డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం దాస్ కా ధమ్కీ. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు చార్ట్‌బస్టర్ గా నిలిచాయి. ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ 2.0 సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ప్రెస్ మీట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..
'ధమ్కీ'నాకు చాలా స్పెషల్ మూవీ. నటనతో పాటు నిర్మాణం దర్శకత్వంలో చాలా నిజాయితీగా పని చేశాను. డబ్బులు సంపాయించడానికి ఎప్పుడు సినిమా లేదు కానీ ఈ సినిమా కోసం చాలా డబ్బులు పెట్టేశాను. ఈ ప్రయాణంలో నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియాకి కృతజ్ఞతలు. ప్రసన్న కథ చెప్పిన్నపుడే అద్భుతమనిపించింది. డెవలప్ చేస్తూ వెళ్తుంటే దాని స్కేల్ పెరుగుతూవెళ్ళింది. నివేదా కూడా చాలా మంచి సూచన ఇచ్చింది. దాంతో సినిమా మరో లెవెల్ కి వెళ్ళింది. ఆ సూచనఏమిటనేది విడుదల తర్వాత చెప్తాను. మహేష్, హైపర్ ఆదితో పని చేస్తుంటే కాలం సరదాగా గడిచిపోయింది. నాకు ఎలాంటి మ్యూజిక్ కావాలో లియోన్ కి బాగా తెలుసు. ఇందులో బీజీఏం మాములుగా వుండదు. నివేద కథ నచ్చితేనే సినిమా చేస్తుంది. ఆమెకు కథ నచ్చడంతో ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. మా నాన్న నన్ను చాలా భరించారు. ఈ సినిమా ఆయనకి చాలా డబ్బులు తెచ్చిపెట్టాలి. వన్మయి క్రియేషన్స్ ఇక్కడితో ఆగిపోదు.ఇంతకుమించి సినిమాలు వస్తాయి. మా టీం అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. దాస్ కా ధమ్కీ 22న వస్తోంది. చాలా రిస్కులు తీసుకొని చేసిన సినిమా ఇది. దీనికి కారణం సినిమాపై ప్రేక్షకులపై వున్ననమ్మకం. నేను డైరక్షన్ చేసిన ఫలక్ నామా దాస్ కి ఎంత ప్రోత్సాహం దొరికిందో డానికి రెండింత ప్రోత్సాహం ఈ చిత్రానికి దొరుకుతుంది‘దాస్ కా ధమ్కీ’ నా జీవితాన్ని మారుస్తుంది అన్నారు.
నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. దాస్ కా ధమ్కీ’ నాకు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. నటుడిగా నిర్మాతగా దర్శకుడిగావిశ్వక్ పూర్తి న్యాయం చేశారు. లియోన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత రాజు గారు అద్భుతమైన వ్యక్తి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. దాస్ కా ధమ్కీ’మీ అందరినీ అలరిస్తుంది అన్నారు.
ప్రసన్న కుమార్ బెజవాడ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం యూనిట్ పడిన కష్టం ఒకెత్తు, విశ్వక్ అన్న పడిన కష్టం మరో ఎత్తు.ఇరవై రోజులుగా తిరుగుతూనే వున్నాడు. చాలా ప్రేమించి ఆయన చేసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం సర్వసం పెట్టి కష్టపడి పని చేశాడు. ఆయన కోసం ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా వుంటుంది. సెకండ్ హాఫ్ థ్రిల్ కోసం సినిమాకి రావాలి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్.
నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ.. మా బ్యానర్ లో ఇది రెండో సినిమా. మొదటి సినిమా ఫలక్ నామా దాస్ విడుదల కాకముందే మా బాబుకి మంచి పేరు తీసుకొచ్చింది. దాస్ కా ధమ్కీ’ కోసం పదిహేను నెలలుగా కష్టపడుతున్నాడు. సినిమాకి కావాల్సిన అన్నీ సమకూర్చాడు. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నచ్చే సినిమా ఇది. సినిమా చూసిన ప్రేక్షకులు కథ గురించి బయటికి లీక్ చేయకూడదని కోరుకుంటున్నాను. సెకండ్ హాఫ్ లో ఏమౌతుందో వేరే వాళ్ళకి చెప్పకుండా వుంటే ఈ సినిమా పెద్దస్థాయిలో వుంటుంది అన్నారు.
లియోన్ జేమ్స్ మాట్లాడుతూ.. విశ్వక్ తో ఇది నా మూడో సినిమా. దాస్ కా ధమ్కీ కోసం చాలా కొత్తగా సౌండ్ డిజైన్ చేశాం. నేపధ్య సంగీతంలో చాలా డిఫరెంట్ సౌండ్ వినిపిస్తాయి. ఆడియన్స్ కి కొత్త అనుభూతిని ఇస్తాయి. సినిమా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా వుంటుంది. ప్రేక్షకులు ఖచ్చితంగా గొప్పగా ఎంజాయ్ చేస్తారు అన్నారు.
మహేష్ , హైపర్ ఆది, అన్వర్ అలీ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.