View

గ్రాండ్ గా లాంచ్ అయిన మేమ్ ఫేమస్ టీజర్

Sunday,March26th,2023, 02:32 PM

‘మేమ్ ఫేమస్’ టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంత్రి మల్లారెడ్డి ‘రైటర్ పద్మభూషణ్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరిఫిల్మ్స్ ,చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. ఇటివలే ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం  వహిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైన  మేమ్ ఫేమస్ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. 


ఒక గ్రామంలోని ముగ్గురు నిర్లక్ష్యపు స్నేహితులు తమ తల్లిదండ్రులు తిడుతున్నప్పటికీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తుంటారు. ఆ ముగ్గురూ ఫేమస్  పదాన్ని తరుచుగా వాడుతుంటారు. వారు ఫేమస్ కాదు ఫేమస్ చేయమని చెబుతుంటారు. టార్న్ జీన్స్ ఎపిసోడ్,13వ రోజు వేడుక , ఒక ఫంక్షన్‌లో ఫోటోగ్రాఫ్‌లకు పోజులివ్వడం టీజర్‌లోని వినోదాత్మకంగా వున్నాయి. మేమ్ ఫేమస్ నాన్ స్టాప్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోందని వీడియో భరోసా ఇస్తుంది  సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి ముగ్గురు స్నేహితులుగా నవ్వులు పూయించారు. సినిమాకి దర్శకత్వం వహించిన సుమంత్ ప్రభాస్ వినోదానికి తగినంత స్కోప్ ఉన్న సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా, కళ్యాణ్ నాయక్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఫన్ ని ఎలివేట్ చేశాడు.  


టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంత్రిమల్లా రెడ్డి మాట్లాడుతూ.. సుమంత్ ప్రభాస్ చాలా స్మార్ట్ వున్నాడు. తను తెలంగాణ ప్రభాస్. మంచి కంటెన్ వున్న సినిమాలు ఇవ్వడంలో ఛాయ్ బిస్కట్ చాలా ఫేమస్. నిర్మాతలు అనురాగ్ శరత్ చాలా మంచి అభిరుచి వున్న నిర్మాతలు. ఫేమస్ కావాలంటే కష్టపడాలి. యువత కష్టపడే తత్వాన్ని అలవరుచుకోవాలి. పాలు అమ్ముకునే నేను ఈ రోజు మంత్రినయ్యా. లక్షలాది విద్యార్ధులని తీర్చిదిద్దుతున్న. కష్టపడితే ఆటోమేటిక్ గా ఫేమస్ అవుతాం. ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా వుంది. సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందిఅన్నారు.

  
సుహాస్ మాట్లాడుతూ.. మేమ్ ఫేమస్ ట్రైలర్ చూశాను. అదిరిపోయింది. సినిమా అదిరిపోతుంది. చాలా జెన్యున్ గా తీసిన సినిమా ఇది. అందరూ జూన్ 2న థియేటర్ కి వచ్చి మా టీం అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. 


సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. కాలేజీలో వున్నపుడు సరదాగా పిల్ల పిల్లగా అనే వెబ్ సిరిస్ చేశాం. అప్పుడు మాకు 19 ఏళ్ళు. అప్పుడు సినిమాలకి రావాలనే ఆలోచనే లేదు. డిగ్రీ పరీక్షల తర్వాత ఎస్సై టెస్ట్ కి ప్రిపేర్ అవుదామని అనుకున్న సమయంలో అనురాగ్ అన్న నుంచి కాల్ వచ్చింది. అది నా జీవితాన్ని మార్చింది.  మా దగ్గర ఎనర్జీ వుండేది. కానీ డైరెక్షన్ మాత్రం చాయ్ బిస్కెట్ వలనే వచ్చింది. మేము చూసిన సినిమా షూటింగ్ కూడా మా సినిమా షూటింగ్ నే.  మేము సినిమా చేయగలమనే నమ్మకాన్ని ఇచ్చింది అనురాగ్ , శరత్ అన్న. వారికి జీవితాంతం రుణపడి వుంటాను.  టీజర్ మీ అందరికి నచ్చడం ఆనందంగా వుంది. జూన్ 2న మంచిగా కుదిరిన మటన్ లాంటి రుచికరమైన సినిమా చూపిస్తాం అన్నారు.

  
అనురాగ్ మాట్లాడుతూ.. రైటర్ పద్మ భూషణ్ ని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మీ ఆదరణ గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మరిన్ని మంచి సినిమాలు చేయడానికి నమకాన్ని ఇచ్చింది. అథితి దేవో భవ అనే మాట వుంది. రైటర్ పద్మభూషణ్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రేక్షక దేవో భవ అని ఫిక్స్ అయిపోయాను.  మేమ్ ఫేమస్ సినిమాకి కూడా ఇలానే ఆదరిస్తానే నమ్మకం వుంది.  సుమంత్ ప్రభాస్ పాజిటివ్  పర్శన్.  సుమంత్ ప్రభాస్ లాంటి తమ్ముడు వుండాలని అందరూ కోరుకుంటారు. ఈ సినిమాని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. శరత్ మాట్లాడుతూ.. టీజర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన మల్లా రెడ్డిగారికి కృతజ్ఞతలు. కంటెంట్, యువ ప్రతిభని ప్రోత్సహించాలని ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాం. కొత్త దర్శకుడితో తీసిన రైటర్ పద్మ భూషణ్ పెద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మేమ్ ఫేమస్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్ లో మజా వస్తుంది. 


చంద్రు మనోహర్ మాట్లాడుతూ.. అనురాగ్ శరత్ త కలసి పని చేయడం అనందంగా వుంది. ఇదీ బ్లాక్ బస్టర్ కొడతాంఅన్నారు. 


ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ అంత పాల్గొంది. ఈ చిత్రానికి సృజన అడుసుమిల్లి ఎడిటర్, అరవింద్ మూలి ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మరోసారి అనౌన్స్ చేశారు.  


తారాగణం: 
సుమంత్ ప్రభాస్,మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్ 


సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సుమంత్ ప్రభాస్, నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ బ్యానర్లు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్ సంగీతం: కళ్యాణ్ నాయకి డివోపీ: శ్యామ్ దూపాటి ఎడిటర్: సృజన అడుసుమిల్లి ఆర్ట్ : అరవింద్ మూలి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యుసర్ : సూర్య చౌదరి పీఆర్వో: వంశీ-శేఖర్ క్రియేటివ్ ప్రోడ్యుసర్స్: ఉదయ్-మనోజ్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !