View

'రింగా రింగా రోసే.. పిల్లా నిన్ను చూసే' అంటున్న 'అథ్వర్య'

Monday,May15th,2023, 02:05 PM

సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌ జానర్‌లో వచ్చే సినిమాల్లో రొమాంటిక్, లవ్ ట్రాక్ సాంగ్స్ ఎక్కువగా ఉండవు. కానీ 'అథర్వ' అనే చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్, సాంగ్స్ ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్యాచీ పాటను మేకర్లు విడుదల చేశారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా  హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్‌ పాకాల పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రింగా రింగా రోసే.. పిల్లా నిన్ను చూసే సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. శ్రీచరణ్‌ పాకాల బాణీ, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం, జావెద్ అలీ గాత్రం అన్నీ చక్కగా కుదిరాయి. ఇక డ్యాన్స్ మాస్టర్ రాజ్ కృష్ణ కొరియోగ్రఫీ కూడా చూడచక్కగా ఉంది. 


పాటను రిలీజ్ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మహేష్ మాట్లాడుతూ.. 'మేం విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్‌లోనే ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని తెలియజేశాం. హీరో చిన్నతనం నుండి హీరోయిన్‌ను ప్రేమిస్తుంటాడు కానీ చెప్పలేక పోతాడు. ఆలా తన ఫీలింగ్‌ను సినిమాలో ఈ పాటతో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఈ పాట ఆ సన్నివేశానికి సరిగ్గా సరిపోతుందని ఎంచుకున్నాం. శ్రీ చరణ్ ఈ పాటలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. తనకు జన్మదిన శుభాకాంక్షలు. మేం అడిగిన వెంటనే లిరిక్ రైటర్ మంచి పాట రాశాడు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంద'ని అన్నారు.


చిత్ర నిర్మాత సుభాష్ మాట్లాడుతూ.. 'అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఇంతకుముందు మేం విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు టీం అంతా చాలా కష్టపడ్డాం. నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన'ని అన్నారు.


హీరో కార్తీక్ మాట్లాడుతూ.. 'కౌసల్య  కృష్ణమూర్తి సినిమా ద్వారా నన్ను వెలుగులోకి తీసుకువచ్చిన  భీమనేని శ్రీనివాస్ రావు గారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. ఈ రోజు మేము విడుదల చేసిన సాంగ్ ప్రేక్షకులకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో అందరూ చాలా బాగా నటించారు. దర్శకుడు సినిమాను చాలా బాగా తీశాడు. నిర్మాత సుభాష్ కథకు ఏం కావాలో అన్నీ సమాకూర్చడమే కాకుండా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను చాలా చక్కగా నిర్మించారు' అని అన్నారు. 


హీరోయిన్ సిమ్రన్ చౌదరి మాట్లాడుతూ.. 'ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అయినా ఇందులో చాలా ఏమోషన్స్ ఉన్నాయి. నేను డ్యాన్సర్ అయినా నాకు ఇందులో ఒక్క స్టెప్ వేసే అవకాశం కూడా రాలేదు. టీం అంతా కూడా చాలా సపోర్ట్ చేసింది. ఇలాంటి సినిమాలో  నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు. నా కో స్టార్ కార్తీక్ చాలా హానెస్ట్ పర్సన్. శ్రీ చరణ్  మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు విడుదల చేసిన ఈ సాంగ్ చాలా క్యాచీగా ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంద'ని అన్నారు.


నటుడు గగన్ మాట్లాడుతూ.. 'నాకు తెలిసి రింగా రింగా అనే పాట తెలియని వారుండరు. ఇప్పుడు అలాంటి పదంతో  మేము విడుదల చేసిన రింగ రింగా రోసే సాంగ్ కూడా కచ్చితంగా ట్రెండ్ అవుతుంది. మంచి కథతో వస్తున్న ఈ సినిమా ద్వారా మాకు, దర్శక, నిర్మాతలకు మంచి పేరు రావాలని  మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను' అని అన్నారు.


నటుడు కిరణ్ మచ్చ మాట్లాడుతూ.. 'యూట్యూబ్ నుంచి వచ్చిన నాకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు సినిమా చాలా బాగా వచ్చింది. శ్రీ చరణ్ అన్న చేసిన రింగ రింగ సాంగ్ అందరికీ కచ్చితంగా నచ్చుతుంద'ని అన్నారు.


కొరియోగ్రాఫర్ బాను మాస్టర్ మాట్లాడుతూ.. 'మహేష్ అన్న నాకు సాయి ధర్మతేజ్ తిక్క సినిమా నుండి పరిచయం. తను ఈ సినిమాను చాలా బాగా తీశాడు. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి చాలా బాగా నటించారు. ఈ సినిమా నుండి  విడుదల చేసిన రింగ రింగ సాంగ్ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. త్వరలో వస్తున్న మా సినిమాకు బ్లెస్సింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు.


నటుడు విజయ్ రామారాజు మాట్లాడుతూ.. 'ఈ సినిమా బిగ్ సక్సెస్ అయ్యి మా తో పాటు దర్శక, నిర్మాతలకు మంచి పేరు రావాల'ని అన్నారు.
రమణ మాట్లాడుతూ.. 'అందరికీ గుర్తుండిపోయే సినిమాగా ఈ "ఆథర్వ" నిలుస్తుంద'ని అన్నారు.


నటీనటులు 
కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుల్హన్, విజయ్ రామారాజు, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ తదితరులు


సాంకేతిక నిపుణులు 
సమర్పణ: నూతలపాటి నరసింహం, అనసూయమ్మ బ్యానర్: పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ రచన,దర్శకత్వం: మహేష్ రెడ్డి నిర్మాత: సుభాష్ నూతలపాటిఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌: విజయ, ఝాన్సీ సంగీతం: శ్రీచరణ్ పాకాలడిఓపి చరణ్ మాధవ నేనిఎడిటింగ్ ఎస్.బి ఉద్ధవ్ఆర్ట్ రామ్ కుమార్లిరిసిస్ట్ :  కాసర్ల శ్యామ్ కిట్టు విస్సా ప్రగడకొరియోగ్రాఫర్స్ భాను రాధాకృష్ణ విజయ్పి.ఆర్.ఓ : సాయి సతీష్ పర్వతనేని రాంబాబు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !