View

సెల్ఫిష్ మాకు లైఫ్ ఇచ్చే సినిమా - హీరో ఆశిష్

Monday,May01st,2023, 03:36 PM

యంగ్ హీరో ఆశిష్, నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్‌ తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్‌’తో వస్తున్నారు.


పోస్టర్లలో ఆశిష్ మాస్ క్యారెక్టర్, నిర్లక్ష్య వైఖరిని మనం ఇప్పటివరకు చూశాం. ఈ రోజు, మేకర్స్ ఫస్ట్ సింగిల్‌ ను లాంచ్ చేశారు. ఇది హీరో పాత్ర తాలుకా మరొక కోణం చూపుతుంది. ఇది సెల్ఫిష్ దిల్ కా ఫస్ట్ బీట్. దిల్ ఖుష్ పాటలో కథానాయిక పాత్ర పోషించిన ఇవానాని ఆరాధించే కథానాయకుడి ఆనందాన్ని ప్రజెంట్ చేస్తుంది. ఈ పాటను తెలుగు, హిందీ పదాల అందమైన అల్లికతో సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాశారు.


మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ లైవ్లీ బీట్‌ లతో చక్కని మెలోడీని స్కోర్ చేశాడు. జావేద్ అలీ పాటను అద్భుతంగా పాడారు. ఈ పాట చార్ట్‌బస్టర్‌ గా మారడానికి అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. అలాగే పాట మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో వుండబోతుంది. ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యే ఈ పాట ఒక అడిక్టివ్ నెంబర్.
ఆశిష్ తన డ్యాన్స్ స్కిల్స్ ని చక్కగా ప్రదర్శించాడు. ఎనర్జిటిక్‌ గా కనిపించే యంగ్ చాప్ ఎలిగెంట్ మూవ్స్ తో ఆకట్టుకున్నాడు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.


సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఆశిష్ పుట్టిన రోజు మీడియా మిత్రుల ద్వారా ఈ పాటని విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. సుకుమార్ నేను మళ్ళీ 19 ఏళ్ల తర్వాత క్రియేటివ్ వర్క్ చేస్తున్నాం. రౌడీ బాయ్ జరుగుతున్నపుడు ఈ సినిమా ఐడియా వున్నప్పుడే ఆసక్తికరంగా కనిపించింది. రౌడీ బాయ్ ఒక కొత్త కుర్రాడికి రావల్సినంత రెవెన్యూ తెచ్చుకొని, ప్రశంసలు కూడా అందుకుంది. ఆశిష్ కు మంచి మార్కులు పడ్డాయి. సెల్ఫిష్ కథ విన్నప్పుడు ఆశిష్ కు బావుంటుందనిపించింది. మిక్కీ మాంచి ట్యూన్ ఇచ్చారు. ఈ పాట లిరిక్స్ విషయంలో మొదటి నుంచి చాలా పట్టుదలగా వున్నాను. లిరిక్స్ ఇంత బాగా రావడానికి కారణం రామజోగయ్య శాస్త్రి గారు. మిక్కీ తో మాది అద్భుతమైన జర్నీ. అందరూ కష్టపడి మంచి సాంగ్ ఇచ్చారు. మేరా దిల్ ఖుష్ హువా.. నా ‘దిల్’ రైట్స్ఈ పాటకు తీసుకున్నారు. (నవ్వుతూ). ఓల్డ్ సిటీ నేపధ్యంలోజరిగే ఈ కథలో హిందీ లిరిక్స్ కూడా అవసరమయ్యాయి. దానికి తగ్గట్టుగానే కొన్ని హిందీ పదాలు కూడా వాడాం. ఇది ధూల్ పేట్ నేపధ్యంలో కి వచ్చిన తర్వాత ఓ కొత్త ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందులో ఇదొక్క పాటే మిక్కీ జే మేయర్ చేస్తున్నారు. అనూప్ రుబెంస్ మరో రెండు పాటలు చేశారు. మరో రెండు పాటలు వేరే సంగీత దర్శకులు చేస్తారు. సినిమాకి సరిపోయేలా కొత్తగా చేయాలని ప్రయత్నిస్తున్నాం. దర్శకుడు కాశీ విశాల్ ని ఖచ్చితంగా కష్టపెడతాను( నవ్వుతూ) ప్రేక్షకులకు విజయవంతమైన సినిమా ఇవ్వడం అంత తేలికకాదు. దసరా, విరూపాక్ష, బలగం.. ఇలా కొత్తదనంతో కొత్త దర్శకులు తీసిన చిత్రాలని ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి. కొత్తదనం లేకపోతే చూడటానికి ప్రేక్షకులు రెడీగా లేరు. అది ఇవ్వడానికి రాత్రిపగలు కష్టపడాల్సిందే. మాంచి టీమ్ తో చేస్తున్న చిత్రమిది. సినిమాని నేచురల్ గా తీయడానికి ప్రయత్నిస్తున్నాం. నేను గానీ, సుకుమార్ గారు గానీ వెనుక మాత్రమే వుంటాం. ప్రేక్షకులకు నచ్చాల్సింది మాత్రం ఆశిష్. దాని కోసం తను రాత్రిపగలు కష్టపడితేనే ప్రేక్షకులకు రీచ్ అవుతారు. మంచి సినిమాని ఎంపిక చేసుకొని కష్టపడితేనే ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ అవ్వడానికి అవకాశాలు వున్నాయి. అవకాశం వుంది కాబట్టి కష్టపడాలి. కష్టపడితే ఆ కష్టాన్ని గుర్తించి ఎదో ఒక రోజు ఒక మంచి సినిమాతో ప్రేక్షకులు తమ హృదయాల్లోకి తీసుకుంటారు’’ అన్నారు.


ఆశిష్ మాట్లాడుతూ.. మీడియా మిత్రులతో కలసి పాటని లాంచ్ చేయడం చేయడం చాలా ఆనందంగా వుంటుంది. నా బర్త్ డే ఇంత స్పెషల్ గా చేసినందుకు కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం నేను, దర్శకుడు కాశీ చాలా కష్టపడ్డాం. ఇది మా ఇద్దరికీ ఒక జీవితం. ఇది మాకు లైఫ్ ఇచ్చే సినిమా.ప్రాణం పెట్టి కష్టపడ్డాం. ఇంకా షూటింగ్ జరుగుతోంది. యువరాజ్ గారు అద్భుతమయానా విజువల్స్ ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రి చాలా చక్కనిసాహిత్యం అందించారు. ఈ పాట నా కెరీర్ లో గుర్తుండిపోతుంది. ఇంత మంచి పాట ఇచ్చిన మిక్కీ జే మేయర్ గారికి కృతజ్ఞతలు. చిత్ర యూనిట్అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. హర్షిత్ అన్నకి థాంక్స్. రాజు గారి మాటల్లో కృతజ్ఞతలు చెప్పలేను. చెప్పినా అది సరిపోదు. ప్రక్రుతికే వదిలేస్తున్నా. భవిష్యత్ లో ప్రకృతే నా నుంచే కృతజ్ఞతలు చెబుతూ వుంటుంది’’ అన్నారు.


విశాల్ కాశీ మాట్లాడుతూ.. నేను సుకుమార్ గారి దగ్గర పని చేశాను. ఆయనకి ఈ పాయింట్ చేపినపుడు చాలా నచ్చింది. స్క్రిప్ట్ వర్క్ చేశాం. ఈ పాయింట్ కి రాజు గారే కరెక్ట్ అని సుకుమార్ గారు చెప్పారు. రాజు గారు సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. క్యారెక్టరైజేషన్ సెల్ఫిష్ మాస్ లవ్ స్టొరీ. మీ అందరికీ నచ్చుతుంది. నా గురువు గారు సుకుమార్. ఆయన గురువు గారు రాజు గారు. ఈ ఇద్దరూ కలసి నన్ను దర్శకుడిగా పరిచయం చేయడం ఆనందంగా అదృష్టంగా అనిపిస్తోంది. ఆశిష్ తన పాత్రని అద్భుతంగా చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ గారు మంచి ట్యూన్ ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రి గారు చాలా అద్భుతమైన సాహిత్యం రాశారు. శిరీష్ గారికి మాటీంకి అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.


రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ఆశిష్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ సినిమా ఆశిష్ కి గొప్ప విజయాన్ని ఇస్తుంది. దీనికి కారణం డిఫరెంట్ పాయింట్, సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన కాశీ విశాల్ స్క్రిప్ట్, మంచి ప్రొడక్షన్ వాల్యూస్, మిక్కీ జే మేయర్ మ్యూజిక్.. ఇలా అన్నీ చక్కగా కుదిరాయి. ఈ పాట మీకు నచ్చడానికి కారణం దర్శకుడు ఇచ్చిన ఇన్ పుట్. సినిమా చూసినప్పుడు ఇంకా మంచి అనుభూతి పొందుతారు. అలాగే ఈ పాట ఇంత అందంగా రావడానికి కారణం రాజు గారి ప్యాషన్. అందరినీ సంధానం చేస్తూ పట్టువదని విక్రమార్కుడిలా కృషి చేశారు. రాసినప్పుడే ఈ పాట బ్లాక్ బస్టర్ అని అర్ధమైయింది. పాటలానే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అన్నారు.


హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అశోక్ బండ్రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.


సెల్ఫిష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.


తారాగణం: ఆశిష్, ఇవానా


సాంకేతిక విభాగం:
రచయిత, దర్శకత్వం: కాశీ విశాల్
నిర్మాతలు: దిల్ రాజు-శిరీష్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్రాఫర్: యువరాజ్ జె
సంగీతం: మిక్కీ జె మేయర్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి
పీఆర్వో: మదురి మధు, వంశీ-శేఖర్


First Single Dil Kush Launched from Selfish


Young hero Ashish is coming up with a youthful mass entertainer Selfish being directed by debutant Kasi Vishal and produced by ace producer Dil Raju, and Shirish’s Sri Venkateswara Creations, in association with Sukumar Writings.
We have so far seen Ashish’s mass character and reckless attitude in the posters. Today, they began the first single which shows the other side of the character. It’s a Dil Ka First Beat. The song Dil Kush shows the jubilation of the protagonist who adores the beautiful girl played by Ivana. The song mix of Telugu and Hindi words was penned by Saraswatiputra Ramajogayya Sastry.


Mickey J Meyer who is a melody specialist scored a soothing melody with lively beats. Javed Ali crooned the song so enchantingly. This song has all the facets to become a chartbuster and this is going to top the music charts in no time. While it connects instantly, it is an addictive number.


Ashish showcases all his dancing skills. The young chap who looked energetic has performed some elegant dance moves. The choreography is done by Bhanu master.


Harshith Reddy and Hanshitha Reddy are the co-producers of the film and Ashok Bandreddy is the executive producer. J Yuvaraj is handling the cinematography. Prawin Pudi is the editor, while Kiran Kumar Manne is the art director.
The shoot of Selfish is presently happening in Hyderabad.


Cast: Ashish, Ivana

 

Technical Crew:
Writer, Director: Kasi Vishal
Producers: Dil Raju-Shirish
Banners: Sri Venkateswara Creations, Sukumar Writings
Cinematographer: Yuvaraj J
Music Director: Mickey J Meyer
Art Director: Kiran Kumar Manne
Co-Producers: Harshith Reddy, Hanshitha Reddy, Ashok Bandreddi
PRO: Maduri Madhu, Vamsi-Shekar

 Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !