View

అందరికీ నచ్చే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రామబాణం

Wednesday,April26th,2023, 03:18 PM

'లక్ష్యం', 'లౌక్యం' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.


ప్రెస్ మీట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చిన విశ్వప్రసాద్ గారికి, వివేక్ కూచిభొట్ల గారికి కృతజ్ఞతలు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చి సినిమాని గ్రాండ్ గా నిర్మించారు. శ్రీవాస్ గారితో 'లక్ష్యం', 'లౌక్యం' చేశాను. మూడో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు 'లక్ష్యం', 'లౌక్యం' లా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలని అనుకున్నాం. అప్పుడు భూపతి రాజా గారి దగ్గర వున్న కథ విన్నప్పుడు చాలా నచ్చింది. మధు, అబ్బూరి రవి గారు కూడా ఈ కథకు చాలా హెల్ప్ చేశారు. డింపుల్ చాలా చక్కగా నటించింది. తనకి మంచి భవిష్యత్ వుంటుంది. మిక్కీ జే మేయర్ తో చేయడం ఇదే మొదటిసారి. చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 5న రామబాణం విడుదలౌతుంది. అందరూ థియేటర్ కి వెళ్లి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది’’ అన్నారు.


దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. గోపీచంద్ గారు నేను సినిమా చేస్తున్నామని తెలిసినప్పటి నుంచి హ్యాట్రిక్ కాంబో అనే పాజిటివ్ వైబ్ అందరి నుంచి వచ్చింది. అది మాకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చింది. అలాగే 'లక్ష్యం', 'లౌక్యం' కు మించి సినిమా ఉండాలనే కాన్సియస్ ని కూడా ఇచ్చింది. స్క్రిప్ట్ వర్క్, హార్డ్ వర్క్, టీం వర్క్ అన్నీ కలిపి రామబాణం ఎక్స్ టార్డినరీగా వచ్చింది. ఈ సినిమా అవుట్ పుట్ చూశాక చాలా నమ్మకంగా అనిపిచింది. రామబాణంను ఇంత గ్రాండ్ స్కేల్ లో చేయడానికి పూర్తి సహకారం అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి కృతజ్ఞతలు. డీవోపీ వెట్రి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. గోపీచంద్ గారి ఫ్యాన్స్ కి కావాల్సిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కొత్తగా వుంటాయి. ఆర్ట్ వర్క్ కూడా చాలా అద్భుతంగా కుదిరింది. అన్ని జాగ్రత్తలు తీసుకొని గ్రాండ్ గా చేశాం. చాలా ఎక్సయిటింగ్ ఎపిసోడ్స్ వున్నాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలెట్ అవుతాయి. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ గొప్పగా కనెక్ట్ అవుతాయి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఆల్రెడీ విజయం సాధించింది. నేపధ్య సంగీతం కూడా హైలెట్ గా వుంటుంది. ప్రవీణ్ పూడి క్రిస్ప్ గా ఎడిట్ చేశారు. మధు మంచి డైలాగ్స్ రాశారు. భూపతి రాజా గారు అద్భుతమైన కథ ఇచ్చారు. డింపుల్ పాత్ర చాలా కీలకం. చాలా బ్యూటీఫుల్ గా చేసింది. కుష్బూ గారు, గోపీచంద్ గారి మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ కట్టిపడేస్తాయి. అలాగే జగపతి బాబు గారి పాత్ర కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా కుదిరిన సినిమా రామబాణం. మే 5న ఫ్యామిలీ తో కలసి థియేటర్ లో సరదాగా ఎంజాయ్ చేసి రావచ్చు . ఈ సమ్మర్ కి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రామబాణం అలరిస్తుంది’’ అన్నారు


డింపుల్ హయతి మాట్లాడుతూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో, గోపీచంద్ గారు, శ్రీవాస్‌ గారి హ్యాట్రిక్ మూవీ రామబాణంలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో భైరవి అనే పాత్రలో కనిపిస్తాను. ఆ పాత్ర మీ అందరినకీ నచ్చుతుందని నమ్ముతున్నాను. మే 5న అందరూ సినిమా చూడాలి’’ అని కోరారు.


వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. ఈ వేసవిలో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా. గోపీచంద్ గారి యాక్షన్ ని ఇష్టపడే ప్రేక్షకులకు కూడా రామబాణం ఒక పండగలా వుంటుంది. గోపీచంద్ గారికి, శ్రీవాస్ గారికి కృతజ్ఞతలు. మిక్కీ జే మేయర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీం అందరికీ కృతజ్ఞతలు. రామబాణం ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు.


మధు మాట్లాడుతూ.. ఓ కొత్త కాన్ఫిఫ్లిక్ట్ తో వచ్చిన అన్నదమ్ముల కథ రామబాణం. ఈ సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా కుదిరాయి. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మే 5న అందరూ థియేటర్ లో ఎంజాయ్ చేయండి’’ అన్నారు.

 

Ramabanam, produced by People Media Factory, directed by Sriwass, is all set to hit the screens on May 5. The film features Gopichand, Jagapathi Babu, Dimple Hayathi, Khushbu, Khushbu, Sachin Khedekar, Nasser, Ali, Raja Ravindra, Vennela Kishore, Saptagiri, Kashi Vishwanath, Satya, Getup Srinu, Sameer, and Tarun Arora. With a promise to offer a wholesome cinematic experience, the film has all the essential commercial ingredients, with music by Mickey J Meyer.
Ahead of its release, the team came together for a press meet today. “I thank the producers for okaying this script and making it on a huge scale. After Loukyam and Lakshyam, we were keen on working on a family entertainer and both of us liked Bhupathi Raja’s story immensely. Madhu, Abburi Ravi chipped in with the script and Dimple Hayathi did a fantastic job. We’re thrilled with the response for the songs, we’ll meet you in theatres,” Gopichand said.


“Many are eager to see me and Gopichand team up on a film again and it gave us all the necessary motivation. We’re confident of giving audiences something better than Lakshyam and Loukyam and it was possible only because of the script and the hard work of the team. People Media Factory spent lavishly on the film. The interval and climax are the major highlights. The second half will be a feast for family audiences. I thank the cinematographer, and art director,” Sriwass shared.


“The songs and the background score are an asset to the film which has great dialogues and a terrific story by Bhupathi Raja. Prawin Pudi’s crisp edits helped the film. Dimple Hayathi plays a substantial role in the film and Khushbu-Gopichand’s emotional scenes are true tear-jerkers. Jagapathi Babu has performed well too. The film is a proper mix of entertainment, sentiment and action and it’ll entertain family audiences,” the filmmaker added.


Dimple Hayathi expressed her happiness in being part of the third collaboration between Gopichand and Sriwass. “I’ll be seen as Bhairavi in the film and I hope you all like her and she entertains you. You will enjoy the film in theatres,” she stated.


Co-producer Vivek Kuchibhotla mentioned that Ramabanam is ideal for family viewing this summer and said Gopichand’s action sequences will be a feast for viewers. “I thank Gopichand and Sriwass for their efforts. Mickey J Meyer has come up with a fantastic album. I’m sure it’ll do well at the box office,” he averred.


Writer Madhu promised a new twist to a sibling drama with Ramabanam. “The film is a perfect entertainer with all the ingredients in the right mix. Audiences will enjoy it and we can’t wait for May 5 already.”Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !