View

సోగ్గాడే చిన్ని నాయనా మూవీ రివ్య్వూ

Friday,January15th,2016, 08:57 AM

చిత్రం - సోగ్గాడే చిన్ని నాయనా
బ్యానర్ - అన్నపూర్ణ స్టూడియోస్
నటీనటులు - అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాగబాబు, నాజర్, బ్రహ్మానందం, హంసానందిని, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, చలపతిరావు తదితరులు
సినిమాటోగ్రఫీ - పి.యస్.వినోద్
సంగీతం - అనూప్ రూబెన్స్
ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి
నిర్మాత - నాగార్జున అక్కినేని
దర్శకత్వం - కల్యాణ్ కృష్ణ కురసాల


'సోగ్గాడే చిన్ని నాయనా...' అంటూ వెండితెరపై అక్కినేని నాగేశ్వరరావు చేసిన సందడిని తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మర్చిపోలేరు. ఇప్పుడు ఈ పాటను టైటిల్ గా పెట్టి, ఓ పాత్రలో పంచెకట్టులో, మరోటి ఎన్నారై పాత్రలో నాగార్జున వెండితెరపై సందడి చేయడానికి వచ్చాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అప్పట్లో నాగ్ సరసన 'హలో బ్రదర్'లో జోడీకట్టిన రమ్యకృష్ణ, కుర్ర తార లావణ్యా త్రిపాఠి జతకట్టారు. ఇక.. సోగ్గాడి సందడి ఎలా ఉందో చూద్దాం...


à°•à°¥
రాము (నాగార్జున అక్కినేని) డాక్టర్. రాము తన భార్య సీత (లావణ్యా త్రిపాఠి) తో కలిసి యు.ఎస్ లో ఉంటాడు. డాక్టర్ గా బిజీగా ఉండే రాము భార్య సరదాలను తీర్చడంలో ఫెయిల్ అవుతాడు. ఇది సీతను చాలా బాధపెడుతుంది. లోన్లీగా ఫీలవుతుంది. ఆ ఫ్రస్ర్టేషన్ లో ఉంటుంది సీత. చివరికి రాము, సీత మాటా మాటా అనుకుని విడాకులు తీసుకోవాలని డిసైడ్ అవుతారు. విడాకుల విషయం తన అమ్మ సత్తెమ్మ (రమ్యకృష్ణ) దగ్గర చెప్పడానికి రాము తన భార్య సీతతో సహా యు.ఎస్ నుంచి తన ఊరికి వస్తాడు. ఊరికి వచ్చిన కొడుకు, కోడలు సంతోషంగా లేరని, విడాకులు తీసుకోవాలనుకుంటున్నారని తెలుసుకున్న సత్తెమ్మ షాక్ అవుతుంది. వారిద్దరిని విడాకులు తీసుకోనివ్వకుండా ఎలా ఆపాలా అని టెన్షన్ పడుతూ 30 యేళ్ల క్రితం చనిపోయిన తన భర్త బంగార్రాజు (నాగార్జున అక్కినేని) ని తలుచుకుని ఏడుస్తూ అతనిని పిలుస్తుంది. కట్ చేస్తే...


యమలోకంలో ఉన్న బంగార్రాజును అతని భార్య పిలుస్తుంది కాబట్టి, ఆత్మ రూపంలో భూలోక ప్రవేశం చేసే వరమిస్తాడు. వచ్చే మహాశివరాత్రి సూర్యాస్తమయం అయ్యేలోపు లిరిగి మయలోకం చేరుకోవాలని బంగార్రాజుకు షరతు పెడతాడు యముడు. అలా ఎందుకు బంగార్రాజుకు వరమిచ్చారని యముడిని అడిగిన చిత్రగుప్తుడికి... అతని వల్ల ఓ కార్యం జరగాల్సి ఉంది. అతను ఆత్మ రూపంలో భూలోక ప్రవేశం చేయడానికి ధైవ కారణం ఉందని చెబుతాడు.


బంగార్రాజు ఆత్మ రూపంలో తన ఇంట్లో అడుగుపెడతాడు. తన భార్యకు మాత్రమే కనిపిస్తాడు. కొడుకు, కోడలు విడాకులు తీసుకోకుండా వారి జీవితాలను కాపాడే బాధ్యత తనదని, దాని గురించి దిగులుపడొద్దని భార్య సత్తెమ్మకి చెబుతాడు బంగ్రారాజు. అందుకోసం ప్రయత్నాలు చేస్తాడు. సరిగ్గా ఈ సమయంలో తనను కావాలనే యాక్సిడెంట్ చేసి చంపారని, తన కుటుంబం మొత్తం ప్రమాదంలో ఉందని తెలుసుకుంటాడు బంగార్రాజు. ఇందుకు తన పెదనాన (నాజర్) కారణమని కూడా తెలుసుకుంటాడు.


ఆత్మ రూపంలో తనకెలాంటి శక్తులులేని బంగార్రాజు ప్రమాదంలో ఉన్న తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు... బంగార్రాజుని చంపేసిన బంగార్రాజు పెదనాన మొత్తం బంగార్రాజు కుటుంబాన్ని చంపేయడానికి ఎందుకు ప్లాన్ చేస్తాడు... రాము, సీతను విడాకులు తీసుకోకుండా బంగార్రాజు వారి జీవితాలను నిలబెట్టగలిగాడా? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? మహాశివరాత్రి సూర్యస్తమయం అయ్యేలోపు బంగార్రాజు యమలోకం చేరుకున్నాడా అనేదే ఈ చిత్ర కథాంశం.


నటీనటుల పర్ఫార్మెన్స్
బంగార్రాజుగా తండ్రి పాత్రలో జోరుగా, హుషారుగా, రాముగా కొడుకు పాత్రలో ఇన్నొసెంట్ గా నాగార్జున నటన సుపర్బ్. బంగార్రాజు పాత్రలో అచ్చంగా పల్లెటూరి మనిషిలా మాట్లాడటం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆకట్టుకుంది. అమ్మాయిలను పడగొట్టే సన్నివేశాల్లో బంగార్రాజు చేసే సందడి భలే ఉంటుంది. ముఖ్యంగా 'సోగ్గాడే చిన్ని నాయనా..' పాటకు నాగ్ స్టెప్పులు అదిరిపోయాయి. బంగార్రాజు భార్యగా సత్తెమ్మ పాత్రలో రమ్యకృష్ణ హుందాగా ఉంది. ఇక, నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీత పాత్రలో లావణ్యా త్రిపాఠి చాలా క్యూట్ గా ఉంది. తన నటన సహజంగా ఉంది. కాసేపే కనిపించినా అనుష్క అదిరిపోయింది. ఇతర పాత్రల్లో నాజర్, పోసాని, చలపతిరావు, సంపత్, ఝాన్సీ తదితరులు పాత్రలకు తగ్గట్టుగా ఒదిగిపోయి, సినిమాకి ప్లస్ అయ్యారు. రాము మరదలిగా అనసూయ రెండు సీన్స్ లో, ఓ పాటలో మెరిసి అలరించింది. హంసానందిని హాట్ గా బాగుంది. బ్రహ్మానందం బురిడీ బాబా పాత్రలో తనదైన శైలిలో ఒదిగిపోయారు.


సాంకేతిక వర్గం
నిర్మాత పి.రామ్మోహన్ చెప్పిన స్టోరీ లైన్ ని డెవలప్ చేసి, ఈ సినిమా తీశారు. లైన్ పూర్తిగా కొత్తగా అని చెప్పలేం. ఆ లైన్ చుట్టూ ఆసక్తికరమైన సన్నివేశాలు అల్లి తెరకెక్కించారు. కల్యాణ్ కృష్ణ బాగానే తీశాడని చెప్పాలి. దర్శకుడిగా భేష్ అనిపించుకున్నాడు. బంగార్రాజు పాత్రకు రాసిన సంభాషణలన్నీ సరదాగా ఉన్నాయి. ఆ సంభాషణలను నాగ్ పలికిన తీరు ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. అనూప్ రూబెన్స్ పాటలు ఓకే అనిపించాయి. 'సోగ్గాడే చిన్ని నాయనా..' పాట ఫెస్టివల్ లా ఉంది. కెమెరా, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సూపర్.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫస్టాఫ్ బంగార్రాజు సందడితో సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ వరకూ సరదాగా నవ్వుకుంటూ చూస్తారు.సెకండాఫ్ కొంచెం సెంటిమెంట్ టచ్ తో అక్కడక్కడా కొంచెం ఉద్వేగానికి గురి చేస్తుంది. సీనియర్ తార రమ్యకృష్ణ, కుర్రతార లావణ్యతో నాగ్ కెమిస్ర్టీ చాలా బాగుంది. బంగార్రాజు బాడీ లాంగ్వేజ్ ని అభిమానులు మాత్రమే కాకుండా.. ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది సినిమా కాబట్టి ఆ లాజిక్ ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సంక్రాంతి పండగకు వచ్చిన పండగలాంటి సినిమా.


ఫైనల్ గా చెప్పాలంటే... సోగ్గాడి సందడిని కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయొచ్చు... డోంట్ మిస్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !