View

గీత సాక్షిగా ట్రైలర్ ని రిలీజ్ చేసిన విజయ్ కనకమేడల

Tuesday,March14th,2023, 03:34 PM

నిజ ఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందిన ఇన్‌టెన్స్ ఎమోష‌న‌ల్ డ్రామా ‘గీత సాక్షిగా’. ఆద‌ర్శ్‌, చిత్రా శుక్లా  హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని మార్చి 22న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ ఫుల్ స్వింగులో ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, సాంగ్‌తో సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. మంగళవారం ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. నాంది సినిమా ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌, నిర్మాత స‌తీష్ వేగేశ్న.. గీత సాక్షిగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా...


ఎడిట‌ర్ కిషోర్ మ‌ద్దాలి మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఆంథోని నాకు 15 ఏళ్లుగా మంచి స్నేహితుడు. త‌ను గీతసాక్షిగా సినిమా చేస్తున్నాన‌ని చెప్పి నాకు ఎడిట‌ర్‌గా అవ‌కాశం ఇచ్చాడు. మంచి టీమ్ ఏర్పాటు చేసుకుని చేసిన సినిమా. ఈ సినిమాను ఆంథోనికి ఇచ్చిన నిర్మాత చేత‌న్ రాజ్‌గారికి థాంక్స్‌’’ అన్నారు. 


చరిష్మా మాట్లాడుతూ ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత చేత‌న్‌గారికి, డైరెక్ట‌ర్ ఆంథోనిగారికి థాంక్స్‌. మంచి ఎమోష‌న్ మూవీ. నటిగా మంచి అవ‌కాశం ద‌క్కింది. స‌పోర్ట్ చేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కి థాంక్స్‌’’ అన్నారు. 


శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ ‘‘ముందుగా త‌న తెలుగు సినిమాతో ఇండియ‌న్ సినిమా రేంజ్‌ను ప్ర‌పంచానికి చాటి చెప్పిన రాజ‌మౌళిగారికి, ట్రిపులార్ టీమ్‌కి థాంక్స్‌. ఇక మా గీత‌సాక్షిగా సినిమా విషయానికి వ‌స్తే.. మా నిర్మాత చేత‌న్‌గారు ముంబై నుంచి మన తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆయ‌న ఇక్క‌డ మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ఆంథోని నాకు చాలా మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చాడు. నా పిచ్చ‌ని భ‌రించాడు. ఆద‌ర్శ్‌, చిత్ర అంద‌రూ బాగా చేశారు. మంచి సెమేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ అంశాలున్న సినిమా. త‌ప్ప‌కుండా అంద‌రూ త‌మ ఆశీస్సుల‌ను అందించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


హీరో ఆద‌ర్శ్ మాట్లాడుతూ ‘‘నాంది సినిమాతో సూపర్ హిట్ సాధించిన డైరెక్టర్ విజయ్‌గారు మాకు స‌పోర్ట్ చేయ‌టానికి ఇక్క‌డ‌కు వ‌చ్చినందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. వండ‌ర్‌ఫుల్ అవ‌కాశాన్ని నాకు ఇచ్చిన మా నిర్మాత చేత‌న్‌గారికి థాంక్స్. ఇలాంటి మంచి నిర్మాత ఇక్క‌డ‌కు రావ‌టం మ‌న ల‌క్‌. ఆయ‌న ఇక్క‌డే ఉండాల‌ని కోరుకుంటున్నాను. ఈ స‌క్సెస్‌తో ఆయ‌న తెలుగులో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. డైరెక్ట‌ర్ ఆంథోనిగారి డేడికేష‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. దానికి త‌గ్గ‌ట్టు మంచి క‌థ దొరికింది.. మూవీ చేశారు. ఈ సినిమా స‌క్సెస్ త‌ర్వాత ఆయ‌న‌కు పెద్ద పెద్ద బ్యాన‌ర్స్ నుంచి అవ‌కాశాలు వ‌స్తాయి. ఈ మ‌ధ్య కాలంలో తెలుగు ప్రేక్ష‌క దేవుళ్లు కంటెంట్ ఉన్న సినిమాల‌నే ఆద‌రిస్తున్నారు. అలాంటి వారంద‌రికీ మా గీతసాక్షిగా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. త‌ప్ప‌కుండా ఈ సినిమాను థియేట‌ర్స్‌లోనే చూడండి. మార్చి 22న మూవీ రిలీజ్ అవుతుంది. సాంగ్స్‌, ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. గోపి సుంద‌ర్‌గారు అద్భ‌తమైన మ్యూజిక్‌ను అందించారు. పాట‌ల రైట‌ర్ రెహ‌మాన్‌గారు సంద‌ర్భానుసారం రాసిన పాట‌లు అంద‌రికీ న‌చ్చుతున్నాయి. మా సినిమాటోగ్రాఫ‌ర్ కోటిగారికి థాంక్స్‌. ప్ర‌తి ఫ్రేమ్‌ను ప్రేమించి చేవారు. ఎడిట‌ర్ కిషోర్‌గారికి  స‌హా ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌. మా హీరోయిన్ చిత్ర శుక్లగారికి థాంక్స్. నేను డెబ్యూ హీరో అయినప్పటికీ సపోర్ట్ చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్, రాజారవీంద్రగారు సహా అందరికీ థాంక్స్’’ అన్నారు. 


హీరోయిన్ చిత్ర శుక్ల మాట్లాడుతూ ‘‘మ‌న దేశానికి ఆస్కార్‌ను తెచ్చిన రాజ‌మౌళిగారు, ఎన్టీఆర్‌గారు, రామ్ చ‌ర‌ణ్‌గారికి థాంక్స్‌. మా అంద‌రికీ గ‌ర్వ‌కార‌ణంగా నిలిచారు. శ్రీకాంత్ అయ్యంగార్‌గారితో వ‌ర్క్ చేసిన అనుభ‌వం గొప్ప‌గా అనిపించింది. మా డైరెక్ట‌ర్ ఆంథోనిగారికి, నిర్మాత చేత‌న్‌రాజ్‌గారికి థాంక్స్‌. మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై తెర‌కెక్కించిన చిత్రం. న‌టిగా న్యాయం చేశాను. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 


చిత్ర నిర్మాత చేత‌న్ రాజ్ మాట్లాడుతూ ‘‘నేను ముంబైలో డిస్ట్రిబ్యూటర్‌ని. హైద‌రాబాద్‌కి వ‌చ్చి పోతుంటాను. సాధార‌ణంగా మ‌న దేశంలో మ‌హిళ‌లను అమ్మ‌గా పూజ‌స్తాం. మ‌హిళ అంటే శ‌క్తి స్వ‌రూపిణి. ఓ బిడ్డ‌గా, భార్య‌గా, అమ్మ‌గా, స్నేహితురాలిగా మ‌న‌కు ఆ శ‌క్తి స‌పోర్ట్ చేస్తుంటుంది. అలాంటి వారిపై దురాగ‌తాలు జ‌రుగుతున్నాయి. దానిపై సినిమా చేయాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఆద‌ర్శ్‌తో నాకు ప‌రిచ‌యం అయ్యింది. నా ద‌గ్గ‌రున్న క‌థ చెప్పి, మంచి టీమ్ కావాల‌న్న‌ప్పుడు ఆద‌ర్శ్ ఆంథోని స‌హా మంచి టీమ్‌ని ఏర్పాటు చేశాడు. ఆంథోని సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. మార్చి 22న ఈ మూవీని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ స‌పోర్ట్ కావాల‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు. 


ద‌ర్శ‌కుడు ఆంథోని మ‌ట్టిప‌ల్లి మాట్లాడుతూ ‘‘సాధారణంగా పేపర్స్‌ల్లో అమ్మాయిలపై అత్యాచారాలు జరిగాయనే వార్తలు చదివినప్పుడు ఎంతో బాధ‌గా అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎంత బాధ‌ను అనుభ‌వించి ఉంటుందో అని అనుకుంటేనే ఇంకా బాధ ఎక్కువై పోయేది. అలాంటి కాన్సెప్ట్‌తో ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న స‌మ‌యంలో నా ద‌గ్గ‌ర‌కు ఆద‌ర్శ్ వ‌చ్చాడు. ముందు శ‌శి చెప్పే క‌థ విన‌మ‌న్నారు. నేను విన్న‌ప్పుడు నా ఆలోచ‌న‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే క‌థ అనిపించింది. ఆ క‌థ‌పై వ‌ర్క్ చేయ‌టం స్టార్ట్ చేశాను. అమ్మాయిల‌పై దురాగ‌తాలు జ‌రిగిన‌ప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌, కోర్టులు ఎలా రియాక్ట్ అవుతున్నాయ‌నే దాన్ని రీసెర్చ్ చేశాను. ద్రౌప‌దికి జ‌రిగిన అవమానం నుంచి ఇప్ప‌టి ఘట‌న‌లు వ‌ర‌కు స్టోరీ బోర్డ్ త‌యారు చేసుకుంటూ వ‌చ్చాను. నేను చ‌దివిన చాలా ఘ‌ట‌న‌ల్లో నుంచి ఓ పాయింట్ తీసుకుని గీత‌సాక్షిగా సినిమా చేశాను. నేను ఇంత‌కు ముందు ఏ సినిమాను డైరెక్ట్ చేయ‌లేదు. కొత్త డైరెక్ట‌ర్‌ని అయిన‌ప్ప‌టికీ అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. రెగ్యుల‌ర్ మూవీ కాదు.. కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. మా నిర్మాత చేత‌న్ రాజ్‌గారికి థాంక్స్‌’’ అన్నారు. 


నాంది డైరెక్ట‌ర్ విజ‌య్ క‌న‌క‌మేడ‌ల మాట్లాడుతూ ‘‘నేను ఆరు నెలల ముందు సినిమాటోగ్రాఫ‌ర్ విజ‌య్‌గారి వ‌ల్ల ఆత్మ‌సాక్షిగా విజువ‌ల్స్ చూశాను. బాగున్నాయ‌నిపించింది. మ‌న తెలుగు సినిమా చేయ‌టానికి ముంబై నుంచి ఇక్క‌డ‌కు వ‌చ్చిన చేత‌న్ రాజ్‌గారికి థాంక్స్‌. ఆయ‌న ఇంకా మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ఆద‌ర్శ్ నాకు ఢీ షో నుంచి తెలుసు. అక్క‌డ నుంచి త‌ను టీవీ సీరియ‌ల్స్‌లోనూ న‌టించారు. ఇప్పుడు హీరోగా గీత‌సాక్షిగాతో ప‌రిచ‌యం అవుతున్నాను. ట్రైల‌ర్ చాలా బావుంది. చిత్ర శుక్ల రెగ్యుల‌ర్ సినిమాల‌కు భిన్నంగా మంచి పాత్ర‌ల‌ను ఎంచుకుని సినిమాలు చేస్తుంది. డైరెక్ట‌ర్ ఆంథోని కెరీర్‌లో గీత సాక్షిగా మంచి సినిమా కావాల‌ని కోరుకుంటున్నాను. 


నాంది నిర్మాత సతీష్ వేగేశ్న మాట్లాడుతూ ‘‘‘గీత మీద మాట్లాడుతూ’ అనే టైటిల్‌ను నేను అప్ప‌ట్లో అనుకున్నాను. కానీ ఆ టైటిల్ కంటే గీత సాక్షిగా అనే టైటిల్ బావుంది. సినిమా మంచి కాన్సెప్ట్‌తో రూపొందింద‌ని ట్రైల‌ర్ చూస్తుంట‌నే అర్థ‌మ‌వుతుంది. ట్రైల‌ర్‌లో న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ గొప్ప‌గా చేశార‌నిపిస్తుంది. మంచి హిట్ సినిమా అవ్వాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


న‌టీన‌టులు:  ఆద‌ర్శ్‌, చిత్రా శుక్ల‌, రూపేష్ శెట్టి, చ‌రిష్మా శ్రీకాంత్ అయ్యంగార్, భ‌ర‌ణి శంక‌ర్‌, జ‌య‌ల‌లిత‌, జ‌య‌శ్రీ ఎస్‌.రాజ్‌, అనితా చౌద‌రి, సుద‌ర్శ‌న్‌, రాజా ర‌వీంద్ర‌, శ్రీనివాస్ ఐఏఎస్‌ 


సాంకేతిక వ‌ర్గం:
క‌థ‌, నిర్మాత‌:  చేత‌న్ రాజ్‌స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  ఆంథోని మ‌ట్టిప‌ల్లిమ్యూజిక్:  గోపీ సుంద‌ర్‌సినిమాటోగ్ర‌పీ:  వెంక‌ట్ హ‌నుమ నారిశెట్టిఎడిట‌ర్‌:  కిషోర్ మ‌ద్దాలిఆర్ట్‌:  నానిడాన్స్‌: య‌శ్వంత్‌, అనీష్‌ఫైట్స్‌:  పృథ్వీపి.ఆర్‌.ఒ:  నాయుడు సురేంద్ర కుమార్ - ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియాAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !