View

బేబీ సాంగ్ కు ప్రశంసల జల్లు

Tuesday,April04th,2023, 04:01 PM

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’.ఈ చిత్రం నుంచి గతంలో విడుదల చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ రిలికల్ సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్. మొదటి పాటకు పూర్తి భిన్నంగా ఉంటూనే మరో బ్యూటిఫుల్ సాంగ్ అనిపించుకుంది. విడుదలైన వెంటనే ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఈ పాటను మళయాలంలో మోస్ట్ ఫేమస్ సింగర్ గా పేరు తెచ్చుకున్న ఆర్య దయాళ్ చేత పాడించారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ గీతాన్ని అభినందించడానికి టాలీవుడ్ లోని ప్రముఖ సంగీత దర్శకులు, సింగెర్స్ వచ్చారు. ఎఫ్ హౌస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నాటి, నేటి సంగీత దర్శకులు  ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


ఈ సందర్బంగా ఈ పాటను పాడిన ఆర్య దయాళ్ మాట్లాడుతూ.. " ఈ పాటను రికార్డింగ్ చేస్తున్నప్పుడు చాల ఛాలెంజిన్గ్ గా ఉంది. పాటలో చాల స్వరాలూ ఉన్నాయి. ఎక్కువగా ప్రిపేర్ కాకుండానే పాడాల్సి వచ్చింది. రికార్డింగ్ టైమ్ లో స్టూడియో కేవలం పదిమంది మాత్రమే ఉన్నారు. వాళ్లంతా నన్ను బాగా ఎంకరేజ్ చేసారు. ఈ జర్నీ పార్ట్ అయినా ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెబుతున్నాను.. " అన్నారు. 

 

అనంతరం వేదిక పై మరోసారి ఈ గీతాన్ని లైవ్ లో ఆలపించింది ఆర్య దయాల్.


ఈ సందర్బంగా ఈ లైవ్ కార్యక్రమానికి హాజరైన సీనియర్ సంగీత దర్శకులు రాజ్, కోటి, ఆర్.పి పట్నాయక్, ఏం ఏం శ్రీలేఖ, భీమ్స్,మార్క్ కే రాబిన్, ప్రశాంత్ ఆర్ విహారి,చైతన్ భరద్వాజ్, కమ్రాన్,  తో పాటు పలువురు సంగీత దర్శకులు మాట్లాడుతూ .. " స్వరకర్త విజయ్ అద్భుతమైన కంపోసింగ్ చేసాడు. ఫస్ట్ సాంగ్ కంటే కూడా బావుంది. సింగర్ ఆర్య దయాల్ తెలుగు అమ్మాయి కాకపోయినా గొప్ప కమాండింగ్ గా పాడింది. తనకు తెలుగులో మంచి భవిష్యత్ ఉండబోతోంది. కంపోసింగ్ రేర్ గా ఉంది. విజయ్ స్వర రచన లో ఒక లైఫ్ ఉంటుంది.. అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.. ".


దర్శకుడు మారుతీ మాట్లాడుతూ " ఈ కార్యక్రమానికి రాజ్ కోటి గార్లు రావడం హ్యాపీగా ఉంది. ఆ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ చూద్దాం అదృష్టం అనుకుంటున్నా. ఒక చిన్న సినిమాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి మా మాస్ మూవీస్ బ్యానర్ తరపు నుంచి థాంక్స్ చెబుతున్నాను. ఈ పాట ఆల్రెడీ సూపర్ హిట్ అయింది. సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.. " అన్నారు.


చిత్ర దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ .. " ఈ పాట ట్యూన్ కూడా కట్టక ముందే ఈ పాటను ఆర్య దయాల్ తోనే పాడించాలని అనుకున్నాం. ఈ పాట తనకోసమే పుట్టింది. ఆమె తోలి తెలుగు పాటను నా సినిమాలో పాడించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాటను కళ్యాణ్ చక్రవర్తిగారు చాల గొప్పగా రాసారు. అద్భుతమైన పద ప్రయోగాలు చేసారు.


గీత రచయిత కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ..  " ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. చిన్నప్పటి నుంచి మీ ఇన్స్పిరేషన్ తోనే పరిశ్రమలోకి వచ్చాం. ఏ గేయ రచయితా అయినా దర్శకుడి సంస్కారాన్ని బట్టే సాహిత్య ఉంటుంది. ఈ పాటను కృష్ణ చైతన్య గారు రాయాలి. కానీ ఆయన నా పేరు సజెస్ట్ చేసారు. ఈ సందర్బంగా కృష్ణ చైతన్య సంస్కారానికి ధన్యవాదాలు చెబుతున్నాను.. " అన్నారు.


సంగీత దర్శకుడు విజయ్ మాట్లాడుతూ .. " ఇంతమంది సంగీత దర్శకులు రావడం చాల సంతోషంగా ఉంది. ఇంత ప్రమోషన్ చేస్తున్నందుకు దర్శక, నిర్మాతకు ధన్యవాదాలు. ఈ పాటను గొప్పగా పాడిన ఆర్య దయాల్ కు థాంక్స్.. " అన్నారు.


హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ .. " ఇక్కడ చాల టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. ఒక కాలికేటెడ్ సీన్ చేస్తున్నప్పుడు ఒక ట్యూన్ పంపించారు. ఆ ట్యూన్ విన్న వెంటనే సీన్ చాల ఈజీ అయిపొయింది. ప్రతి విషయాన్నీ దర్శకుడు సాయి రాజేష్ మాతో పంచుకుంటారు. ఈ సందర్బంగా అందరికీ థాంక్స్ చెబుతున్నాను .. " అన్నారు.


హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ " ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ థాంక్స్. మేము షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సీన్ మూడ్ లోకి వెళ్లాలంటే సాయి గారు ఒక ట్యూన్ ఇచ్చేవారు. సాడ్ సీన్ అయినా జాలీ సీన్ అయినా అది మాకు బాగా హెల్ప్ అయ్యేది.. " అన్నారు.


మరో హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ .. "ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన అందరికీ థాంక్స్ చెబుతున్నాను. ఈ పాట మీ అందరికీ నచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ పాట అందరి ఫేవరెట్ ప్లే లిస్ట్ లో ఫస్ట్ లు ఉంటుంది. మా దర్శకుకు సాయి రాజేష్ గారి తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ వల్లే సాధ్యం అయిందనుకుంటున్నాను.. " అన్నారు.


నిర్మాత ఎస్.కే.ఎన్ మాట్లాడుతూ .. " నా చిన్నప్పటి నుంచి ఫేవరెట్ అయినా రాజ్ కోటి గారిని ఒకే ఫ్రేమ్ లో అదీ నా ఫంక్షన్ లో చూడటం అదృష్టాంగా భావిస్తున్నాను. ఒక జెనరేషన్ నుంచి మరో జెనరేషన్ కి డిఫరెన్స్ తెలిపేది సంగీతం సాహిత్యమే. ఆ సంస్కృతికి వారథులైన మీ అందరినీ సారథులుగా భావిస్తున్నాను. కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ పాటను సాయి రాజేష్ టేస్ట్ కు తగ్గట్టుగా అద్భుతంగా రాసారు. ఓ మలయాళ సింగర్ ఇంత గొప్పగా పాడటం హ్యాపీగా ఉంది. ఈ పాట ఇప్పుడు ప్రమోషన్ కోసం కాదు.. ఇది మా ఎమోషన్.." అన్నారు.


హృదయ కాలేయం, కలర్ ఫోటో, కొబ్బరిమట్ట చిత్రాలతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మించిన చిత్రం ఇది..


ఇక త్వరలోనే విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీష తదితరులు నటించారు.


టెక్నీకల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రానికి సంగీతంః విజయ్ బుల్గానిన్, ఎడిటింగ్ః విప్లవ్ నైషధం, సినిమాటోగ్రఫీః ఎమ్ఎన్ బాల్ రెడ్డి, పి.ఆర్.వోః ఏలూరు శీను, జిఎస్.కే మీడియా, కో ప్రొడ్యూసర్ః ధీరజ్ మొగిలినేని, నిర్మాతః ఎస్.కే.ఎన్, రచన, దర్శకత్వంః సాయి రాజేశ్.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !