View

స్పీడున్నోడు మూవీ రివ్య్వూ

Friday,February05th,2016, 09:51 AM

చిత్రం - స్పీడున్నోడు
బ్యానర్ - గుడ్ విల్ సినిమా
సమర్పణ - భీమినేని రోషితా సాయి
నటీనటులు - బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక బదోరియా, ప్రకాష్ రాజ్, రావు రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, కబీర్ దూహన్, శ్రీనివాస్ రెడ్డి, మధు నందన్, చైతన్య కృష్ణ, షకలక శంకర్, ప్రగతి, మీనా, విద్యులేఖా రామన్ తదితరులు
మెయిన్ స్టోరీ - ఎస్.ఆర్.ప్రభాకరన్
డైలాగ్స్ - ప్రవీణ్ వర్మ, భీమినేని శ్రీనివాసరావు
ఎడిటింగ్ - గౌతంరాజు
సంగీతం - డి.జె.వసంత్
సినిమాటోగ్రఫీ - విజయ్ ఉలగనాథ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వివేక్ కూచిబొట్ల
నిర్మాత - భీమినేని సునీత
స్టోరీ డెవలప్ మెంట్, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం - భీమినేని శ్రీనివాసరావు

 

జస్ట్ 5 కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా 40 కోట్లకు పైగా వసూలు చేస్తే... తీసినవాళ్లకీ, కొన్నవాళ్లకీ ఎంత ఆనందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళ చిత్రం 'సుందరపాండియన్' అక్కడివాళ్లకు అలాంటి అనుభూతినే మిగిల్చింది. ఈ చిత్రాన్నే రీమేక్ స్పెషలిస్ట్ భీమనేని శ్రీనివాసరావు 'స్పీడున్నోడు'గా తెలుగులోకి రీమేక్ చేశారు. టైటిల్ కి తగ్గ జోరున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ చిత్రం రూపొందింది. తొలి చిత్రం 'అల్లుడు శీను'తో మంచి డ్యాన్సులు చేయగలడు.. ఫైట్స్ చేయగలడని నిరూపించుకున్నాడు సాయి శ్రీనివాస్. ఈ సినిమా నటుడిగా అతనికి మరింత పేరు తెచ్చే విధంగా ఉంటుందని భీమనేని శ్రీనివాసరావు చెప్పారు. ఇక.. ఈ 'స్పీడున్నోడు' ఎలా ఉందో చూద్దాం.

 

à°•à°¥
శోభన్ (బెల్లంకొండ శ్రీనివాస్) రామగిరి ఊరికి చెందిన కుర్రాడు. రామగిరి ఊరుకి ప్రెసిడెంట్ శోభన్ తండ్రి వీరభద్రప్ప (ప్రకాష్ రాజ్). న్యాయం వైపే ఉంటూ ఊరి పెద్దగా అందరికీ న్యాయం జరగాలని కోరుకునే వ్యక్తి వీరభద్రప్ప. డిగ్రీ పూర్తయ్యి నాలుగేళ్లు అయినా అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు శోభన్. ఫ్రెండ్ షిప్ కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా వెనుకాడని మనస్తత్వం కలవాడు శోభన్. తన ఫ్రెండ్ గిరి (మధు నందన్) ప్రేమిస్తున్న వాసంతి (సోనారికా) ని ఒప్పించి గిరి ప్రేమను గెలించడానికి ప్రయత్నం చేస్తాడు శోభన్. అయితే గిరిని వాసంతి ప్రేమించడంలేదని తెలుసుకుంటాడు. అలాగే నాలుగేళ్లుగా తన వెంట పడతున్న చిట్టిని కూడా వాసంతి ప్రేమించడంలేదని, తనని ప్రేమిస్తుందని తెలుసుకుంటాడు శోభన్. ఇంటర్ లోనే వాసంతిని ప్రేమించిన శోభన్ ఆమెను ప్రేమిస్తాడు. ఈ ఇద్దరి ప్రేమ వాసంతి ఇంట్లో తెలిసిసోతుంది. వాసంతి తండ్రి రామచంద్రప్ప (రావు రమేష్) తన పెద్ద అల్లుడు తమ్ముడు జగన్ (కబీర్ దూహన్) కి వాసంతిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు.


వాసంతిని ప్రేమించిన జగన్, చిట్టి, గిరి ముగ్గురూ శోభన్ ఫ్రెండ్స్. తనను ప్రేమించడంలేదని వాసంతిపై యాసిడ్ పోయడానికి ట్రై చేస్తాడు చిట్టి. అది ఆపడానికి శోభన్ ట్రై చేయడం, ఆ సమయంలో యాక్సిడెంటల్ గా చిట్టి బస్సులోంచి పడిపోయి చనిపోవడం జరుగుతుంది. వాసంతి ప్రేమను, శోభన్ ప్రేమను అర్ధం చేసుకున్న తల్లిదండ్రులు వీరి పెళ్లి చేయడానికి నిర్ణయించుకుంటారు.


తనను కాదన్న వాసంతిని పెళ్లి చేసుకోవడం పట్ల శోభన్ పై జగన్ కోపంగా ఉంటాడు. మరోవైపు చిట్టి చనిపోవడానికి కారణం శోభన్ అని భావించే చిట్టి ఫ్రెండ్ కూడా శోభన్ పై కోపంగా ఉంటాడు. జగన్, చిట్టి ఫ్రెండ్ కలిసి శోభన్ ని చంపేయాలని ప్లాన్ చేస్తారు. మరి ఫైనల్ గా ఫ్రెండ్స్ వేసిన ప్లాన్ కి శోభన్ బలైపోతాడా... వాసంతిని చేసుకుంటాడా.. ఫ్రెండ్ షిప్ కోసం ఏం చేయడానికైనా వెనుకాడని శోభన్ సరైన ఫ్రెండ్స్ లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుంటాడా అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
తొలి సినిమా 'అల్లుడు శీను'లోనే బెల్లంకొండ శ్రీనివాస్ డ్యాన్స్ పరంగా, ఫైట్స్ పరంగా నటన పరంగా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఇక రెండో సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేయడంలో సఫలమయ్యాడు. ముఖ్యంగా క్లయిమ్యాక్స్ సన్నివేశాల్లో బాగా నటించాడు. వాసంతిగా సోనారికా బాగుంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్, పోసాని, పృథ్వీ, కబీర్ ఎవరి పాత్రలకు వారు పూర్తి న్యాయం చేసారు. హీరోయిన్ అత్తగా ఝూన్సీ మంచి పాత్ర చేసింది. మిగతా నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేసారు.


సాంకేతిక నిపుణులు
రీమేక్ సినిమాలు చేయడంలో భీమినేని శ్రీనివాసరావు దిట్ట. కథలోని ఆత్మ చెడిపోకుండా, నేటివిటికి తగ్గట్టు మార్పులు చేయడం భీమినేనికి బాగా తెలుసు. ఈ సినిమా తమిళ చిత్రం 'సుందర్ పాండ్యన్' కి రీమేక్. మంచి మెసేజ్ తో కూడుకున్న రియలిస్టిక్ స్టోరీ లైన్. తెలుగు నేటివిటికి తగ్గట్టు మార్పులు చేసి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తీర్చదిద్దడానికి డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు చాలా కృషి చేసారు. అందులో 90 శాతం సక్సెస్ అయ్యారని కూడా చెప్పాలి. ఎందుకంటే బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమాతో తెచ్చకున్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని సాంగ్స్, ఫైట్స్ కంపోజ్ చేయించడం, తొలి సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా, ఇంకాస్త మెరుగయ్యాడని ఆడియన్స్ అనుకునేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. అయితే ఫ్రెండ్ షిప్ కి సంబంధించి మరికొన్ని బలమైన సన్నివేశాలు పడి ఉంటే క్లయిమ్యాక్స్ ఆడియన్స్ కి బలంగా కనెక్ట్ అయ్యి ఉండేది. విజయ్ ఉలగనాధ్ అందించిన ఫోటోగ్రఫీ బాగుంది. రాయలసీమ ప్రాంతంలోని లొకేషన్స్ ని చక్కగా తన కెమెరాలో బంధించారు. వసంత్ అందించిన పాటలు బాగున్నాయి. పాటల కోసం వేసిన సెట్స్ బాగున్నాయి. నిర్మాణపు విలువలు సూపర్.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫ్రెండ్స్ షిప్ ప్రధానాంశంగా తీసుకుని చేసిన సినిమాలు ఏ భాష వారికైనా కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా కూడా ఫ్రెండ్ షిప్ ప్రధానాంశంగా చేసిన సినిమా. రియలిస్టిక్ స్టోరీ లైన్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. యూత్ తమను తాము ఐడెంటిఫై చేసుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. టీనేజ్ లో ఉన్న ప్రతి కుర్రాడికి తల్లిదండ్రులు ఫ్రెండ్స్ తో జాగ్రత్త అని చెబుతూనే ఉంటారు. మంచి వారితో ఫ్రెండ్ షిప్ చేయమని చెబుతుంటారు. అది ఎంత కరెక్ట్, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలని ఈ సినిమా చూసిన ప్రతి టీనేజ్ కుర్రాడు అనుకోవడం ఖాయం. అలాగే ఫ్రెండ్ షిప్ చేయడం తప్పు అని కంక్లూజన్ ఇవ్వకుండా, మంచి వారితో ఫ్రెండ్ షిప్ చేయాలని చెప్పడం బాగుంది. 'స్పీడున్నోడు' టైటిల్ కి తగ్గట్టు శ్రీనివాస్ మంచి ఎనర్జిటిక్ గా యాక్ట్ చేసాడు. కాకపోతే క్లయిమ్యాక్స్ చూసిన తర్వాత ఫ్రెండ్ షిప్ గురించి బలంగా సన్నివేశాలు పడాల్సిందని మాత్రం ఆడియన్స్ అనుకోకుండా ఉండరు. కేవలం ఒక సిగరెట్ ని ఫ్రెండ్సందరూ కలిసి కాల్చడం, అందరూ కలిసి సెల్ఫీలు దిగినంత మాత్రానా ఫ్రెండ్ షిప్ అంటే ఇలానే ఉండాలని అనిపించుకోదు. హార్ట్ టచింగ్ క్లయిమ్యాక్స్, ఇచ్చిన మెసేజ్ కి ఆడియన్స్ బలంగా కనెక్ట్ అవ్వాలంటే దానికి సంబంధించిన సీన్స్ కూడా బలంగా ఉండాలి.


ఫైనల్ గా చెప్పాలంటే.. ఈ వీకెండ్ టైమ్ పాస్ ఎంటర్ టైనర్ 'స్పీడున్నోడు'. ఫ్రెండ్స్ తో కలిసి ఓసారి సినిమా చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !