View

అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘రంగమ్మ’ విడుదల

Thursday,April06th,2023, 03:53 PM

పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి వైవిధ్యమైన సినిమాలతో అభిరుచిని చాటుకున్న బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో వస్తోన్న 6వ చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ఇచ్చట అందమైన ఫోటోస్ తీయబడును అనేది ఉపశీర్షిక. 30వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా, లావణ్య హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా ఇది. గతంలో విడుదలైన ఈ మూవీ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను నటుడు ప్రియదర్శి చేతుల మీదుగా విడుదల చేశారు. శ్రీనివాస మౌళి రాసిన ఈ గీతాన్ని ఎస్పీ చరణ్ ఆలపించాడు. కథా నేపథ్యాన్ని బట్టి 80ల నాటి రెట్రో మ్యూజిక్ ను గుర్తు చేసేలా కంపోజింగ్, ట్యూన్ కనిపిస్తున్నాయి. ఆ కాలంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను గుర్తుకు తెచ్చేలా చరణ్ అద్భుతంగా పాడారు ఈ గీతాన్ని. ‘కంటిచూపు నిన్నే దాటి పోనంటోందమ్మా.. కొంటె ఆశలేవో రేగి అదిరిందే బొమ్మ.. మంటే పెట్టావమ్మా.. మందేపూశావమ్మా.. గుండె కాజేసి జెడ గంటె కట్టావమ్మా.. రంగమ్మా’ అంటూ ఈ లిరిక్స్ కాస్త ఫన్నీగా ఉన్నా.. రెట్రో స్టైల్ పిక్చరైజేషన్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంది.


ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘ఈ పాట నా చేతుల మీదుగా విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఈ పాట చాలా బావుంది. అంతకంటే ఈ సినిమా టీమ్ అందరితో పదేళ్లుగా పరిచయం ఉంది. చైతన్య, నేను ఒకేసారి స్టార్ట్ అయ్యాం. ఇలాంటి మంచి కథలు ఎంచుకుంటున్నందుకు చైతన్యకు ఆల్ ద బెస్ట్. అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఇచ్చట మంచి ఫోటోలే కాదు.. మంచి సినిమాలు కూడా తీయబడతాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ’ అన్నారు.
హీరో చైతన్య రావు మాట్లాడుతూ.. ‘బలగం పెద్ద విజయం సాధించినందుకు ప్రియదర్శికి కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నాను. నా సినిమానే విజయం సాధించినంత ఆనందపడ్డాను. ఇవాళ నా మూవీ అన్నపూర్ణ ఫోటో స్టూడియో నుంచి రంగమ్మ పాట విడుదల చేసినందుకు ప్రియదర్శికి థ్యాంక్యూ సోమచ్. ఇక ఈ రంగమ్మ పాట నాకు చాలా ఫేవరెట్ సాంగ్. ప్రిన్స్ హెన్రీ ట్యూన్ ఇచ్చినప్పటి నుంచి చాలామంది ఈ పాటతో ప్రేమలో పడిపోయాం. ఎయిటీస్ బ్యాక్ డ్రాప్ కు తగ్గట్టుగా కంపోజింగ్, లిరక్స్ అన్నీ క్యాచీగా ఉన్నాయి. మీ అందరికీ కూడా ఈ పాట నచ్చుతుందనుకుంటున్నాను. బిగ్ బెన్ పిక్చర్స్ నుంచి వస్తోన్న ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ ను మరింత పెచుతూ.. త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాం.. ’అన్నారు.


సంగీత దర్శకుడు ప్రిన్స్ హెన్రీ మాట్లాడుతూ.. ‘ఈ పాటను విడుదల చేయడానికి వచ్చిన ప్రియదర్శికి థ్యాంక్స్ యూ సో మచ్. దర్శకుడి టేస్ట్ కు తగ్గట్టుగా.. సినిమా నేపథ్యానికి అనుగుణంగా ఈ పాటను రెట్రో స్టైల్ ను గుర్తు చేస్తూ కంపోజ్ చేయడం జరిగింది. ఈ ట్యూన్ విన్న తర్వాత సింగర్ ఎస్పీ చరణ్ గారు మెచ్చుకోవడం మర్చిపోలేను. మీకు ఈ పాట నచ్చుతుందని ఆశిస్తున్నాను.. ’అన్నారు.


లిరిసిస్ట్ శ్రీనివాస మౌళి మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో నుంచి రంగమ్మా అనే పాటను నేను రాశాను. ఈ పాట రాస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ప్రిన్స్ హెన్రీ మంచి కంపోజింగ్ చేశారు. దర్శకుడు చెందు దగ్గరుండి మరీ ఈ పాట రాయించుకున్నారు. ఈ పాటకు సంబంధించి నాకు మరో స్పెషల్ ఎస్పీ చరణ్ గారు పాడటం. ఈ పాట మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ.. థ్యాంక్యూ.. ’ అన్నారు.


నిర్మాత యశ్ రంగినేని మాట్లాడుతూ .. ‘ఈ రోజు మా బిగ్ బ్యానర్ లో రూపొందిన అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఫస్ట్ లిరికల్ సాంగ్ రంగమ్మా పాట విడుదలైంది. ఈ పాటను విడుదల చేసినందుకు ప్రియదర్శికి బిగ్ థ్యాంక్స్. ఎస్పీ చరణ్ గారు చాలా బాగా పాడారు. తను బాగా ఎంజాయ్ చేస్తూ పాడాను అని చెప్పారు. శ్రీనివాస్ మౌళి గమ్మత్తైన పదజాలంతో అందించిన లిరిక్స్ చాలా బావున్నాయి. బీట్ పరంగా ఎనభైల్లోని ఆర్డీ బర్మన్, బప్పీ లాహిరి తరహా రిథమ్ కనిపిస్తుంది. ఈ పాట సినిమాలో చాలా ఇంపార్టెంట్ టైమ్ లో వస్తుంది. మీ అందరికీ కూడా ఈ పాట బాగా నచ్చుతుందని ఆశిస్తూ.. మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.. ’ అన్నారు.


దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. ‘చాలా బిజీగా ఉన్నా మా పాట లాంచ్ చేయడానికి వచ్చిన ప్రియదర్శికి థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే బలగం సక్సెస్ అయినందుకు కంగ్రాట్యులేషన్స్. పాట గురించి చెబితే.. రంగమ్మా అనేది మా యూనిట్ మొత్తానికి ఫేవరెట్ సాంగ్. ప్రిన్స్ హెన్రీ ఈ పాటను చాలా స్పెషల్ గా డిజైన్ చేశాడు. సౌండింగ్ కొత్తగా ఉంటుంది. సినిమాలో కూడా ఒక మంచి సిట్యుయేషన్ లో వస్తుంది. ఈ పాట మాస్ తో పాటు పబ్బుల్లో కూడా మోత మోగుతుందనుకుంటున్నాను. రెట్రో ఫీలింగ్ ఇస్తూనే.. ఇప్పటి జెనరేషన్ కు కూడా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. మీ అందరికీ ఈ పాట నచ్చుతుందనుకుంటున్నాను. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత యశ్ రంగినేని గారికి థ్యాంక్స్..’అన్నారు.


షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోన్న అన్నపూర్ణ ఫోటో స్టూడియో చిత్రంలో


నటీనటులు : చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు


సాంకేతిక నిపుణులు : సంగీతం - ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రఫీ - పంకజ్ తొట్టాడ, ఎడిటర్ - డి వెంకట్ ప్రభు, పీఆర్వో - జీఎస్కే మీడియా, బ్యానర్ -బిగ్ బెన్ సినిమాస్, నిర్మాత - యష్ రంగినేని, రచన దర్శకత్వం - చెందు ముద్దు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !