View

భారతీయన్స్ ను తప్పకుండా చూడాలి

Sunday,April16th,2023, 02:18 PM

నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్గాస్ హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన సినిమా 'భారతీయన్స్'. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. ప్రముఖ రచయిత - ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా" ఫేమ్) ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ రాజకీయవేత్త - భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ఉదయం ప్రసాద్ లాబ్స్‌లో ప్రత్యేకంగా వీక్షించారు. ప్రీమియర్ అనంతరం చాలా మంచి సినిమా తీశారని చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను ప్రోత్సహించాలన్నారు.  

 

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ''దేశ సమైక్యత, భారతీయ సైనికుల వీరగాథ గురించి ఇటువంటి మంచి దేశభక్తి సినిమా తీయడం అభినందనీయం. దర్శక నిర్మాతలు యువతకు చక్కటి సినిమా అందిస్తున్నారు. చాలా సంతోషం. దేశభక్తి చిత్రాలను యువత, ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.  


తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు, ప్రముఖ దర్శక - నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ ''నేను ఇంతకు ముందు సినిమా చూశా. వెంకయ్య నాయుడు గారు చూస్తున్నారని తెలిసి మళ్లీ వచ్చా. దేశంలోని గొప్ప నాయకులలో ఆయన ఒకరు. సమాజానికి, మన దేశానికి ఉపయోగపడే కంటెంట్ ఉంటేనే సినిమాలను ప్రోత్సహించడానికి వస్తారు. ఆయన సినిమా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దర్శక నిర్మాతల్లో ఎంతో దేశభక్తి ఉంటేనే ఇటువంటి సినిమాలు వస్తాయి. శంకర్ గారు తన ఫ్రెండ్ దీన్ రాజ్ మీద నమ్మకం, దేశభక్తితో సినిమా తీశారు. మంచి కాన్సెప్ట్ ఇది. తప్పకుండా ప్రేక్షకులు అందరూ సినిమా చూడాలి'' అని అన్నారు.   


నిర్మాత డా. శంకర్ నాయుడు అడుసుమిల్లి మాట్లాడుతూ ''సినిమా చూసి మమ్మల్ని అభినందించిన వెంకయ్య నాయుడు గారికి థాంక్స్. ఆయన మాటలు మాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. నా దృష్టిలో ప్రతి భారతీయుడు రియల్ హీరో. సామాన్య స్త్రీ మదర్ ఆఫ్ ఇండియా. భారతీయులు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న ఫిలాసఫీని 'భారతీయన్స్' ద్వారా గుర్తు చేస్తున్నాం. మా చిత్ర బృందం రెండేళ్లు కష్టపడి సినిమా తీశారు. నటీనటులు అందరూ బాగా చేశారు. ఇది పాన్ ఇండియా సినిమా. మేలో అన్ని భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాం'' అని అన్నారు. 


దర్శకుడు దీనరాజ్ మాట్లాడుతూ ''బిజీ షెడ్యూల్ అయినా వెంకయ్య నాయుడు గారు సినిమా చూసి మమ్మల్ని అప్రిషియేట్ చేయడం ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దర్శకుడిగా నాకు మొదటి సినిమా ఇది. దీని కంటే ముందు పలు చిత్రాలకు రచయితగా పని చేశా. 'కలిసుందాం రా', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'ప్రేమించుకుందాం రా' తదితర హిట్ సినిమాలకు వర్క్ చేశా. దేశభక్తి సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఈ కథ రాశా. మా నిర్మాతకు కూడా దేశభక్తి ఎక్కువ. శంకర్ గారు అమెరికాలో డాక్టర్. కథ నచ్చి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి వచ్చారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని గుర్తు చేసే, పెంపొందించే చిత్రమిది. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి.  ఫ్యామిలీ అంతా కలిసి చూదాల్సిన సినిమా'' అని అన్నారు. 


హీరోలలో ఒకరైన నీరోజ్ మాట్లాడుతూ ''హీరోగా నాకు ఫస్ట్ సినిమా ఇది. అవకాశం ఇచ్చిన నిర్మాత శంకర్ గారికి, దర్శకులు దీన్ రాజ్ గారికి థాంక్స్. ఆడిషన్ చేసి నన్ను సెలెక్ట్ చేశారు. సినిమా మొత్తం అవుట్ డోర్ షూట్ చేశాం. దీన్ రాజ్ గారు చాలా చక్కగా తెరకెక్కించారు'' అని చెప్పారు. 


హీరోయిన్లలో ఒకరైన సమైరా సందు మాట్లాడుతూ ''తెలుగులో నాకు ఫస్ట్ సినిమా ఇది. హీరోయిన్‌గా మూడో సినిమా. నేను పంజాబీ అమ్మాయిని. సినిమాలో కూడా పంజాబీ అమ్మాయి రోల్ చేశా. దేశభక్తి సినిమాలో నటించడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు. 


నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్ధాస్, సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు పి.ఆర్. ఓ: ధీరజ్ - అప్పాజీ ఫైట్స్ : జూడో రాము, ఎడిటర్ : శివ సర్వాణి, సినిమాటోగ్రఫీ : జయపాల్ రెడ్డి నిమ్మల, మ్యూజిక్ : సత్య కశ్యప్ & కపిల్ కుమార్, ప్రొడ్యూసర్ : డా. శంకర్ నాయుడు అడుసుమిల్లి, డైరెక్టర్ : దీన్ రాజ్!!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !