఫరెంట్ గా ఉండటంతో పాటు ఈ మధ్యకాలంలో చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంది. ఇక, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

 

సాంకేతిక వర్గం
అథిక బరువుతో బాధపడే అమ్మాయి కథ. మన పక్కింట్లోనే, మన బంధువుల్లోనో, స్నేహితుల్లోనో ఇలాంటి అమ్మాయిలను చూస్తుంటాం. వాళ్లు పడే పాట్లు కూడా మనకు ఎరుకే. అలాంటి అమ్మాయిలను దృష్టిలో పెట్టుకుని కనిక థిల్లాన్ ఈ కథ రాసింది. స్టోరీ చాలా బాగుంది. అందరికీ కనెక్ట్ అవుతుంది. ఆ కథను సూర్యప్రకాశ్ తనదైన శైలిలో తెరకెక్కించాడు. క్లాస్, మాస్ ఎలిమెంట్స్ ని సమపాళ్లల్లో బ్లెండ్ చేసి తీయడం మెచ్చుకోదగ్గ విషయం. కిరణ్ కుమార్ రాసిన సంభాషణలు షార్ట్ అండ్ స్వీట్ గా కథకు తగ్గట్టుగా ఉన్నాయి. కీరవాణి పాటల్లో 'మెల్ల మెల్ల మెల్లగా..' హాయిగా ఉంది. ఇతర పాటలు కూడా బాగున్నాయి. ఆయన చేసిన రీ-రికార్డింగ్ ఓ హైలైట్. నిరవ్ షా కెమెరా మెరిసింది. ప్రొడక్షన్ వేల్యూస్ సూపర్బ్ అనాలి. ఇలాంటి సినిమాలు తీయాలంటే నిర్మాతకు మంచి అభిరుచి ఉండాలి. ఆ విధంగా ప్రసాద్ వి. పొట్లూరి టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఇప్పటివరకూ అనుష్క ఎన్నో రకాల పాత్రలు చేసింది. అవన్నీ ఒక ఎత్తయితే ఈ చిత్రంలో చేసిన స్వీటీ పాత్ర మరో ఎత్తు అనాలి. పాత్రలో పూర్తిగా ఇన్ వాల్వ్ అయిపోయింది. ఈ సినిమా చూసినవాళ్లకు అనుష్క ఎప్పుడు గుర్తొచ్చినా.. సినిమాలో కనిపించినట్లుగా చేతిలో జిలేబీతోనో, బుంగ మూతితోనో కనిపిస్తుంది. అంతగా మనసుల్లో నిలిచిపోతుంది. కథ, కథనం, టేకింగ్ బాగున్నాయి. అప్పుడే అయిపోయిందా అన్నంత వేగంగా ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ అంత వేగంగా కాకపోయినా నత్త నడకన అయితే సాగదు. సీరియస్ ఎలిమెంట్ ని షుగర్ కోటెడ్ లా సరదాగా చూపించడం హైలైట్. ఓవరాల్ గా మంచి ఫీల్ తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికి వస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత ఓ జిలేబీ తింటే బాగుండు అనుకుంటారు. జిలేబీ అంత కమ్మగా ఉంది సినిమా.


ఫైనల్ గా చెప్పాలంటే... స్వీటీ సందడిని మిస్ కావద్దు. మంచి చిత్రాలు రావడంలేదని విమర్శిస్తే ఉపయోగం లేదు. వచ్చినప్పుడు చూడాలి. సో.. 'సైజ్ జీరో'ని డోంట్ మిస్.


A funny touching family entertainer that attracts youth also.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !