View

లైకా చేతికి ‘మిషన్: చాప్ట‌ర్ 1’

Monday,April03rd,2023, 03:50 PM

భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను రూపొందిస్తూ వ‌రుస స‌క్సెస్‌ల‌ను సొంతం చేసుకుంటున్నారు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ అధినేత సుభాస్క‌రన్‌. సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోనూ త‌న‌దైన పంథాలో ఈ సంస్థ రాణిస్తోంది. ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని అంశాల‌తో వైవిధ్యమైన క‌థాంశాలున్న‌ సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. కోలీవుడ్ హీరో అరుణ్ విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘మిషన్:  చాప్ట‌ర్ 1’  తాజాగా లైకా ప్రొడక్ష‌న్స్ నుంచి రాబోతున్న‌క్రేజీ చిత్రాల సినిమాల లిస్టులో చేరింది.  ఈ చిత్రానికి ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మాత‌లు.


సినీ ఇండ‌స్ట్రీలో దిగ్గ‌జ చిత్రాలుగా అంద‌రి ఆద‌రాభిమానాల‌ను పొందిన 2.0, పొన్నియిన్ సెల్వ‌న్, ఇండియన్ 2 వంటి చిత్రాలు స‌హా ఎన్నో భారీ చిత్రాల‌ను లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ‘మిషన్:  చాప్ట‌ర్ 1’ సినిమాను విశ్లేషించి ఒక ప‌రిమిత‌మైన హ‌ద్దుల‌ని లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని భావించింది లైకా టీమ్‌. ఈ క్ర‌మంలో భాషా ప‌ర‌మైన హ‌ద్దుల‌ను ఈ సినిమా దాటుతుంద‌ని లైకా ప్ర‌తినిధులు భావించారు. దీంతో లైకా సంస్థ 'మిషన్:  చాప్ట‌ర్ 1’ చిత్రాన్ని నాలుగు భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల‌ చేయ‌టానికి సిద్ధ‌మైంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌, ఆడియో, థియేట్రిక‌ల్ రిలీజ్‌కి సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు నిర్మాత‌లు.


విల‌క్ష‌ణ‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించే  ప్ర‌తిభ ఉన్న ద‌ర్శ‌కుడు విజ‌య్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆయ‌న‌ చిత్ర నిర్మాణంలోని ప‌లు విభాగాల‌తో పాటు ప్ర‌జ‌ల అభిరుచుల‌ను ఆధారంగా చేసుకుని సినిమాల‌ను రూపొందిస్తుంటారు.  ‘మిషన్:  చాప్ట‌ర్ 1’ చిత్రాన్ని కేవ‌లం 70 రోజుల్లో లండ‌న్‌, చెన్నై స‌హా ప‌లు లొకేష‌న్స్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌రించటం గొప్ప విష‌యం.


అద్భుత‌మైన టెక్నిక‌ల్ అంశాల‌తో రూపొందిన ‘మిషన్:  చాప్ట‌ర్ 1’ చిత్రం హీరో అరుణ్ విజ‌య్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతుంద‌న‌టంలో సందేహం లేదు. చాలా గ్యాప్ త‌ర్వాత.. 2.0లో న‌టించి అలరించిన ముద్దుగుమ్మ‌ ఎమీ జాక్స‌న్ ఈ చిత్రంతో సినిమాల్లో అడుగు పెడుతున్నారు. జైలును సంర‌క్షించే ఆఫీస‌ర్ పాత్ర‌లో ఆమె క‌నిపించ‌నున్నారు. మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన  విల‌క్ష‌ణ న‌టి నిమిషా స‌జ‌య‌న్ ఈ మూవీలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. జి.వి.ప్ర‌కాష్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యాన్ని వ‌హిస్తున్నారు.


ఈ సినిమా కోసం లండ‌న్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీగా ఖ‌ర్చుతో ఓ జైలు సెట్ వేశారు. స్టంట్ సిల్వ ఈ చిత్రానికి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఆయ‌న యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాను చూసే ప్రేక్ష‌కుల‌కు ఆహా అనిపిస్తాయి. ఈ సినిమాలో చిత్రీక‌రించిన నైట్ షాట్స్‌, డ్రామా ప్రేక్ష‌కుల‌ను ఉత్కంఠ‌త‌కు లోను చేస్తుంది.
యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ఎంత క‌ష్ట‌మున్నప్ప‌టికీ  హీరో అరుణ్ విజ‌య్ వెన‌క‌డుగు వేయ‌లేదు. ఆయ‌నే స్వ‌యంగా ఆ స‌న్నివేశాల్లో న‌టించారు. దీంతో యాక్ష‌న్ స‌న్నివేశాలు రియలిస్టిక్‌గా వ‌చ్చాయి. ఈ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తాయి.


*న‌టీన‌టులు:*  
అరుణ్ విజ‌య్‌, ఎమీ జాక్స‌న్‌, నిమిషా స‌జ‌య‌న్‌, అబి హాస‌న్‌, భ‌ర‌త్ బొప‌న్న‌, బేబి ఇయ‌ల్‌, విరాజ్ ఎస్‌, జాస‌న్ షా


*సాంకేతిక‌వ‌ర్గం:*
ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌: జికెఎం త‌మిళ్ కుమర‌న్‌, నిర్మాత - సుభాస్క‌ర‌న్‌, ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి, కో ప్రొడ్యూస‌ర్‌: సూర్య వంశీ ప్ర‌సాద్ కోత‌, జీవ‌న్ కోత‌, మ్యూజిక్‌: జి.వి.ప్ర‌కాష్ కుమార్‌, స్క్రిప్ట్‌, స్క్రీన్ ప్లే:  ఎ.మ‌హ‌దేవ్‌, డైలాగ్స్‌: విజ‌య్‌, సినిమాటోగ్ర‌ఫీ: సందీప్ కె.విజ‌య్‌, ఎడిట‌ర్‌: ఆంథోని, స్టంట్స్ సిల్వ‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌: శ‌ర‌వ‌ణ‌న్ వ‌సంత్‌, కాస్ట్యూమ్స్ : రుచి మునోత్‌, మేక‌ప్‌: ప‌ట్టనం ర‌షీద్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వి.గ‌ణేష్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె.మ‌ణి వ‌ర్మ‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్ (యుకె):  శివ కుమార్‌, శివ శ‌ర‌వ‌ణ‌న్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ :  మ‌నోజ్ కుమార్‌.కె, కాస్ట్యూమ‌ర్‌: మొడేప‌ల్లి ర‌మ‌ణ‌, సౌండ్ డిజైన్‌: ఎం.ఆర్‌.రాజ‌శేఖ‌ర‌న్‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:  డినోట్‌, స్టిల్స్‌: ఆర్‌.ఎస్‌.రాజా, ప్రమోష‌న్‌, స్ట్రాట‌జీస్‌: షియం జాక్‌, పి.ఆర్‌.ఒ:  నాయుడు సురేంద్ర కుమార్ , ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  ప్ర‌తూల్ ఎన్‌.టి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !